వాషింగ్టన్: అమెరికాలో గతవారం నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. లేబర్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. మే 18తో ముగిసిన వారానికి స్టేట్ అన్‌ఎంప్లాయిమెంట్ బెన్ఫిట్స్ కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య 8,000 తగ్గి 215,000కి చేరింది.
ఆర్థికవేత్తల అంచనా ప్రకారం తాజా వారంలో 220,000మంది నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారని రాయిటర్స్ కథనం వెల్లడించింది.
మార్చి 2022 నుండి ఫెడరల్ రిజర్వ్ నుండి 525 బేసిస్ పాయింట్ల విలువైన వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో లేబర్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment