
'మచ్చిక చేసుకుని మట్టుబెట్టాడు'
హైదరాబాద్: ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులను మచ్చిక చేసుకుని మట్టుబెట్టాడని ఆయన భార్య సుహాసిని వాపోయారు. తొమ్మిదేళ్లుగా అతడి పెట్టిన చిత్రహింసలు భరించలేకే పుట్టింటికి వచ్చినట్టు ఆమె తెలిపారు. కన్న కొడుకులను కర్కశంగా చంపడానికి అతడికి చేతులెలా వచ్చాయంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
కాగా, గురుప్రసాద్ ఇద్దరు కుమారుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మెడపై వేట కొడవళ్లతో నరికి చంపినట్టు వైద్యులు గుర్తించారు. తాను ఆత్మహత్య చేసుకునేముందు గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులను హత్యచేసి పాతిపెట్టాడు. వీరి మృతదేహాలను సోమవారం వెలికితీశారు.