చిట్టి చిలుక | Suhasini Mani Ratnam directs short film Chinnachiru Kiliye | Sakshi
Sakshi News home page

చిట్టి చిలుక

Published Fri, May 8 2020 5:28 AM | Last Updated on Fri, May 8 2020 5:28 AM

Suhasini Mani Ratnam directs short film Chinnachiru Kiliye - Sakshi

సుహాసిని

లాక్‌ డౌన్‌ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను వినోదపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు, వీడియోలు, షార్ట్‌ ఫిల్మస్‌ ఇలా ఏదోటి చేస్తున్నారు స్టార్స్‌. తాజాగా సీనియర్‌ నటి సుహాసిని కూడా ఓ షార్ట్‌ ఫిలిం తీశారు. దీని పేరు ‘చిన్నంజిరు కిళియే’ (చిట్టి చిలుక). 20 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ ఫిలిం లో మళయాళ నటి ఆహా కష్ణ ముఖ్య పాత్రలో నటించారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి ఈ షార్ట్‌ ఫిలింను పూర్తి చేశారు. ఐ ఫోన్‌లో షూట్‌ చేసిన ఈ షార్ట్‌ ఫిలిం ఈ వారంలో విడుదల కానుంది. ఇది కరోనా వైరస్‌పై అవగహనకు సంబంధించిందా లేకపోతే వేరే కథాంశంతో తెరకెక్కిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement