ఎమ్యెల్యే ముత్యాల పాప
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని నర్సీపట్నం కాంగ్రెస్ ఎమ్యెల్యే బోలెం ముత్యాల పాప కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యేను అయినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు తాను వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభంజనం కొనసాగుతోందన్నారు.
వైఎస్ఆర్ సిపి జనపథంలో భాగం ఇక్కడకు వచ్చిన జగన్ను ఆ పార్టీ నేతలతోపాటు పలువురు ఇతర పార్టీల నేతలు కూడా కలుస్తున్నారు. వైఎస్ఆర్ సిపి నేతలు పెన్మత్స సాంబశివరాజు, ధర్మాన కృష్ణదాస్ కూడా జగన్ను కలిశారు. జగన్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాజమండ్రి ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్ సెంటర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.