నోట్ల రద్దు: పెళ్లిళ్లపై నో ఎఫెక్ట్!
నోట్ల రద్దు: పెళ్లిళ్లపై నో ఎఫెక్ట్!
Published Thu, Nov 24 2016 5:48 PM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాహాది వేడుకలు, శుభకార్యాక్రమాలకు తీవ్ర ఎఫెక్ట్ చూపుతుందంటూ పలు ప్రచారాలు జరిగాయి. కార్తికమాసం కావడంతో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు ఉంటాయని, కానీ ప్రభుత్వ నిర్ణయంతో పెళ్లిళ్లను వాయిదా పడే అవకాశాలున్నాయంటూ పలువురు విమర్శించారు. కానీ పెద్ద నోట్ల రద్దు పెళ్లి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని మెజారిటీ భారతీయులు వెల్లడించినట్టు ఓ సర్వేలో తేలింది. ప్రస్తుతం నెలకొన్న ఈ కరెన్సీ సంక్షోభం పెళ్లిళ్లపై ప్రభావం చూపిందా అంటూ..మాట్రిమోనియల్ సైట్ షాదీ.కామ్ నిర్వహించిన సర్వేలో 41 శాతానికి పైగా పురుషులు, 39 శాతానికి స్త్రీలు నో చెప్పినట్టు తెలిసింది. కేవలం 20.3 శాతం పురుషులు, 24.5 శాతం మహిళలు మాత్రమే వారి వెడ్డింగ్ ప్లాన్స్పై ప్రభావం చూపినట్టు వెల్లడించారు.
ముందస్తు బుకింగ్స్ గా పెళ్లిళ్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పెళ్లిళ్లకు ప్లాన్ చేసుకోవడంతో నోట్ల ఎఫెక్ట్ వారిపై చూపించలేదని షాదీ.కామ్ సర్వేలో వెల్లడైంది. పెద్దనోట్లతో ప్రభావితులైన వారు ముందస్తుగా ఎలాంటి ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య బారినపడినట్టు తేలింది. కేవలం 17.8 శాతం మంది పురుషులు, 7.6 మంది మహిళలు మాత్రమే వారి పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. 25 నుంచి 32 వయసున్న సింగిల్ ఇండియన్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ ఆన్లైన్ పోల్లో 13,200 స్పందనలను షాదీ.కామ్ సేకరించింది. పెళ్లిళ్ల కోసం ఖర్చుచేసే నగదంతా పెద్ద నోట్లేనని, వాటిని రద్దుచేయడంతో పెళ్లిళ్లు ఆగిపోతాయని విపక్షాలు, పలువురు ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ షాదీ.కామ్ నిర్వహించిన సర్వేలో నోట్ల రద్దు ఎఫెక్ట్ అనుకున్న స్థాయిలో లేదని తేలింది.
Advertisement
Advertisement