సుహాసిని
విద్యారణ్యపురి వరంగల్: నకిలీ కుల ధ్రువీకరణ పత్రం తో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఐదు, ఆరో జోన్ల ఇంటర్ విద్య ఆర్జేడీ(ఎఫ్‌ఏసీ) సుహాసినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ప్రభుత్వ స్పెషన్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సుహాసిని ము న్నూరుకాపు సామాజిక వర్గం అనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో ఎస్టీ కేటగిరీలో 1991లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈమె లెక్చరర్‌గా నియామకమయ్యారు. 2005లో ప్రిన్సి పాల్‌గా, 2014లో ఇంటర్ విద్య ఆర్‌ఐఓగా పదోన్నతి పొం దారు. గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలో డీఐ ఈఓగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సుహాసినికి 2016లో ఐదవ, ఆరవజోన్‌కు సంబంధించిన వరంగల్ ఇంటర్ విద్య ఇన్‌చార్జి ఆర్జేడీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
గత కొన్ని నెలల క్రితమే ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్‌ఏసీ) కూడా ఇచ్చారు. అయితే సుహాసిని ఎస్టీ కాదని, ఆమెది మున్నూరుకాపు సామాజిక వర్గమని, నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందారని ఆరోపిస్తూ ఓ సంస్థ బాధ్యులు కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం సుహాసినిపై ఉన్నతాధికారులతో విచారణ చేయించింది. విచారణలో సుహాసిని ఎస్టీ కాదని, నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందినట్లు వెల్లడైనట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం సుహాసినిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సస్పెన్షన్‌లోనే కొనసాగిస్తారు. సుహాసినిని హెడ్‌క్వార్టర్ కూడా వదిలి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింది.
ఇన్‌చార్జి ఆర్జేడీగా హన్మంతరావు
కాగా సుహాసినిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఐదు, ఆరో జోన్ వరంగల్ ఇంటర్ విద్య ఆర్జేడీగా హన్మంతరావును నియమించినట్లు తెలిసింది. సుహాసినిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో డీఐఈఓగా పనిచేస్తున్న హన్మంతరావును ఆమె స్థానంలో వరంగల్ ఇన్‌చార్జి ఆర్జేడీగా నియమించారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో హన్మంతరావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment