సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో రుడా కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రిలో మరో 16 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్లనే స్థలాలు ఆగాయని పేర్కొన్నారు. ఇప్పటికే 6వేల మందికి టీడ్కో గృహాలు అందజేశామని తెలిపారు. పేద ప్రజలకు మేలు చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. రాజమండ్రిని రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
పరిపాలనా రాజధాని విశాఖకు తరలించడం ఖాయం: మంత్రి బొత్స
పరిపాలనా రాజధాని విశాఖకు తరలించడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తామన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ‘‘రాష్ట్రంలో లేని చంద్రబాబు, లోకేష్‌లు పన్నుల విధానం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌కు అడ్రస్‌లు ఉన్నాయా.. ప్రతిపక్షంలో ఉండగానే సీఎం జగన్ తాడేపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నారు. పారదర్శకంగా రాష్ట్రం నూతన పన్నుల విధానాన్ని అమలు చేస్తుంది. దళారుల వ్యవస్థను నిరోధించడానికే కొత్త పన్నుల విధానం. రాష్ట్రంలో 50 శాతం పదవులు మహిళలకు ఉండాలని సీఎం చెప్పారు. రుడా చైర్మన్ పదవి కూడా మహిళలకే కేటాయించారని’’ బొత్స తెలిపారు.
ఇవీ చదవండి:
‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’
రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ
Comments
Please login to add a commentAdd a comment