న్యూఢిల్లీ : దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ ప్లే స్టోర్, ఆప్ స్టోర్‌లలో ఈ యాప్‌లను తొలగించారు. నిషేధానికి గురైన యాప్‌లలో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఒకటి. ఈ నేపథ్యంలో యువతలో ఆ యాప్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరతీశారు. టిక్‌టాక్ పేరిట మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతూ యూజర్లను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మెసేజ్‌లలో అమాయక ప్రజలను నమ్మించేలా.. ‘మరోసారి టిక్‌టాక్ వీడియోలను ఎంజాయ్ చేయండి.. క్రియేటివ్ వీడియోలను రూపొందించండి. ఇప్పుడు టిక్‌టాక్.. టిక్‌టాక్ ప్రో గా అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ చేయడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి’ అని రాసి ఉంటుంది.(చదవండి : టిక్‌టాక్ బ్యాన్ : ‘రీల్స్’ వచ్చేసిందిట!)
ఆసక్తితో ఆ లింక్ క్లిక్ చేసినవారికి సదరు యాప్ ఐకాన్ అచ్చం టిక్‌టాక్ మాదిరిగానే కనిపిస్తోంది. దాని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే అది కెమెరా, మైక్ లాంటి ఇతర అనుమతులు అడుగుతుంది. ఆ తర్వాత ఆ యాప్ పనిచేయదు. ఫోన్‌లోనే ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేని ఇటువంటి యాప్‌లను ఏపీకే ఫార్మట్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే ఫోన్‌లోని డేటా చోరికి గురయ్యే అవకాశం ఉంది. వీటి ద్వారా ఫోన్లలో ఉన్న ఇతర సోషల్ మీడియా యాప్‌ల లాగిన్ సమాచారం చోరికి గురవుతందని సైబర్ నిపుణులు చెప్తున్నారు.అలాంటి మెసేజ్‌లను పట్టించుకోకపోతే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఇటీవల వినియోగదారుల ఫేస్‌బుక్ లాగిన్ వివరాలు చోరిపై ఫ్రెంచ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరికతో.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 25 హానికర యాప్స్‌ను తొలగించింది. (చదవండి : భారతీయులు డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్!)
Comments
Please login to add a commentAdd a comment