Suhasini Maniratnam Love Story: సుహాసిని.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగు నాట పుట్టకపోయినా.. తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారామె. వాస్తవానికి.. సుహాసిని తమిళ చిత్రాలతో అరంగేట్రం చేసినప్పటికీ.. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా జేజేలు అందుకున్నారు. ఇక ఈ నటి పెళ్లి ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఈ జంట పెళ్లి గురించి అనేక వదంతులు వచ్చాయి. వీరిది ప్రేమ వివాహమా? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? అని చాలా మందికి ఇప్పటికీ ఓ తీరని సందేహమే!
వీరి పెళ్లి ఎలా జరిగిదంటే.. 1988లో సుహానికి తండ్రి చారుహాసన్(హీరో కమల్ హాసన్ అన్నయ్య) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారట. అప్పుడు సుహాసిని తండ్రి దగ్గరకు వెళ్తే.. ఇకపై సినిమాలు చెయ్యొద్దని అన్నారట. ఆమె గురించి, మణిరత్నం గురించి బయట వదంతులు వస్తున్నాయని, దీని గురించి ఒక్కసారి అతనితో మాట్లాడమని చెప్పాడట. తండ్రి సూచనతో సుహాసిని మణిరత్నంకు ఫోన్ చేసి మాట్లాడారట.
అయితే అప్పటికే మణిరత్నంపై ఒక రకమైన గౌరవం ఉన్న సుహాసినికి ఫోన్ సంభాషణ ద్వారా అది మరింత పెరిగింది. ప్రత్యక్షంగా కలుసుకొని గంటలు, గంటలు మాట్లాడుకున్నారట. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ పుట్టి, అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదట. ఇరు కుటుంబాల పెద్దలే మాట్లాడుకొని వీరి వివాహం జరిపించారట. ఈ విధంగా ఇండస్ట్రీలో వచ్చిన వదంతులే మణిరత్నం, సుహాసినిల పెళ్లికి పునాదులు వేశాయి. 1988 ఆగస్ట్ 25న వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. పేరు నందన్ . అన్నట్లు ఈ రోజు(ఆగస్ట్ 15) సుహాసిని పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమె బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment