siva rama subrahamanyam
-
వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెడతా..
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్సార్సీపీని విజయ పంథాన నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు భరత్, గీత, అనురాధ, ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజమండ్రి: రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తూ పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. రాజమండ్రి పట్టణంలో కాంగ్రెస్ నేతలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. సుబ్రహ్మణ్యం మైదానం నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం మాట్లాడారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. ముప్పై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీని మోసిన కార్యకర్తలే విభజనను జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నిరసలు ఊపందుకున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే.