శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేట మండల సాక్షర భారత్ కో ఆర్డినేటర్ గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. 16 నెలలుగా తనకు వేతనాలు అందడం లేదంటూ సాక్షర భారత్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న కుమారస్వామి ఎంపీడీవో కార్యాలయం వద్ద వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. కమీషన్ ఇవ్వనందున వేతనాల ఫైలుపై ఎంపీపీ రమాదేవి సంతకం చేయడంలేదని అతడు వాపోయాడు.