వయసుతో సంబంధం లేదు! | Ambareesh to play Raj Kiran's role in 'Pa Paandi' Kannada remake | Sakshi
Sakshi News home page

వయసుతో సంబంధం లేదు!

Published Sun, Sep 16 2018 2:07 AM | Last Updated on Sun, Sep 16 2018 2:07 AM

Ambareesh to play Raj Kiran's role in 'Pa Paandi' Kannada remake - Sakshi

అంబరీష్‌

వయసు దేహానికి పెరుగుతుంది. మనసుకు కాదు. అందుకే ప్రేమకు వయసుతో సంబంధం లేదు. దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో తమిళంలో ‘పవర్‌ పాండీ’ అనే సినిమా రూపొందింది. నిర్మాత–నటుడు ధనుష్‌ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడంలో ‘అంబి నింగే వయస్సాయ్తో’ అనే పేరుతో రీమేక్‌ అయ్యింది. ఇందులో కన్నడ స్టార్‌ హీరో అంబరీష్‌ నటించారు.

అంబరీష్‌ యంగ్‌ ఏజ్‌ నాటి సీన్స్‌లో సుదీప్‌ కనిపిస్తారు.అన్నట్లు.. ఈ సినిమాకు సుదీప్‌ కూడా ఓ నిర్మాత. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాతో గురుదత్తా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సుహాసిని ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాకు అర్జున్‌ జన్యా సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement