
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి మరో వైపు మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కంపెనీల సీనియర్ లీడర్‌షిప్ టీమ్‌తో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరు అయ్యారు.
కాగా, ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ ఆపిల్ పార్క్‌ను సీఎం రేవంత్ బృందం సందర్శించనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో సీఎంతో పాటు, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి భేటీ కానున్నారు.
ట్రినేట్ కంపెనీ సీఈఓతో కూడా చర్చించనున్న సీఎం.. ఆరమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో భేటీ అయి హైదారాబాద్‌లో ఆ కంపెనీ డేటా సెంటర్ల విస్తరణ కోసం చర్చలు జరపనున్నారు. పలువురు టెక్ కంపెనీల ప్రతినిధులతో లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంగెన్ సంస్థ సీనియర్ లీడర్‌షిప్‌తో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ రెనేశాస్, మ్యానిఫాక్చర్ సంస్థ అమాట్‌తో పెట్టబడులపై చర్చించనున్న సీఎం.. పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment