రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల ఆందోళన | seemandhra congress leaders protest against 'bifurcation' | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల ఆందోళన

Published Mon, Aug 12 2013 3:13 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

seemandhra congress leaders protest against 'bifurcation'

రాజమండ్రి: రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తూ పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. రాజమండ్రి  పట్టణంలో కాంగ్రెస్ నేతలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. సుబ్రహ్మణ్యం మైదానం నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏఐసీసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం  మాట్లాడారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. ముప్పై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీని మోసిన కార్యకర్తలే  విభజనను జీర్ణించుకోలేకపోతున్నారు.

 

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నిరసలు ఊపందుకున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement