Rajahmandry
-
పులి సాగర్‌పై దాడి ఘటన.. పీఎస్‌లో మార్గాని భరత్ ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన దళిత యువకుడు పులి సాగర్‌పై జరిగిన దాడి ఘటనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో బంధించి సీఐ దాష్టీకంపై ఆయన మండిపడ్డారు. దళితులపై కూటమి సర్కార్ వేధింపుల పట్ల భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి సాగర్‌కు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు.కాగా, రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాధితుడు పులి సాగర్‌కు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను ఆదేశించారాయన.రెండురోజుల క్రితం పులిసాగర్‌ను కొందరు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో జగన్‌కు సాగర్ వివరించాడు. అయితే సాగర్‌కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. -
రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసం
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడుతున్నారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు. టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలా ఫలకాన్ని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంతో మందితో పోరాడి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టామని.. అలజడి సృష్టించడం వల్ల ఉపయోగం లేదన్నారు.‘‘రాజమండ్రి ప్రశాంతమైన నగరం. ప్లైఓవర్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు శిలాఫలకంపై నా పేరు మాత్రమే కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్లు కూడా ఉన్నాయి. శిలాఫలం ధ్వంసం చేసినా ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరు. అలజడి సృష్టించటం వల్ల ఉపయోగం లేదు. అభివృద్ధి కోసం పాటుపడాలి’’ మార్గాని భరత్ హితవు పలికారు. -
ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఎంపీ భరత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్‌ప్రెస్‌లు హాల్ట్స్, స్టాప్స్‌కు అనుమతి కోరారు. విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు. విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు. బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రావలసి వస్తోందన్నారు. నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
గంటా సన్నిహితుడి మిత్రుడు అదృశ్యం
దొండపర్తి (విశాఖ దక్షిణ), కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. విశాఖ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్ (60) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడున్న క్రేటా కారు (ఏపీ 39 ఈక్యూ 9999) వద్ద ఓ లేఖ లభ్యమైంది. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు ఆయన గోదావరిలో దూకి చనిపోయాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఉదయం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కారు ఆగి ఉండటాన్ని గుర్తించి స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలు, గోదావరిలో గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రూ.12 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి.. విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిర్లంపూడి లేఅవుట్ ‘ది పామ్స్’ అపార్ట్మెంట్లో చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, ఇటీవల చనిపోయిన నలంద కిషోర్‌కు ఆయన స్నేహితుడని తెలుస్తోంది. చంద్రశేఖర్ సుమారు రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇందులో రూ.6 కోట్లు మధ్యవర్తిగా ఇతరులకు ఇప్పించి ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ అదృశ్యంపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆయన నివాసంలో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. -
పేదలకు మేలు చేయడమే సీఎం జగన్ లక్ష్యం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో రుడా కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రిలో మరో 16 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్లనే స్థలాలు ఆగాయని పేర్కొన్నారు. ఇప్పటికే 6వేల మందికి టీడ్కో గృహాలు అందజేశామని తెలిపారు. పేద ప్రజలకు మేలు చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రాజమండ్రిని రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పరిపాలనా రాజధాని విశాఖకు తరలించడం ఖాయం: మంత్రి బొత్స పరిపాలనా రాజధాని విశాఖకు తరలించడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తామన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ‘‘రాష్ట్రంలో లేని చంద్రబాబు, లోకేష్‌లు పన్నుల విధానం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌కు అడ్రస్‌లు ఉన్నాయా.. ప్రతిపక్షంలో ఉండగానే సీఎం జగన్ తాడేపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నారు. పారదర్శకంగా రాష్ట్రం నూతన పన్నుల విధానాన్ని అమలు చేస్తుంది. దళారుల వ్యవస్థను నిరోధించడానికే కొత్త పన్నుల విధానం. రాష్ట్రంలో 50 శాతం పదవులు మహిళలకు ఉండాలని సీఎం చెప్పారు. రుడా చైర్మన్ పదవి కూడా మహిళలకే కేటాయించారని’’ బొత్స తెలిపారు. ఇవీ చదవండి: ‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’ రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ -
దేవినేని ఉమా అరెస్టు.. 14 రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి బ్యూరో/ జి.కొండూరు/ మైల వరం/హనుమాన్ జంక్షన్: ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. తన అనుచరులను, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గడ్డమణుగు గ్రామస్తులపై దాడి చేయించిన ఉమాకు మైలవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన హయాంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి దేవినేని ఉమా కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని ఆధారాలతో సహా ఎమ్మెల్యే తిప్పికొట్టడంతో ఉమా నియోజకవర్గంలో అల్లర్లకు కుట్ర పన్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ హంగామా మొదలుపెట్టారు. వాస్తవానికి అక్కడ తవ్వకాలకు అనుమతులను టీడీపీ హయాంలో దేవినేని ఉమానే ఇప్పించాడు. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న ఉద్దేశంతో దేవినేని వ్యూహాత్మకంగా మంగళవారం కొండపల్లిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొండపల్లి రిజర్వ్ ఫారెస్టుకు వెళ్లి.. వైఎస్సార్సీపీ నేతల ప్రోద్బలంతోనే తవ్వకాలు జరుగుతున్నాయంటూ ముందే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఎల్లో మీడియాలో ఊదరగొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామస్తులు మంగళవారం రాత్రి దేవినేని ఉమాను అడ్డుకున్నారు. ‘నువ్వు అధికారంలో ఉండగా చేసిన అడ్డగోలు పనులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు అంటగడుతున్నావ్.. దీనికి సంజాయిషీ చెప్పాలి’ అంటూ ఉమాను నిలదీశారు. పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దేవినేని ఉమా కూడా తన అనుచరగణంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 4 గంటలకు పైగా పోలీస్‌స్టేషన్ వద్ద కారులోనే ఉన్న ఉమా తన అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో వారంతా కలిసి పాలడుగు దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన డ్రైవర్ సురేష్ తదితరులపై దాడి చేశారు. పోలీస్‌స్టేషన్ ముందే దుర్గాప్రసాద్ కారును ధ్వంసం చేశారు. దళితుడైన సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి అదుపు తప్పడంతో దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేసి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అశాంతి రేపడానికి దేవినేని ఉమా, టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారని గడ్డమణుగు గ్రామస్తులు మండిపడ్డారు. వర్చువల్‌గా కోర్టుకు హాజరు.. మైలవరం కోర్టుకు ఉమాను తీసుకొస్తారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకొని హల్చల్ చేశారు. దీంతో పోలీసులు దేవినేని ఉమాను నందివాడ నుంచి హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే జూమ్ యాప్ ద్వారా వర్చువల్‌గా మైలవరం న్యాయమూర్తి షేక్ షెరీన్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం దేవినేని ఉమాకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న తెలుగు యువత నాయకుడు లీలా ప్రసాద్, డ్రైవర్ ప్రసాద్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
19 మంది మహిళా ఖైదీల విడుదల
రాజమహేంద్రవరం : మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల అవుతున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలయ్యారు. కొన్ని పూచీ కత్తులపై రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గం సుగుమం చేసిన విషయం తెలిసిందే. శిక్షా కాలం పరిమితి ముగిసే వరకూ ప్రతీ మూడు నెలలకు ఒక సారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. (చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్పీ చరణ్ హర్షం) బయటకు వెళ్ళిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసి ముందుస్తూ విడుదల రద్దు అవుతుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది విడుదల కాగా వారిలో నలుగురు డీగ్రీ చదివినవారు ఉండగా, ఇద్దరు ఎం.ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సెంట్రల్ జైల్ నుంచి ప్రత్యేకంగా మహిళా ఖైదీలు మాత్రమే విడుదల కావడం రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారి కావడంతో ఖైదీల కుటుంబాలలో ఆనందాలు వెల్లువెత్తాయి. తమ కుటుంబాలతో గడిపే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖైదీల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన మహిళలకు ఎంపీ మార్గాని భరత్ రామ్ నిత్యావసరాలు ,దారి ఖర్చులు అందించగా, చిన జీయర్ ట్రస్ట్ కుట్టుమిషన్లు, చందనా బ్రదర్స్ నిర్వాహకులు చందనా నాగేశ్వర్ మహిళలకు చీరలు అందచేశారు.(చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..) గర్భవతిగా జైలుకు వచ్చి పసిబిడ్డతో విడుదల రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒక మహిళా ఖైదీ గర్భవతిగా జైలుకు వచ్చింది. శిక్ష అనుభవిస్తూ అక్కడే పురుడు పోసుకుంది. ఆమెకు జన్మించిన పాపకు ప్రస్తుతం నాలుగేళ్లు. పసి పాపతోనే ఆ మహిళ జైలులో డిగ్రీ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో తల్లి బిడ్డ శుక్రవారం విడుదల అయ్యారు. మహిళా జైలులో ఖైదీలకు టైలరింగ్, కవర్లు తయారీ, బేకరీ, తదితర వృత్తులలో శిక్షణ ఇచ్చారు. ఇక ఖైదీలు విడుదలైన అనంతరం వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు సంస్ధల సహకారం తో మహిళా ఖైదీలకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జైల్ అధికారులు తెలిపారు. కాగా విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళ ఖైదీలు విడుదల అయ్యారు. విడుదలైన మహిళా ఖైదీలు గల్లేలా కాంతమ్మ (శ్రీకాకుళం జిల్లా) నీలపు రోజా (విశాఖపట్నం). సీఎం జగన్ మహిళ ఖైదీల విషయంలో మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
జనసేనకు షాకిచ్చిన ఆకుల
సాక్షి, విజయవాడ : జనసేన పార్టీకి సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ షాకిచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పవన్‌కు పంపించారు. కాగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సత్యనారాయణ కూడా పార్టీని వీడటం.. మరికొంత మంది నేతలు కూడా ఇదే బాటలో నడుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి. కాగా గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి సత్యనారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు... కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఇలా నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నా జనసేన అగ్రనేతలు స్పందించకపోవడం గమనార్హం. -
వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెడతా..
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్సార్సీపీని విజయ పంథాన నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు భరత్, గీత, అనురాధ, ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
8,500 కోట్లతో గోదావరి జిల్లాలకు వాటర్ గ్రిడ్
సాక్షి, తూర్పుగోదావరి: ఉభయగోదావరి జిల్లాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 8,500 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వాటర్ గ్రిడ్ విధివిధానాలపై చర్చించేందుకు ఉభయగోదావరి జిల్లాల మంత్రులు మంగళవారం రాజమండ్రిలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా వాటర్ గ్రిడ్ పూర్తయ్యాలా చర్యలు తీసుకోవాలని.. వాటర్ గ్రిడ్ అమలులో పూర్తి బాధ్యత అధికారులదేనని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకానికి కన్సల్టెన్సీల పేరుతో రూ.38 కోట్లు వృధా చేసిందని విమర్శించారు. అనుభవజ్ఞులైన అధికారులతో వాటర్ గ్రిడ్ పనులు సమర్ధవంతంగా చేపడతామని వెల్లడించారు. 2051 సంవత్సరం వరకూ సరిపడేలా స్వచ్ఛ మైన గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది జిల్లాలకు డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబాబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, అనురాధ, జక్కంపూడి రాజా, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధర్‌రెడ్డి, ముత్యాలరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం.. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బాధిత కుటుంబానికి పది కేజీల వంతున బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలు చేపట్టిందన్నారు. -
‘అందుకే గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యాయి’
సాక్షి, తూర్పు గోదావరి : రానున్న రెండేళ్లలో రాజమండ్రికి స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, తిరుపతి, షిరిడి వంటి ప్రాంతాలకు విమానం నడపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను కోరినట్లు వెల్లడించారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరామని తెలిపారు. అదే విధంగా దివాన్ చెరువు నుంచి జొన్నాడ జంక్షన్ వరకు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కోరగా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రాజమండ్రిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ‘గోదావరి నదీ జలాలను కాలుష్యం బారి నుంచి కాపాడాలని జలశక్తి మంత్రిని కోరాం. రూ. 780 కోట్లతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును కూడా తయారు చేసి పంపాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకై వడ్డీలేని రుణాలు ఇవ్వాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను కోరాం. శేషాద్రి, జన్మభూమి రైళ్లకు అనపర్తిలో స్టాప్ కల్పించాలని విఙ్ఞప్తి చేశాం. ఇక శేషాద్రికి ఇప్పటికే అనుమతి లభించింది. అదే విధంగా ఫోర్ లైన్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని కోరాము’ అని ఎంపీ భరత్ పేర్కొన్నారు. పోలవరం సందర్శన పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. పోలవరంలో ముందు చూపు లేకుండా కాపర్ డ్యాం నిర్మించడంతో గిరిజన గ్రామాలు ముంపు బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ప్రాణనష్టం లేకుండా సహాయక చర్యలు చేపట్టగలిగామని తెలిపారు. ఇక రాజమండ్రి సిటీ బ్యూటిఫికేషన్ కోసం త్వరలో చర్యలు చేపట్టి...నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ‘గత ప్రభుత్వం ఇండోర్ స్టేడియం మంజూరు అయిందని హడావిడి చేసింది. ఇందుకోసం కేటాయించిన 13 కోట్ల రూపాయలను టీడీపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పథకానికి తరలించింది. రాజమండ్రిలో ఒలంపిక్ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తాం. క్రీడలను విద్యతో సమానంగా ఆదరించాలి. 2020 ఒలంపిక్స్‌లో అధిక మెడల్స్ వచ్చేలా కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు. అదే విధంగా కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ చమురు లీకేజీల గురించి కూడా పార్లమెంటులో ప్రస్తావించినట్లు ఎంపీ భరత్ తెలిపారు. రాష్ట్రానికి అత్యధికంగా పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. -
మనోహరం...గోదావరి తీరం
-
వైఎస్ జగన్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ముత్యాల పాప
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని నర్సీపట్నం కాంగ్రెస్ ఎమ్యెల్యే బోలెం ముత్యాల పాప కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యేను అయినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు తాను వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభంజనం కొనసాగుతోందన్నారు. వైఎస్ఆర్ సిపి జనపథంలో భాగం ఇక్కడకు వచ్చిన జగన్‌ను ఆ పార్టీ నేతలతోపాటు పలువురు ఇతర పార్టీల నేతలు కూడా కలుస్తున్నారు. వైఎస్ఆర్ సిపి నేతలు పెన్మత్స సాంబశివరాజు, ధర్మాన కృష్ణదాస్ కూడా జగన్‌ను కలిశారు. జగన్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాజమండ్రి ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్ సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.