ఈ ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తిని చూశారా.. ఆయనే దాకవరం అశోక్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఈయన. ఆధార్, రాష్ట్ర ప్రభుత్వ రహస్య డేటా అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న ఈయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరంగా జరిగే అధికారిక సమీక్ష సమావేశాల్లో మంత్రి నారా లోకేష్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్యనే దర్జాగా కూర్చొని ఉన్నారు.