ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ వేగంగా పావులు కదుపుతోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టడానికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు సాక్షుల, నిందితుల విచారణ చేపడుతూనే మరోవైపు యూజర్ల సమాచారం తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సిట్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాట చేసింది.