మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మాన్‌స్టర్. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. ఉదయ్ కృష్ణ కథ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది మంచు లక్ష్మి.
ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు. నేను చాలా ఎనర్జిటిక్‌గా సెట్స్‌కు వెళ్తే డల్‌గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది.
మలయాళంలో నటిస్తున్నప్పుడు భాషాపరంగా కొంత ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నందుకు మోహన్‌లాల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇలాంటి ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ మనకెందుకులే అనుకోకుండా ముందుకు వెళ్లారు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలనుందని ఆయనతో చెప్పాను. నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు.
ప్రస్తుతం నటిగానే కాకుండా టీవీ షోలు చేస్తున్నాను. ఇక్కడ నటించకుండా నాలా నేనుంటూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాపై ట్రోల్స్, మీమ్స్ లేవు.. కానీ వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం లేచించి మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గాంబ్లర్ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.
చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో ముగినిపోయిన జంట
విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సింగర్ డేటింగ్
Comments
Please login to add a commentAdd a comment