సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌లో డేటా ఉల్లంఘనలపై మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ‘మీ డేటాను అమెరికాలోని ప్రైవేట్ కంపెనీకి ప్రధాని నరేంద్ర మోదీ అప్పగిస్తారని మీరు అనుకుంటున్నారా...ఇలాంటి అవాస్తవ కథనాలను విశ్వసించకండ’ ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. ఆధార్‌లో ప్రజలు పేరు, చిరునామాలే ఇస్తారని, యూఐడీఏఐ వద్ద ఉండే బయోమెట్రిక్ డేటా బహిర్గతం కాదని తాను ప్రజలకు హామీ ఇస్తానన్నారు. అయితే ఆధార్ సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు తాము అనుమతిస్తామని స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నమో యాప్ డేటా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ట్వీట్ చేశారు. అమెరికన్ కంపెనీలకు యూజర్ల సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమ్మచూపుతున్నారని ఫ్రెంచ్ హ్యాకర్ ప్రకటనల ఆధారంగా రాహుల్ ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ల దాడి సాగించారు. కీలకమైన ఈ వ్యవహారాన్ని ఎత్తిచూపడంలో మీడియా అలసత్వం ప్రదర్శిస్తోందని కూడా రాహుల్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment