సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి! | MM Keeravani a part of 'Sathya Gang' film's promotion | Sakshi
Sakshi News home page

సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి!

Published Sat, Mar 17 2018 12:40 AM | Last Updated on Sat, Mar 17 2018 12:40 AM

MM Keeravani a part of 'Sathya Gang' film's promotion - Sakshi

అక్షిత, సాత్విక్‌

‘‘అనాథలకు సంబంధించిన కథతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్‌’. ఈ చిత్రంలో చంద్రబోస్‌గారు అనాథలపై రాసిన పాట బాగుందని అందరూ అంటున్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం కోటీ యాభైలక్షలు విలువ చేసే స్థలాన్ని అనాథలకు ఉచితంగా ఇచ్చా. మా సినిమా చూడండి. బాగా లేకపోతే టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా’’ అని నిర్మాత మహేశ్‌ ఖన్నా అన్నారు.

సాత్విక్‌ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ ఖన్నా నిర్మించిన‘సత్యగ్యాంగ్‌’ త్వరలో విడుదల కానుంది. పాటల రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో అనాథలపై ఓ మంచి పాట రాశా. ఇందుకు మహేశ్‌ ఖన్నాగారికి, ప్రభాస్‌గారికి థ్యాంక్స్‌. నా పాట విని, కీరవాణిగారు అభినందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘సత్యగ్యాంగ్‌’ వంటి మంచి సినిమాతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది’’ అన్నారు సాత్విక్‌ ఈశ్వర్‌. ఈ చిత్రానికి నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: మహేష్‌ ఖన్నా, సంగీతం–దర్శకత్వం: ప్రభాస్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement