
టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడుతున్నారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు.
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడుతున్నారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు. టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలా ఫలకాన్ని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంతో మందితో పోరాడి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టామని.. అలజడి సృష్టించడం వల్ల ఉపయోగం లేదన్నారు.

‘‘రాజమండ్రి ప్రశాంతమైన నగరం. ప్లైఓవర్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు శిలాఫలకంపై నా పేరు మాత్రమే కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్లు కూడా ఉన్నాయి. శిలాఫలం ధ్వంసం చేసినా ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరు. అలజడి సృష్టించటం వల్ల ఉపయోగం లేదు. అభివృద్ధి కోసం పాటుపడాలి’’ మార్గాని భరత్ హితవు పలికారు.