BAN AFFECT
-
అమెరికాలో టిక్ టాక్.. ‘ఇక డబ్బులు సంపాదించడం చాలా ఈజీ’
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో కంటెంట్ క్రియేటర్లు లబ్ధి చేకూరేలా డబ్బులు సంపాదించుకునే (మానిటైజేషన్) మార్గాన్ని మరింత సులభతరం చేసింది. అందుకు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌పై అమెరికా ఒత్తిడే కారణమని తెలుస్తోంది. టిక్ టాక్‌లో కంటెంట్ క్రియేటర్లు ఏదైనా అంశం మీద వీడియోలు చేస్తుంటారు. ఫలితంగా 5వే ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ ఛానెల్ క్రియేటర్.. తన ఛానెల్ ద్వారా ఏదైనా వస్తువును సేల్ చేసి అఫిలేట్ మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. తాజాగా, ఆ ఫాలోవర్ల సంఖ్యని 1000కి తగ్గించింది.అఫిలేట్ మార్కెటింగ్ అంటే?అమెజాన్, ఇతర అఫిలేట్ నెట్ వర్క్ వెబ్సైట్లలో యూజర్లకు ఏదైనా నచ్చిన ప్రొడక్ట్‌ను వివిధ మార్గాల్లో అంటే ఫేస్బుక్, వెబ్సైట్లు, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రమోషన్ చేసి వాటిని అమ్మాల్సి ఉంటుంది. అలా అమ్మితే అమెజాన్ అందుకు ప్రొడక్ట్‌ను బట్టి 10 నుంచి 20 శాతం వరకు కమిషన్‌ను అందిస్తుంది. న్యాయ పరమైన ఇబ్బందుల్లో టిక్ టాక్ చైనాకు చెందిన టిక్ టాక్ అమెరికాలో న్యాయ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అగ్రరాజ్యం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. పలు సందర్భాలలో టిక్ టాక్‌పై బ్యాన్ విధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే బ్యాన్ తర్వాత ఎదురయ్యే ఆర్ధికపరమైన పర్యవసానాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గింది. టిక్‌టాక్‌పై వరుస పిటిషన్లు నిషేధ చట్టం న్యాయ విభాగం టిక్‌టాక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. 170 మిలియన్ల యూజర్ల డేటాను ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అనుమానం వ్యక్తం చేసిన అమెరికన్ టిక్ టాక్ యూజర్లు కోర్టులో వరుస పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.అమ్ముతారా? లేదంటే బ్యాన్ చేయమంటారా?ఈ సందర్భంగా టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని, లేదంటే నిషేధం విధిస్తామని తెలుపుతూ హౌస్ బిల్లుపై జో బైడెన్ సంతకం చేశారు. అందుకు 270 రోజులు గడువు ఇచ్చింది. అదీ సాధ్యం కాకపోతే మరో 90 రోజుల పొడిగింపుతో టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని లేదంటే దేశంలో నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదేశించింది.మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గించిదీంతో బైట్ డాన్స్ పై ఒత్తిడి ఎక్కువయింది. ఈ క్రమంలో మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గిస్తూ టిక్ టాక్ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బైట్ డ్యాన్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం
స్టార్ హీరో మోహన్ లాల్‌కు గల్ఫ్ దేశాలు షాకిచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాన్స్టర్. మంచు లక్ష్మి కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇటీవల అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల సన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తమ దేశాల్లో మాన్స్టర్ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అయితే సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీక్యూ) కంటెంట్ ఉండడం వల్లే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే దీంతో ఈ మూవీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. -
ఈలాన్ మస్క్ నీ బెదిరింపులకు మేం భయపడం
ట్విటర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారడం పట్ల ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఒత్తిడిలో ఎదుర్కొంటున్నప్పటికీ.. ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చిన విధానాలను కొత్త యజమాని ఈలాన్ మస్క్ కోసం మార్చుకోవడానికి సిద్ధంగా లేమంటున్నారు. ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుని ఈలాన్ మస్క్‌కి కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటుంది. ఫ్రీ స్పీచ్‌కు అవకాశం లేదంటూ ప్రచారం మొదలెట్టిన ఎలన్ మస్క్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే భారీ ఆఫర్ ఇచ్చి ట్విటన్ను పబ్లిక్ నుంచి ప్రైవేటు కంపెనీగా మార్చేశాడు. ఆ తర్వాత ట్విటర బోర్డు సభ్యులపై వరుసగా విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. మరోవైపు ఈలాన్ మస్క్ చేతిలోకి కంపెనీ వెళ్లిపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఐనప్పటికీ వారి మనో ధైర్యం చెక్కు చెదరడం లేదు. అప్పుడు బ్యాన్ అమెరికాకు చెందిన మై పిల్లోస్ సంస్థ సీఈవో మైక్ లిండెల్ ఖాతాను 2021 జనవరిలో ట్విటర్ బ్యాన్ చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక కామెంట్లు ట్వీట్ చేశారు. అతనికి మద్దతుగా మైక్ లిండెల్ కూడా ట్వీటర్‌ను యూజ్ చేశారు. దీంతో వీరిద్దరి ఖాతాలను ట్వీటర్ బ్యాన్ చేసింది. మళ్లీ ట్విటర్ ఖాతా అయితే ఇటీవల ట్విటర్ యజమాన్య మార్పులు జరగడం. కొత్త బాస్ ఈలాన్ మస్క్ ఫ్రీ స్పీచ్‌కే ప్రాధాన్యం అంటూ చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో 2022 మే 1న మైక్ లిండెల్ ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. నా ట్విటర్ ఖాతా ఇదే నంటూ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని అందరికి తెలపాలంటూ కోరారు. ట్విటర్లో నా ఖాతా లేకపోవడంతో నకిలీవి వస్తున్నాయంటూ వాపోయాడు. నిషేధిత జాబితాలో ఉన్న లిండెల్ ఖాతా మళ్లీ ఖాతా తెరవడంతో ట్విటర్ యూజర్లు అదంతా ఈలాన్ మస్క్ పవర్ అనుకున్నారు. ట్విటర్ బోర్డు డమ్మీగా మారిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మూడున్నర గంటల్లో ఫ్రీ స్పీచ్ విషయంలో ఈలాన్ మస్క్ విధానం ఎలా ఉన్నా విద్వేష పూరిత వ్యక్తుల పట్ల మా తీరు మారదంటూ వెంటనే రంగంలోకి దిగింది ట్విటర్ బోర్డు. మైక్ లిండెల్ రెండో సారి ఖాతా తెరిచిన మూడున్నర గంటల్లోనే చర్యలు తీసుకుంది. మరోసారి అతని ఖాతాను స్థంభింప చేసింది. మా విధానాలకే కట్టుబడి ఉన్నామంటూ గట్టిగా బదులిచ్చింది. మనవాళ్ల ధైర్యం ప్రస్తుతం ట్విటర్‌కు పరాగ్ అగ్రావాల్ సీఈవోగా ఉండగా లీగల్ అడ్వెజర్‌గా గద్దె విజయ ఉన్నారు. ఈలాన్ మస్క త్వరలోనే వీరిని బయటకు సాగనంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఐనప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతాలు, తాము రూపొందించిన విధానాలు అమలు చేయడానికి వీరిద్దరు మొగ్గు చూపారంటున్నారు నెటిజన్లు. మరీ తాజా నిషేధంపై ఎలన్ మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి. చదవండి: Vijaya Gadde: ఎలన్‌మస్క్‌తో కష్టమే.. పరాగ్ తర్వాత మరో ఇండియన్ లేడికి ఎసరు? -
ట్విట్టర్ బ్యాన్: అసలు కారణం ఇదేనా?
అబూజా: ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అధ్యక్షుడు బుహారీ ట్వీట్‌ను తొలగించిన కారణంగానే ట్విట్టర్ కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నైజీరియా నిర్ణయంపై సొంత ప్రజలు అంసతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. అయితే ఇది అసలు కారణం కాదనే వాదన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి ట్విట్టర్‌పై నైజీరియా సర్కార్ గుర్రుగా ఉంది అధ్యక్షుడి ట్వీట్ డిలీట్ వ్యవహారంతో మాత్రమే కాదని ఆ వాదన సారాంశం. గత కొన్నేళ్లుగా నైజీరియాలోని లాగోస్ ఆఫ్రికాలోనే అత్యంత ఆకర్షణనీయమైన టెక్ హబ్‌గా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏప్రిల్‌లో ట్విట్టర్ ఆఫ్రికాలో తన రీజినల్ హెడ్‌క్వార్టర్ కోసం లాగోస్ కాకుండా.. ఘనాను ఎంచుకుంది. దీనిపై నైజీరియా వివరణ కోరగా.. ఘనా ప్రభుత్వం బయటి పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుందని ట్విట్టర్ కారణం చెప్పింది. నిజానికి ట్విట్టర్ వివరణను సమర్థించడానికి బోలెడు కారణాలున్నాయి. అయినప్పటికీ నైజీరియా ఆ విషయంలో దారుణంగా హర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ డిలీట్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దెబ్బ నైజీరియాకే! ఇక ట్విట్టర్ బ్యాన్ వివాదంతో నైజీరియా టెక్ రంగం సంక్షోభంలో పడే అవకాశం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఇరవై కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియాలో స్మార్ట్ ఫోన్ యూజర్ల శాతం 60కి పైనే ఉంది. మరోవైపు టెక్ పెట్టుబడులతో లాగోస్ ఆర్థికాభివృద్ధికి బీజం వేసింది. ఆఫ్రికాకే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా అవతరించింది. ఇలాంటి తరుణంలో నైజీరియా ట్విట్టర్ బ్యాన్ నిర్ణయంతో.. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016లో నైజీరియా టూర్లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ఆఫీస్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. 2021 ద్వితియార్థంలో అది జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేస్బుక్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల తర్వాత నైజీరియా ప్రతినిధులు ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్‌కు సందేశం పంపగా.. అక్కడి నుంచి బదులు లేకపోవడంతో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. ఇక ఇదే బాటలో మరికొన్ని టెక్ సంస్థలు లాగోస్ నుంచి వెనక్కి వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నైజీరియా దూకుడు నిర్ణయం వల్ల 170 మిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం నెలకొన్నట్లు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. -
నోట్ల రద్దు: పెళ్లిళ్లపై నో ఎఫెక్ట్!
పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాహాది వేడుకలు, శుభకార్యాక్రమాలకు తీవ్ర ఎఫెక్ట్ చూపుతుందంటూ పలు ప్రచారాలు జరిగాయి. కార్తికమాసం కావడంతో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు ఉంటాయని, కానీ ప్రభుత్వ నిర్ణయంతో పెళ్లిళ్లను వాయిదా పడే అవకాశాలున్నాయంటూ పలువురు విమర్శించారు. కానీ పెద్ద నోట్ల రద్దు పెళ్లి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని మెజారిటీ భారతీయులు వెల్లడించినట్టు ఓ సర్వేలో తేలింది. ప్రస్తుతం నెలకొన్న ఈ కరెన్సీ సంక్షోభం పెళ్లిళ్లపై ప్రభావం చూపిందా అంటూ..మాట్రిమోనియల్ సైట్ షాదీ.కామ్ నిర్వహించిన సర్వేలో 41 శాతానికి పైగా పురుషులు, 39 శాతానికి స్త్రీలు నో చెప్పినట్టు తెలిసింది. కేవలం 20.3 శాతం పురుషులు, 24.5 శాతం మహిళలు మాత్రమే వారి వెడ్డింగ్ ప్లాన్స్‌పై ప్రభావం చూపినట్టు వెల్లడించారు. ముందస్తు బుకింగ్స్ గా పెళ్లిళ్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పెళ్లిళ్లకు ప్లాన్ చేసుకోవడంతో నోట్ల ఎఫెక్ట్ వారిపై చూపించలేదని షాదీ.కామ్ సర్వేలో వెల్లడైంది. పెద్దనోట్లతో ప్రభావితులైన వారు ముందస్తుగా ఎలాంటి ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య బారినపడినట్టు తేలింది. కేవలం 17.8 శాతం మంది పురుషులు, 7.6 మంది మహిళలు మాత్రమే వారి పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. 25 నుంచి 32 వయసున్న సింగిల్ ఇండియన్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ ఆన్లైన్ పోల్‌లో 13,200 స్పందనలను షాదీ.కామ్ సేకరించింది. పెళ్లిళ్ల కోసం ఖర్చుచేసే నగదంతా పెద్ద నోట్లేనని, వాటిని రద్దుచేయడంతో పెళ్లిళ్లు ఆగిపోతాయని విపక్షాలు, పలువురు ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ షాదీ.కామ్ నిర్వహించిన సర్వేలో నోట్ల రద్దు ఎఫెక్ట్ అనుకున్న స్థాయిలో లేదని తేలింది.