ధ్రువన్, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బలమెవ్వడు'. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, టైటిల్ సాంగ్‌ని కీరవాణి ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంగీత ప్రపంచంలో మణిశర్మ, కీరవాణిలది ప్రత్యేక స్థానం. అలాంటిది ఓ సాంగ్ కోసం ఇద్దరూ కలిశారు.
మణిశర్మ స్వరాలకి కీరవాణి గాత్రం అందించారు. ఈ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇక సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి ఆధరణ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment