
అమృత, ఎఫ్‌ఆర్వో
సాక్షి, గూడూరు(వరంగల్): గూడూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ అమృత కంపా నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారుల విచారణలో తేలడంతో సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గూడురు ఫారెస్టు రేంజ్‌లో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాగా ఆమె కాజేసినట్లు సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి.
ఈ నెల 5వ తేదీ మానుకోట స్ట్రైకింగ్ ఫోర్స్, భద్రాద్రి కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎఫ్‌ఆర్వో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్ భీమానాయక్‌ను పీసీసీఎఫ్ శోభారాణి ఆదేశించారు. ఈ మేరకు ఎఫ్‌ఆర్వో అమృతను సస్పెన్షన్ చేస్తున్నట్లు సీసీఎఫ్ భీమానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment