సాక్షి, హైదరాబాద్: డేటా స్కాం బాగోతంలో తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రెండ్రోజులుగా చంద్రబాబు, లోకేశ్.. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.# TSGovtStealsData, # KTRStealsData అనే హ్యాష్‌ట్యాగ్‌లతో తెలంగాణ ప్రభుత్వంపై వారిరువురి ఆదేశాల మేరకు ట్వీట్ల దాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.(డేటా స్కామ్‌పై మంత్రివర్గంలో మల్లగుల్లాలు)
వివిధ రాష్ట్రాల నుంచి ట్వీట్లు: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో సంబంధంలేని ట్విట్టర్ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి. అయితే, ఈ ట్వీట్ల సారాంశం అంతా.. తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపేలా ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తడం గమనార్హం. ముంబైకి చెందిన సంజయ్ బఫ్నా అనే వ్యక్తి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘వాళ్లు విలువైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయడంతోపాటు ఐటీ సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసే చర్యలకు పాల్పడినందుకు సిగ్గుపడాలి’ అని ట్వీట్ చేశాడు. ఇదే రీతిలో.. ‘మా నాయకుడితో పోరాడలేకే.. మా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’.. అని ముంబైకి చెందిన సంతోష్ శుక్లా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. బాలీవుడ్ చౌక్ పేరిట.. ‘మా ఆస్తులను దొంగిలించారు. మా నీళ్లను దొంగిలించారు. ఇప్పుడు మా డేటాను దొంగిలిస్తున్నారా? టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలి’.. అనే అర్థం వచ్చేలా ట్వీట్ రాగా, రెండు రాష్ట్రాలతో సంబంధం లేని మరికొంత మంది కూడా ఇదే అర్ధం వచ్చేలా ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. వీటిని గమనిస్తే కృత్రిమంగా ఒక ట్రెండ్‌ను సృష్టించి డేటా చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేలా చంద్రబాబు ఓ ప్రైవేటు ఏజెన్సీకి భారీగా డబ్బులు ముట్టచెప్పి ఈ క్యాష్ ఫర్ ట్వీట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. దీనిపై ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. (సర్వం దోచేశారు)
చంద్రబాబు, లోకేశ్ డైరెక్షన్‌లో క్యాష్ ఫర్ ట్వీట్!
Published Wed, Mar 6 2019 8:34 AM | Last Updated on Thu, Mar 7 2019 9:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment