న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సంబంధించిన డేటాను కలిగి ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. చైనా సంస్థ జెన్‌హూవా డేటా ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంతి, ఆర్మీ చీఫ్‌తో సహా వేలాదిమంది భారతీయులపై రహస్య నిఘా నిర్వహిస్తోందనే ఆరోపణల మధ్య ఈ ఉల్లంఘన జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన డేటాతో పాటు, ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ)
ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన మెయిల్ ఒకటి బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన సంస్థ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్‌ఐసీ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ వ్యవస్థలు అన్నీ ప్రభావితమై సమాచారం హ్యాక్ అయినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని (నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో) ఏర్పాటు చేసిందని ఎన్‌ఐసీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ 30 రోజుల్లోగా నివేదికను సమర్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment