ప్రధాని మోదీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ | PM Narendra Modis Twitter Account Hacked | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

Published Sun, Dec 12 2021 6:35 AM | Last Updated on Sun, Dec 12 2021 11:18 AM

PM Narendra Modis Twitter Account Hacked - Sakshi

సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతల ట్విట్టర్‌ అకౌంట్లు పదే పదే హ్యాకింగ్‌కు బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతల ట్విట్టర్‌ అకౌంట్లు పదే పదే హ్యాకింగ్‌ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతుండగా, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది.

బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ  హ్యాకర్స్ ట్వీట్ చేశారు. 500బిట్ కాయిన్లను పంచుతున్నామని ట్వీట్‌లో తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ట్విటర్‌కు తెలిపినట్లు పీఎంవో వెల్లడించడమే కాకుండా, ప్రధాని ట్విటర్‌అకౌంట్‌కు భద్రత కల్పించింది. అయితే గతంలో మోదీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైన సంగతి విదితమే.

చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement