గురుప్రసాద్ చివరి సెల్ఫోన్ సంభాషణ | ICFAI University Professor Guruprasad Last cell phone conversation with wife | Sakshi
Sakshi News home page

గురుప్రసాద్ చివరి సెల్ఫోన్ సంభాషణ

Published Tue, Oct 7 2014 10:24 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

గురుప్రసాద్ చివరి సెల్ఫోన్ సంభాషణ - Sakshi

గురుప్రసాద్ చివరి సెల్ఫోన్ సంభాషణ

పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడదామని ముందే నిర్ణయానికి వచ్చిన ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన భార్యతో ఫోన్లో మాట్లాడి, ఆ సంభాషణలను రికార్డు చేశాడు. వాటిలో అతడేమన్నాడంటే...
 
 ‘‘రేపు పోతున్నా స్వామీ. నిన్ను కలవాలని నా మనసులో ఉంది. అందుకే మాట్లాడుతున్నా. నువ్వు నా నుంచి విడిపోవాలనుకుంటే నిన్ను ఆపేవారెవరూ లేర్రా. కలిసుండటమా లేదా అనేది రేపు డిసైడ్ అవుతది. నిత్యం నిన్ను కలవాలని, నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారా. నువ్వు చెప్పినట్లే ఇంటా స్వామీ. కానీ నువ్వు బయటపడవు.

నీకు ‘నా భర్త, నా పిల్లలు’ అనే భావన లేదు. నన్ను కావాలనుకోవడం లేదు. నాకేమైనా దురలవాట్లున్నాయా? బయటికెళ్తే ‘నీ భర్త, పిల్లలు ఎక్కడ?’ అని నిన్నడుగుతారు. డబ్బు ధైర్యం ఇస్తుంది కానీ డబ్బొక్కటే ముఖ్యం కాదురా...! నువ్వెంతో ధైర్యవంతురాలివి. నీవు లేని ప్రతి నిమిషం నాకు డిస్టర్బ్‌డ్‌గా ఉంది.

నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను.. నా ఇంటికి వస్తే నేను నిన్ను చంపుతావని అనుకుంటున్నావు. మనమేమైనా కసాయిలమా? పదేళ్లు కలిసున్నాం. ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? మనం విడిపోతే పిల్లలు అన్యాయమైపోతారు స్వామీ. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. ఆ పేపర్‌పై సంతకం చేస్తేనే నేను నీవద్దకు వస్తాన ంటే.. నేనలా చేయను. దాంట్లో చాలా తప్పులున్నాయి స్వామీ. నేనలా చేయకూడదురా’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement