Report Says Mohanlal Monster Movie Banned In Gulf Countries Due To LGBTQ Content - Sakshi
Sakshi News home page

Mohan Lal Monster Movie: లక్ష్మి మంచు ప్రధాన పాత్రలో ‘మాన్‌స్టర్‌’, ఈ మూవీపై అక్కడ నిషేధం

Published Tue, Oct 18 2022 12:12 PM | Last Updated on Tue, Oct 18 2022 1:16 PM

Mohanlal Monster Movie Banned in Gulf countries Due to LGBTQ Content - Sakshi

స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌కు గల్ఫ్‌ దేశాలు షాకిచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ మాన్‌స్టర్‌. మంచు లక్ష్మి కీ రోల్‌ పోషించిన ఈ మూవీ ఇటీవల అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రంపై గల్ఫ్‌ దేశాల సన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తమ దేశాల్లో మాన్‌స్టర్‌ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అయితే  సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్‌జీబీటీక్యూ) కంటెంట్ ఉండడం వల్లే నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే

దీంతో ఈ మూవీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్‌కు సినిమా కాపీని  అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement