వైఎస్‌ జగన్‌ నమ్మకాన్ని నిలబెడతా.. | Siva Rama Subrahmanyam Takes Charge YSRCP Coordinator | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నమ్మకాన్ని నిలబెడతా..

Published Tue, Sep 10 2019 8:08 PM | Last Updated on Tue, Sep 10 2019 8:13 PM

Siva Rama Subrahmanyam Takes Charge YSRCP Coordinator - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీని విజయ పంథాన నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు భరత్, గీత, అనురాధ, ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement