bit coin
-
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందన్న డబ్బు తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి బిట్‌కాయిన్ వాలెట్ పాస్వర్డ్ మర్చిపోయారు. పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారు. అప్పట్లో (2013) తన వాలెట్లో తక్కువ బిట్కాయిన్లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్కాయిన్లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా పట్టించుకోలేదు.ఇటీవల బిట్‌కాయిన్ విలువ ఏకంగా 2000 శాతం పెరిగింది. ఇది గమనించిన వ్యక్తి.. ఎలాగైన తన బిట్కాయిన్లను పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హ్యాకర్లలో కింగ్‌పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 'జో గ్రాండ్'ను ఎంచుకున్నారు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్వర్డ్ రికవర్ చేసాడు.సుమారు దశాబ్దంలో బిట్‌కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, కోల్పోయిన మరుగున పడ్డ బిట్‌కాయిన్ విలువ సంపదగా పెరిగింది. అది సుమారు రూ. 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. -
కుప్పకూలిన క్రిప్టో కరెన్సీ విలువ
-
ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతల ట్విట్టర్ అకౌంట్లు పదే పదే హ్యాకింగ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతుండగా, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ హ్యాకర్స్ ట్వీట్ చేశారు. 500బిట్ కాయిన్లను పంచుతున్నామని ట్వీట్లో తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ట్విటర్‌కు తెలిపినట్లు పీఎంవో వెల్లడించడమే కాకుండా, ప్రధాని ట్విటర్అకౌంట్కు భద్రత కల్పించింది. అయితే గతంలో మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైన సంగతి విదితమే. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ.. -
బిట్ కాయిన్ కుంభకోణం: ఇద్దరు మంత్రులపై నిఘా కన్ను
సాక్షి, బనశంకరి(కర్ణాటక): రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న బిట్‌కాయిన్ కుంభకోణంలో సొంత పార్టీ నేతలే విపక్షాలకు సమాచారం చేరవేస్తున్నారని బీజేపీ పెద్దల్లో అనుమానం ఏర్పడింది. దీంతో ఇద్దరు మంత్రుల కదలికలపై కేంద్ర బీజేపీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాల్సిన కొందరు మంత్రులే ప్రతిపక్షాలతో కుమ్మక్కైనట్లు బీజేపీ సందేహిస్తోంది. హైకమాండ్‌కు సీఎం మొర బిట్‌కాయిన్‌పై ఆ ఇద్దరే ప్రతిపక్ష నేతలకు లీక్‌లు ఇస్తున్నారని సీఎం బసవరాజబొమ్మై పార్టీ అధినేత జేపీ.నడ్డా, హోం మంత్రి అమిత్‌షా కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన హై కమాండ్ ఇద్దరు మంత్రుల కదలికలపై నిఘాపెట్టడానికి రహస్య బృందాన్ని బెంగళూరుకు పంపించినట్లు తెలిసింది. బిట్‌కాయిన్ స్కాంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే సమాచారాన్ని విపక్షాలకు లీక్ చేస్తున్నారని గుసగుసలున్నాయి. ఇటీవల హానగల్ ఉప ఎన్నిక సమయంలో విపక్షనేత సిద్దరామయ్య ఈ కేసును ట్విట్టర్ ద్వారా లేవనెత్తాక పెను దుమారం మొదలైంది. సీఎం బొమ్మై ఢిల్లీ పర్యటనలో మంత్రుల నిర్వాకంపై హైకమాండ్ ముందు వాపోయారు. తనకు మంత్రుల మద్దతు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు. -
ఇది కనపడని కరెన్సీ బూమ్!
లాటరీ తగులుతుందంటే కాదనడం కష్టమే! ఆర్థికసేవల్లో టెక్నాలజీని అంతర్భాగం చేసుకొనే ‘ఫిన్‌టెక్’ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీలతో కనివిని ఎరుగని రాబడి వస్తుందంటే సగటు భారతీయుడు మోజు పడకుండా ఉంటాడా? అందుకే, 2020లో 92.3 కోట్ల డాలర్లున్న భారతీయ క్రిప్టో పెట్టుబడులు 2021లో 660 కోట్ల డాలర్లకు చేరి, బ్రిటన్ను సైతం దాటేశాయి. ఇది ఒకింత ఆశ్చర్యకరం. మరింత ఆందోళనకరం. ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచే ప్రమాదం క్రిప్టోలతో ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మొత్తుకుంటోంది. మరోపక్క ఈ కంటికి కనపడని డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టి, కొద్దిరోజుల్లోనే కోట్లు గడించవచ్చని ఆశపడుతున్న అమాయకుల్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే శనివారం ప్రధాన మంత్రి మోదీ, సోమవారం పార్లమెంటరీ స్థాయీ సంఘ సభ్యులు చర్చలు జరిపారు. వీటన్నిటి క్రోడీకరణగా రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీపై చట్టం తేవాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. ప్రపంచ వ్యాప్త క్రిప్టో విజృంభణ ధోరణిని భారత్ ఒక్కటీ ఎలా నియంత్రించగలదన్నది ప్రశ్న. మొన్న సెప్టెంబర్‌లో ఎల్సాల్వడార్లా క్రిప్టోను కరెన్సీగా అంగీకరించాలా, లేక చైనాలా పూర్తిగా నిషేధించాలా అంటే తేల్చి చెప్పడం కష్టమే. నిజానికి, 2013 నుంచి మనదేశంలో క్రిప్టో చర్చనీయాంశమే. 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, 2018లో క్రిప్టోపై ఆర్బీఐ నిషేధం, 2020 మార్చిలో నిషేధాన్ని సుప్రీమ్ కోర్టు కొట్టేయడం అంతా చరిత్ర. ఆపైన కరోనా కాలంలో భారత్‌లో బంగారాన్ని మించిన పెట్టుబడి మార్గంగా క్రిప్టో అవతరించింది. పన్నెండేళ్ళ క్రితం జరిగిన ఓ కొత్త ఆవిష్కరణ ప్రపంచాన్ని చుట్టేసిందంటే ఆశ్చర్యమే. 2009లో ‘బిట్‌కాయిన్’ పేరుతో క్రిప్టో కరెన్సీ విధానం మొదలైతే, ఇప్పుడు ఎథీరియమ్, రిపుల్, డోజ్కాయిన్ – ఇలా 10 వేల క్రిప్టో కరెన్సీలున్నాయి. క్రిప్టోగ్రఫీ, కరెన్సీల కలగలుపుగా కొత్త సృష్టి – క్రిప్టో కరెన్సీ. మామూలు మాటల్లో– క్రిప్టోకరెన్సీ అంటే ఎలక్ట్రానిక్ చెల్లింపు నెట్వర్క్. నెట్‌వర్క్‌లోని కంప్యూటర్ల లాంటివి లావాదేవీలను సరిచూసి, ధ్రువీకరిస్తాయి. హద్దుల్ని చెరిపేస్తూ, ప్రపంచమంతటా విస్తరించిన ప్రభుత్వేతర ఆన్లైన్ కమ్యూనిటీలు ఈ కరెన్సీలను సృష్టించి, నడుపుతుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలు చలామణీలో ఉన్నాయి. అత్యధికంగా భారత్‌లోనే 10 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. అందుకే, జాతీయ కరెన్సీలకు క్రిప్టోలు పోటీగా అవతరిస్తాయా అన్న చర్చ. క్రిప్టోల ప్రాచుర్యానికి కారణం– దాని ప్రత్యేకతలు. సాధారణ బ్యాంకుల్లో లాగా కాక, ఇక్కడ లావాదేవీల ధ్రువీకరణ పని ఇంటర్నెట్తో వికేంద్రీకృతంగా సాగుతుంది గనక యూజర్ ఛార్జీలు ఉండవు. ప్రపంచంలో ఎక్కడికైనా ఇప్పుడున్న చెల్లింపు వ్యవస్థల కన్నా చౌకగా, వేగంగా చెల్లింపులు జరిపేయచ్చు. దీనికి వాడే ‘బ్లాక్‌చెయిన్’ విధానంలో రికార్డులను తారుమారు చేయడం అసాధ్యం. అత్యంత సురక్షితం. విశ్వవ్యాప్త కరెన్సీల్లో లోపాలూ ఉన్నాయి. కంప్యూటర్లు, వ్యాలెట్ల లాంటివి అవసరం కాబట్టి, సాంకేతికంగా పట్టున్నవారికే తప్ప అత్యధికులైన సామాన్యులకు ఈ క్రిప్టో కరెన్సీలు దూరమే. ఇక, వర్చ్యువల్ కరెన్సీలో మదుపరులెవరో ఎవరికీ తెలీదు గనక డ్రగ్స్, అంతర్జాతీయ హవాలాకు ఇది మంచి వాటం. తీవ్రవాదానికీ ఈ డిజిటల్ ఆస్తులు అండగా మారే ముప్పుంది. దేశంలో ద్రవ్యవిధానానికి మార్గదర్శనం చేసే కేంద్రీయ బ్యాంకులేవీ వీటిని నియంత్రించలేవు. కాబట్టి, ఈ కరెన్సీ కాని కరెన్సీకీ, రకరకాల క్రిప్టో కరెన్సీల నిర్వాహకులకీ అడ్డూ ఆపూ ఉండదు. మరోపక్క 5 వేల బిట్‌కాయిన్స్‌ను నిందితుడు కొట్టేసిన కర్ణాటకలోని బిట్‌కాయిన్ కుంభకోణం లాంటివి ఇప్పటికే జనాన్ని భయపెడుతున్నాయి. అయినా సరే, మన దేశంలో సాంప్రదాయిక స్టాక్ మార్కెట్లో కన్నా 5 రెట్లు ఎక్కువ మంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారన్నది విస్తుపోయే వాస్తవం. వారిలో 15 శాతం మంది స్త్రీలే. ఎక్కువగా 18 నుంచి 35 – 40 లోపు వాళ్ళే. లెక్కిస్తే భారతీయ క్రిప్టో యూజర్ సగటు వయసు పట్టుమని పాతికేళ్ళే. యువతరం, అందులోనూ ఎక్కువగా దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్నవాసులు క్రిప్టో మోజులో పడుతున్నారు. సినీతారలు సైతం క్రిప్టోలకు ప్రచారకర్తలవుతున్నారు. అమితాబ్, కమలహాసన్, సల్మాన్ ఖాన్ తదితరులు ఒకరకం క్రిప్టో ఆస్తులైన ‘నాన్ఫంగిబుల్ టోకెన్’ (ఎన్ఎఫ్టి)లతో తమ బ్రాండ్లను సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. ఒకప్పటి స్టాక్‌మార్కెట్, డాట్‌కామ్ విజృంభణల ఫక్కీలో ఇప్పుడీ క్రిప్టో బూమ్ వచ్చింది. ఇది నిజంగా బూమా? లేక వట్టి బుడగేనా? ఆర్బీఐ నో అంటున్నా, ఈ కొత్త విశ్వవ్యాప్త కరెన్సీ ధోరణిని కట్టగట్టి కాదనలేం. నిషేధించలేం. అలాగని కొత్త కుంపటిని యథాతథంగా నెత్తికెత్తుకోలేం. అందుకే, గత ఫిబ్రవరిలో నిషేధ చట్టం తేవాలనుకున్నా, ఇప్పుడు కొన్ని నియంత్రణలతో క్రిప్టోను స్వాగతించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుంది. క్రిప్టో సమస్యల్ని అధిగమించాలంటే, కేంద్రీయ బ్యాంకులే డిజిటల్ కరెన్సీలను జారీ చేయడం ఓ మార్గం. కానీ, ద్రవ్యసృష్టిలో, చెల్లింపు వ్యవస్థల్లో ప్రభుత్వ పాత్ర లేకుండా చేయాలన్న క్రిప్టో కరెన్సీ ఆవిర్భావ ఆలోచనకే అది విరుద్ధం. ఇంతకాలం బ్యాంకులు, బీమాలు, బంగారమంటూ దేశంలోనే పెట్టుబడులుండేవి. ఇప్పుడీ క్రిప్టో పెట్టుబడులతో డబ్బు దేశం దాటే ప్రమాదం ఉంది. దేశభద్రత, ఆర్థిక సుస్థిరత, ఆశపడే సామాన్యప్రజల ప్రయోజనాల సంరక్షణే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం. భవిష్యత్ టెక్నాలజీని కాదనకుండానే, భారీ సంక్షోభాన్ని నివారించడమెట్లా? ఇది సర్కారు వారి మిలియన్ డాలర్ల క్రిప్టో ప్రశ్న! -
సంచలనం.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ
El Salvador Mines First Bitcoin With Volcanic Energy: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్ మరో కీలకమైన అడుగు వేసింది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్‌ను వినియోగించుకుని బిట్‌కాయిన్ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది. వోల్కనో ఎనర్జీ ద్వారా ఇప్పటికే 0.00599179 బిట్‌కాయిన్(269 డాలర్ల)ను ఉత్పత్తి చేసింది కూడా. ఈ మేరకు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) అధికారికంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్‌లో ప్రస్తుతం పోటీతత్వం నడుస్తోంది. ఈ తరుణంలో కేవలం 3 లక్షల లోపు జనాభా ఉన్న ఎల్ సాల్వడర్.. అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌తో బిట్‌కాయిన్ తయారు చేసిన ఘనత దక్కించుకుంది. తద్వారా పునరుత్పాదక శక్తి(మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు) ద్వారా అభివృద్ధికి కీలకమైన అడుగు వేసింది. అందుకే ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. TODAY - The first #Bitcoin is being volcano mined in El Salvador 🌋 pic.twitter.com/hITJhPOf25 — Bitcoin Magazine (@BitcoinMagazine) October 1, 2021 జియోథర్మల్ ఎలాగంటే.. జియోథర్మల్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి(అంతర్గతంగా) ఉపయోగించుకుని ఈ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏదైతే వనరులను ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడిమి పోను పోనూ తగ్గుతుంది. పైగా థర్మల్ ఎనర్జీని డిజిటల్ ఎనర్జీగా(బిట్‌కాయిన్) మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్ చేయొచ్చు. ఈ మేరకు జియోథర్మల్‌లో బిట్కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను సైతం నయిబ్ బుకెలె శుక్రవారం ట్విటర్ ద్వారా చూపించారు. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 బోలెడంత ఆదా.. సాధారణంగా క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ల ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమికి ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి ఎంతో ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్‌గా తయారు చేయడం కోసం బోలెడంత సాధారణ కరెంట్‌నూ(కంప్యూటర్ల కోసం) ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎల్ సాల్వడర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్ సేవ్ కావడమే కాదు.. జియోథర్మల్ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది. అందుకే ప్రపంచ దేశాల నుంచి హర్షాతికేరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్ సాల్వడర్ చేసిన ఈ ప్రయత్నం మరికొన్ని దేశాలకు ప్రోత్సాహం ఇస్తుందని ట్విటర్ సీఈవో జాక్ డోర్సే పొగడ్తలు గుప్పించారు. ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె కేంబ్రిడ్జి బిట్‌కాయిన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ల ఉత్పత్తి కోసం 105 టెరావాట్ గంటల పవర్‌ను ఒక ఏడాదికి ఉపయోగిస్తున్నారు. ఫిలిప్పైన్స్ దేశం ఒక ఏడాదిలో మొత్తం ఉపయోగించే కరెంట్ కంటే ఇది ఎక్కువని ఒక అంచనా. బిట్‌కాయిన్స్ ఉత్పత్తి చేస్తున్న జియోథర్మల్ ప్లాంట్ ఇదే వ్యతిరేకత నడుమే.. బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్ సాల్వడర్ దేశం చాలాకాలం క్రితమే చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బిట్‌కాయిన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్ సర్కార్ తమ పౌరులకు ఇదివరకే 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. అయితే ఇది ఆ దేశ పౌరులకు నచ్చడం లేదు. బిట్‌కాయిన్‌కు మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల ప్రభావంతో సెప్టెంబర్ మొదటి వారంలో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం అయ్యింది కూడా. అయినప్పటికీ ఎల్ సాల్వడర్ ప్రభుత్వం తగ్గడం లేదు. ఇప్పటికే చివో(కూల్) పేరుతో వర్చువల్ వ్యాలెట్‌ను సైతం మెయింటెన్ చేస్తోంది ఎల్ సాల్వడర్. చదవండి: అదృష్టమంటే ఇదే! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
వర్చువల్ కరెన్సీలపై చైనా ఉక్కుపాదం
-
లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయా?!
రమేష్, కీర్తన (పేర్లు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లై ఐదేళ్లు అవుతోంది. ఇద్దరివీ ఐదెంకల్లో జీతం. కరోనా కారణంగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యే కీర్తన ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతోంది. ఓ రోజు కీర్తన తన ఆన్లైన్ అకౌంట్‌ను రమేష్‌కు చూపించింది. అందులోని ఓ ప్రకటన వివరాలు చూసిన రమేష్‌కు కూడా ఆసక్తిగా అనిపించి, తన అకౌంట్ నుంచి ఫాలో లింక్‌ను క్లిక్ చేశాడు. ఆన్లైన్ ద్వారా అలా పరిచయం అయిన విపుల్ (పేరుమార్చడమైనది)తో రమేష్, కీర్తనలు రోజూ మెసేజ్‌ల ద్వారా అతని టెక్నాలజీ సంస్థకు సంబంధించిన వివరాలను పంచుకునేవారు. గుజరాత్లో ఉన్న తన సొంత టెక్నాలజీ కంపెనీ వివరాలు, క్రిఫ్టో కరెన్సీ గురించిన అనుభవమూ, తను చేసే డిజిటల్ కరెన్సీ లావాదేవీలను రమేష్, కీర్తనలతో పంచుకునేవాడు విపుల్. చదవండి: అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి రెట్టింపులుగా ఆదాయం?! పది వేల రూపాయలు పెట్టుబడితో లక్ష రూపాయల లాభం ఎలా వస్తుందో తెలిపే వివరాలు రమేష్, కీర్తనలు బాగా ఆకట్టుకున్నాయి. అప్పటికే బిట్‌కాయిన్, క్రిఫ్టో కరెన్సీగా పేరొందిన డిజిటల్ కరెన్సీ గురించి రమేష్, కీర్తనలకు కొద్దిగా తెలుసు. విపుల్‌తో చర్చలు జరిపిన తర్వాత అతను చెప్పిన యాప్స్‌లో కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు రమేష్, కీర్తనలు. రెండు, మూడు రోజుల్లోనే తమ పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ లావాదేవీలు ఇలాగే కొనసాగితే త్వరలోనే కోటీశ్వరులు అయిపోతామన్నది ఇద్దరి ఆలోచన. అంతేకాదు, తాము ఇక ఉద్యోగాలు కూడా చేయాల్సిన అవసరం లేదనుకున్నారు. ఆ ఆలోచనతో విపుల్ సూచనలతో ఆర్థిక లావాదేవీలు జరుపుతూ వచ్చారు. పదిహేను రోజుల్లో దాదాపు రూ.12 లక్షల రూపాయలు విపుల్ చెప్పినవిధంగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత రోజు విపుల్ ఫోన్ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. విపుల్ ఆన్లైన్ అకౌంట్ కూడా కనిపించలేదు. గుజరాత్లో ఉన్నట్టుగా చెప్పిన విపుల్ టెక్నాలజీ సంస్థ గురించి వాకబు చేస్తే, అలాంటిదేమీ లేదని తేలింది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే క్రిఫ్టో కరెన్సీ పేరుతో తమలాగే మోసపోయిన వారు వందల సంఖ్యలో ఢిల్లీ, ముంబయ్, పుణె నగరాలలో ఉన్నారని తెలిసింది. చదవండి: సైబర్ కేసుల ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో తెలుసా! జాగ్రత్తలే మోసానికి అడ్డుకట్ట క్రిఫ్టో కరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ ఇందులో మోసం ఉండదు. కానీ,కరెన్సీ పేరు మీద మోసం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మోసపుచ్చాలనుకునేవారు రకరకాల లింక్స్, మన మెయిల్ ఐడీ, ఇతరత్రా మెసేజ్‌ల ద్వారా పంపిస్తారు. ప్రైవేట్ అప్లికేషన్స్ ఎప్పుడూ డౌన్లోడ్ చేసుకోకూడదు. ఆ లింక్స్‌పై క్లిక్ చేయకూడదు. డిజిటల్ కరెన్సీ పేరుతో మోసాలు జరగడం ఈ నాలుగైదు నెలల నుంచి ఎక్కువగా ఉంటోంది. చదువుకున్నవాళ్లే ఈ తరహా కరెన్సీ పట్ల ఆసక్తి చూపుతారు. క్రిఫ్టో కరెన్సీలో చాలా రకాలు ఉన్నాయి. వేటిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాటి గురించి పూర్తి అవగాహన పెంచుకొని, తమ ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడం శ్రేయస్కరం. – యు. మదన్ కుమార్‌గౌడ్, సైబర్ క్రైమ్, హైదరాబాద్ వర్చువల్ కరెన్సీగా క్రిఫ్టో కరెన్సీ డిజిటల్లో చలామణిలో ఉంది. దీనికి భారత ప్రభుత్వం లేదా రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా మద్దతు ఇవ్వవు. ఇవి క్రిఫ్టోగ్రఫీ ద్వారా భద్రపరచబడిన డిజిటల్ ఆస్తులు. వీటిని డిజిటల్ మాధ్యమంగానే ఉపయోగిస్తారు. వారం రోజుల తేడాతోనే వీటిలోని పెట్టుబడులు రెట్టింపులుగా ఉంటుంది. ఉదాహరణకు.. కిందటి వారం ఒక బిట్‌కాయిన్ ధర 26 లక్షల రూపాయల పైన ఉంటే, అది ఈ వారం 36 లక్షల రూపాయల పైన ధర ఉంది. అందుకే, వీటిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుపుతుంటారు. ఈ కరెన్సీ పేరుతో నకిలీ కంపెనీలు, నకిలీ వాలెట్లు, నకిలీ ట్రేడింగ్‌లతో మోసగాళ్లు ముందుకు వస్తున్నారు. ప్రారంభ ధరను తక్కువగా చూపించి, లాభాలు వచ్చినట్టుగా చూపుతారు. వినియోగదారుల బలహీనతను అడ్డుగా పెట్టుకొని, మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఎంతవరకు అంటే కొందరు ఆస్తులు అమ్ముకొని, మరికొందరు అప్పులు చేసి క్రిఫ్టో కరెన్సీ పేరుతో నకిలీ యాప్‌లలో పెట్టుబడి పెట్టి మోసపోయినవారున్నారు. కాబట్టి, జాగ్రత్త తప్పనిసరి. – అనీల్ రాచమల్ల, ఎండ్ నౌ ఫౌండేషన్సైబర్ క్రైమ్ నిపుణులు -
భారీగా పతనమవుతున్న క్రిప్టో కరెన్సీ...!
పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. ఇక పనైపోయిందని అంతా అనుకుంటుంటే.. మళ్లీ అంతలోనే రాకెట్లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. అంతే వేగంగా కుప్పకూలుతుంది. పెరిగినా, తగ్గినా ఇన్వెస్టర్లను టెన్షన్ పెడుతున్న క్రిప్టో కరెన్సీల తీరు ఇది. ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్ల స్థాయి నుంచి ఏప్రిల్ నాటికి 60,000 డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్ మళ్లీ నెల తిరగకుండానే 30,000 డాలర్లకు కూడా పతనం కావడం ఇందుకు నిదర్శనం. నియంత్రణ సంస్థలు, సంప్రదాయ చెల్లింపు మార్గాలతో సంబంధం లేకుండా డిజిటల్ రూపంలో నగదును బదలాయించేందుకు ఉపయోగిస్తున్న క్రిప్టోకరెన్సీల పతనంపై ఈ ప్రత్యేక కథనం... మే 19.. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. పలు క్రిప్టో కరెన్సీల విలువ 12 శాతం నుంచి ఏకంగా 40% దాకా పడిపోయింది. మిగతా వాటితో పోలిస్తే భారీగా ట్రేడయ్యే బిట్‌కాయిన్ విలువ చివరికి కాస్త కోలుకున్నప్పటికీ ఒక దశలో 30% దాకా పతనమైంది. వెరసి క్రిప్టోకరెన్సీల విలువ ఒక్క రోజులో ఏకంగా లక్ష కోట్ల డాలర్లు ఆవిరైంది. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి ఇన్వెస్టర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరెన్సీల్లో బిట్‌కాయిన్ అగ్రస్థానంలో ఉంటోంది. కానీ ఈ కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం.. ఇన్వెస్టర్లను కలవరపర్చే అంశం. తాజా పతనం వెనుక టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, చైనా నియంత్రణలు కారణంగా నిల్చాయి. మస్క్ ట్వీట్లు .. చైనా ఆంక్షలు.. ఒక్క చిన్న ట్వీట్‌తో బిట్‌కాయిన్‌ను పైకి పరుగులు తీయించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ .. అలాంటిదే మరో ట్వీట్‌తో కిందికి కూలదోశారు. బిట్కాయిన్లతో తమ కార్లను కూడా కొనుగోలు చేయొచ్చంటూ కొన్నాళ్ల క్రితం ఆయన ట్వీట్ చేసినప్పుడు దాని విలువ ఎకాయెకిన 32,000 డాలర్ల నుంచి 38,000 డాలర్లకు ఎగిసింది. ఆ తర్వాత అదే ఊపు కొనసాగిస్తూ 65,000 డాలర్ల దాకా పెరిగింది. అయితే, పర్యావరణ కారణాల రీత్యా బిట్కాయిన్ల ద్వారా లావాదేవీలు జరపబోమంటూ మే 13న మస్క్ మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన తనదగ్గరున్న దాదాపు 1.5 బిలియన్ డాలర్ల బిట్కాయిన్లను అమ్మేయనున్నారంటూ మే 19న వార్తలు రావడం, దాన్ని దాదాపు ధృవీకరించేలా ఆయన ట్వీట్ చేయడం.. బిట్‌కాయిన్‌ను దెబ్బతీసింది. ఆ రోజునే బిట్‌కాయిన్ భారీగా పతనమైంది. అయితే, తన దగ్గరున్న బిట్‌కాయిన్‌ను విక్రయించే యోచనేదీ లేదంటూ వివరణనివ్వడంతో మళ్లీ కాస్తంత కోలుకుంది. ఇక, క్రిప్టో కరెన్సీల పతనంలో చైనా పాత్ర కూడా కొంత ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. చైనా 2017లోనే తమ దేశంలో క్రిప్టో ఎక్సే్చంజీలను మూసివేసినప్పటికీ.. ప్రజలు మాత్రం అనధికారికంగా ట్రేడింగ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే సొంతంగా డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా వినియోగించడం మొదలుపెట్టిన చైనా.. మే 18న క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించి సర్వీసులు అందించకుండా ఆర్థిక సంస్థలు, పేమెంట్ కంపెనీలను నిషేధించింది. అలాగే స్పెక్యులేటివ్ క్రిప్టో ట్రేడింగ్ చేయరాదంటూ ఇన్వెస్టర్లను కూడా హెచ్చరించింది. ఇది కూడా క్రిప్టో కరెన్సీల పతనానికి దారి తీసింది. లాభాల స్వీకరణ..: ఇన్వెస్టర్లు కంగారుపడి అమ్మేసుకోవడం కూడా ప్రస్తుత పతనానికి కారణం. గతేడాది క్రిప్టోలను కొనుగోలు చేసిన వారు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. టెక్నికల్‌గా చూస్తే సాధారణంగా కరెక్షన్లు వచ్చినప్పుడు సుమారు 50% దాకా విలువ పడిపోతుంది. దాన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ కనిష్ట స్థాయిని తాకి ఉండొచ్చన్నది భావిస్తున్నారు. కాయిన్గెకోడాట్కామ్ లెక్కల ప్రకారం మే 13–20 మధ్య క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాప్ ఏకంగా 50 శాతం తుడిచిపెట్టుకుపోయింది. గత వారం రోజుల వ్యవధిలో ఎథీరియం 25 శాతం, బైనాన్స్ విలువ 33% పడిపోయింది. మస్క్ బాధ్యతారహితమైన ట్వీట్లతో చిరాకెత్తిన కొందరు ట్రేడర్లు స్టాప్ఎలాన్ పేరుతో కొత్త క్రిప్టో కరెన్సీని తెరపైకి తెచ్చారు. దీని విలువ కేవలం 24 గంటల్లో 4,874 శాతం ఎగియడం గమనార్హం. 0.0000019 డాలర్ల నుంచి 0.00009450 డాలర్లకు పెరిగింది. ఆమోదయోగ్యత అంతంతే.. పేరుకి కరెన్సీ అయినప్పటికీ క్రిప్టోలను వ్యాపార లావాదేవీల్లో ఉపయోగిస్తున్నది మాత్రం తక్కువే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15,000 వ్యాపార సంస్థలే క్రిప్టో కరెన్సీల్లో లావాదేవీలకు అనుమతిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రితం తాము కూడా క్రిప్టో కరెన్సీల ద్వారా చెల్లింపులు తీసుకుంటామంటూ ఘనంగా ప్రకటించినప్పటికీ.. అంతలోనే మనసు మార్చుకున్నారు. అయిదేళ్లలో 500 డాలర్ల నుంచి 65వేల డాలర్లకు.. గడిచిన 5 ఏళ్లలో చూస్తే 2016లో 500 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ ఆ మరుసటి ఏడాది 2017లో 19,000 డాలర్లకు ఎగిసింది. ఆ మరుసటి ఏడాది 2018లో 3,000 డాలర్లకు పతనమైంది. 2019లో నెమ్మదిగా 7,000 డాలర్లకు, 2020 ఆఖరు నాటికి 20,000 డాలర్లకు చేరింది. ఇక ఈ ఏడాదైతే ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. అలాగే పడిపోయింది కూడా. ఉదాహరణకు ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ ఏప్రిల్ మధ్య నాటికి దాదాపు 65,000 డాలర్లకు ఎగిసింది. ఇప్పుడు 40,000 డాలర్ల దగ్గరికి పడిపోయింది. కరెక్షన్స్ సాధారణమే .. భారీ ర్యాలీ తర్వాత క్రిప్టో సహా చాలా మటుకు మార్కెట్లలో పెద్ద యెత్తున కరెక్షన్స్ జరగడం సాధారణమేనని క్రిప్టో ఎక్సే్చంజీ జెబ్‌పే సీఈవో రాహుల్ పగిడిపాటి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా క్రిప్టోపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోందని, దీనికి అనుగుణంగానే ఎక్సే్చంజీలు తమ సర్వర్లు, ఇన్ఫ్రాను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. నియంత్రణ సంస్థలపరంగా స్పష్టత లేకపోవడం మరో సవాలని వివరించారు. క్రిప్టో వంటి సాధనాల గురించి అవగాహన పెంచుకున్న తర్వాతే దీర్ఘకాలిక ప్రణాళికతో కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని దేశీ ఇన్వెస్టర్లకు రాహుల్ సూచించారు. ప్రస్తుతం 40 లక్షల మంది తమ ప్లాట్‌ఫాం ద్వారా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇటీవల క్రిప్టో కరెన్సీని స్వీకరించే విషయంలో టెస్లా యూటర్న్ తీసుకోవడం ఇన్వెస్టర్ల మైండ్‌సెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని దేశీ బిట్‌కాయిన్ ఎక్సే్చంజీ బైటెక్స్ వ్యవస్థాపక సీఈవో మోనార్క్ మోదీ తెలిపారు -
టెస్లా విషయంలో ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం!
న్యూయార్క్: టెస్లా ఎలక్ట్రిక్-కార్ల తయారీ సంస్థ గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్లా ఇంక్ చీఫ్ ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు బిట్‌కాయిన్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో అమెరికా వెలుపల ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. "మీరు ఇప్పుడు బిట్‌కాయిన్‌తో టెస్లా కొనుగోలు చేయవచ్చ" అని బుధవారం ట్వీట్ చేస్తూ టెస్లాకు చెల్లించే బిట్‌కాయిన్ సంప్రదాయ కరెన్సీగా మార్చబడదని అన్నారు. ప్రపంచంలో బిట్‌కాయిన్‌ను అనుమతించిన మొదటి కార్ల తయారీ సంస్థ టెస్లానే కావడం విశేషం. ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ధర రోజు రోజుకి పెరుగుతోంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్రిప్టోకరెన్సీలను ప్రోత్సహిస్తున్న మస్క్, గత నెలలో సంప్రదాయ కరెన్సీని విమర్శించారు. బిట్‌కాయిన్ లావాదేవీలను ఆపరేట్ చేయడానికి టెస్లా కేవలం అంతర్గత, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందని ఆయన తెలిపారు. మొదట్లో పరిమిత స్థాయిలో చట్టాల అనుగుణంగా బిట్‌కాయిన్‌ను అనుమతించి తమ ఉత్పత్తులను అమ్ముతామని టెస్లా స్పష్టం చేసింది. చదవండి: ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు -
లక్ష కోట్లకు చేరిన బిట్‌కాయిన్ మార్కెట్
కరోనా కారణంగా వ్యాపారాలు డీలా పడి, ఉద్యోగాలు పోయి ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. దీనితో కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు భారీ ఉద్దీపన పథకాల ప్రకటిస్తున్నాయి. ఉద్దీపనల వల్ల కరెన్సీ విలువ పడిపోవడం వల్ల బ్యాంకింగ్ రంగం సుస్థిరతపై అనుమానాలు రేకెత్తడం మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో బిట్‌కాయిన్ ధర మాత్రం రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. చాలా మంది పెట్టుబడి దారులు బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోని అతి సంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ బిట్‌కాయిన్ మార్కెట్ లో 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ కారణాల వల్ల బిట్‌కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా లక్ష కోట్లకు చేరుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక కాయిన్ ధర 56,620 డాలర్లను క్రాస్ చేసింది. దీంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీని అమోదించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ విలువ భారీగా పెరిగింది. రెండు నెలలుగా బిట్‌కాయిన్ విలువ రోజురోజుకి పెరుగుతోంది. గత వారంలోనే 18శాతం లాభపడింది. అలాగే ఈ ఏడాదిలో 92శాతం పైకి చేరుకుంది. శనివారం క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ట్రేడింగ్ విలువ లక్ష కోట్లు లేదా రూ.72.73 లక్షల కోట్లు దాటింది. 18.6 మిలియన్ డాలర్ల బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీని లేదా క్రిప్టో కరెన్సీని 2009 జనవరిలో తీసుకువచ్చారు. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
ఫేస్బుక్ నుంచి కొత్త క్రిప్టో కరెన్సీ
లండన్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల ఆమోదముద్ర గల కొత్త క్రిప్టోకరెన్సీకి సంబంధించిన విషయాలను మంగళవారం ఆవిష్కరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీని రూపకల్పన కోసం లిబ్రా పేరిట ప్రత్యేక కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వీసా, మాస్టర్‌కార్డ్, పేపాల్, ఉబెర్ వంటి డజను పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో పాటు ఈ కంపెనీలు ఒక్కొక్కటి కనీసం 10 మిలియన్ డాలర్లు ఈ కన్సార్షియంలో ఇన్వెస్ట్ చేస్తాయి. సంక్లిష్టమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత వర్చువల్ కరెన్సీలతో (బిట్‌కాయిన్ వంటివి) సామాన్యులు భారీగా నష్టపోయే ప్రమాదంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దీన్ని నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఫేస్బుక్ నుంచి క్రిప్టోకరెన్సీ వస్తోందన్న వార్తల నేపథ్యంలో బిట్‌కాయిన్ రేటు గణనీయంగా పెరిగింది. 2018 మే తర్వా త తొలిసారిగా 9,000 డాలర్ల స్థాయి పైకి చేరింది. -
బిట్ కాయిన్ రాకెట్ ముఠా అరెస్ట్
-
బిట్ కాయిన్ సంస్థలతో డీల్స్ వద్దు
ముంబై: బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో లావాదేవీలు జరిపే సంస్థలతో సంబంధాలను తక్షణం తెంచుకోవాలని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీ, చెల్లింపు సేవల సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఈ ఆదేశాలు అన్ని వాణిజ్య, సహకార, చెల్లింపు బ్యాంక్‌లకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు కూడా వర్తిస్తాయని పేర్కొంది. వర్చువల్ కరెన్సీలతో రిస్క్ పొంచి ఉన్నదని హెచ్చరించిన మరుసటి రోజే ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం. కాగా క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధం కావని, వీటి వినియోగాన్ని తొలగించాలని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, సిటి తదితర బ్యాంక్‌లు, సంస్థలు క్రిప్టోకరెన్సీల సంబంధిత లావాదేవీలను నిలిపేశాయి. దీంతో వాటి ట్రేడింగ్ దాదాపు 90 శాతం తగ్గిపోయింది. పేమెంట్ సంస్థలు డేటాను ఇక్కడే స్టోర్ చేయాలి.. రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా ఎండ్–టు–ఎండ్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సహా యూజర్ల నుంచి సేకరించిన మొత్తం డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ఆదేశించింది. యూజర్ల సమాచారానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డేటా స్టోరేజ్ సంబంధిత తాజా ఆదేశాలను పేమెంట్ సంస్థలు ఆరు నెలల్లోగా అమలు చేయాలని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. పేమెంట్ ప్రొవైడర్లందరూ పేమెంట్స్ సంబంధిత డేటాను భారత్‌లో స్టోర్ చేయడం లేదని తెలిపింది. ఆర్బీఐ నోటిఫికేషన్‌పై మొబిక్విక్ ఫౌండర్ బిపిన్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. తమ సంస్థ వద్ద ఉన్న మొత్తం డేటాను ఇండియాలోనే స్టోర్ చేశామని తెలిపారు. సాధారణంగా యూనిఫైడ్ సిస్టమ్స్‌ను కలిగిన, ఒకే అప్లికేషన్ సర్వర్లతో గ్లోబల్‌గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ కంపెనీలు భారత్‌లో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు కొద్దిగా కష్టమౌతుందని పేయూ ఇండియా ఎండీ జితేంద్ర గుప్తా పేర్కొన్నారు. కాగా ఫేస్బుక్ డేటా లీక్ అంశంతో యూజర్ల డేటా భద్రత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల నగదు రవాణాపై కఠిన నిబంధనలు బ్యాంకులు నగదు రవాణా సేవలను అవుట్సోర్స్ ఏజెన్సీలకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఆర్బీఐ కఠినతరం చేసింది. బ్యాంకులకు ఈ సేవలు అందించే సంస్థల నెట్‌వర్త్ కనీసం రూ.100 కోట్లు ఉండి, నగదు రవాణాకు అనువైన 300 వ్యాన్లను కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఆయా సేవల ఏజెన్సీల వద్ద ఉండే నగదు బ్యాంకుల ఆస్తియేనని, అందుకు సంబంధించి ఎదురయ్యే ఏ సమస్య అయినా బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. నగదును తరలించే వ్యాన్లకు జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలని, రాత్రి వేళల్లో తరలింపునకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతమున్న అవుట్సోర్సింగ్ ఒప్పందాలను సమీక్షించి నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా 90 రోజుల్లోపు వాటిలో మార్పులు చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. -
బిట్ కాయిన్లు పసిడికి పోటీ కాదు
న్యూఢిల్లీ: బిట్ కాయిన్ల వంటి క్రిప్టో కరెన్సీలు పసిడికి ప్రత్యామ్నాయం కాబోవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. సమర్థమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో వేల సంవత్సరాలుగా బంగారం కొనసాగుతోందని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీలు చోటు దక్కించుకున్నప్పటికీ... ఈ డిజిటల్ ప్రపంచం లోనూ ప్రధానమైన ఆర్థిక అసెట్‌గా బంగారం కొనసాగుతూనే ఉండగలదని తెలిపింది. డబ్ల్యూజీసీ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ ప్రస్తుతం 800 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని, 2017లో బిట్‌కాయిన్ విలువ ఏకంగా 13 రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. ‘‘ఇది చూసి ఇక రాబోయే రోజుల్లో బంగారం స్థానాన్ని క్రిప్టో కరెన్సీలు ఆక్రమించేస్తాయని కొందరు భావిస్తున్నారు. కానీ బంగారం, క్రిప్టోకరెన్సీలు రెండూ వేర్వేరు సాధనాలే తప్ప ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదన్నది మా అభిప్రాయం. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో అర్థవంతమైన స్థానం ఉండటం, రేట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకాకపోవడం, తక్షణం నగదు కింద మార్చుకునే వెసులుబాటు, నియంత్రణ వ్యవస్థల పరిధికి లోబడే ఉండటం వంటివన్నీ బంగారానికి సానుకూలాంశాలు. కానీ క్రిప్టో కరెన్సీలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా ఉన్నప్పటికీ.. బంగారం, ఇతర కరెన్సీలతో పోలిస్తే లావాదేవీల పరిమాణం చాలా తక్కువ’’ అని డబ్ల్యూజీసీ వివరించింది. బంగారం మార్కెట్లో రోజూ 250 బిలియన్ డాలర్ల మేర ట్రేడింగ్ జరుగుతుండగా.. బిట్‌కాయిన్ లావాదేవీలు మాత్రం సగటున 2 బిలియన్ డాలర్ల స్థాయిలోనే ఉంటున్నాయని తెలియజేసింది. -
బిట్‌కాయిన్.. ప్రపంచానికి కొత్త జ్వరం
స్టాక్ మార్కెట్ల గురించి తెలియని వారు కూడా ఈ ఏడాది బిట్‌కాయిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన లేనివారు కూడా బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాలని ఊగిపోయారు. ఇదంతా ఎందుకంటే బిట్‌కాయిన్ పెట్టిన పరుగు అలాంటిది మరి. నిన్న మొన్నటివరకూ దీన్నో అర్ధంకాని అంశంగా భావించిన సామాన్య ఇన్వెస్టర్లూ ఇపుడు దీనివెంట పడటం మొదలెట్టారు. 2017 ఆరంభంలో దాదాపు వెయ్యి డాలర్ల వద్ద కదలాడిన ఈ క్రిప్టో కరెన్సీ... ఏడాది చివరినాటికి ఏకంగా 20,000 డాలర్ల స్థాయికి దూసుకెళ్లి.. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. అంటే ఏకంగా 1,900 శాతం ఎగబాకినట్లు లెక్క. ఏడేళ్లలో అయితే ఏకంగా 44 లక్షల శాతానికి పైగా పెరిగిన ఏకైక అసెట్క్లాస్గా రికార్డు సృష్టించింది. అంతేకాక... బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి ఎందరో సంపన్నుల సంపదను, ఇంకెన్నో దేశాల జీడీపీని.. మరెన్నో ప్రపంచవ్యాప్తంగా బలమైన ముద్రవేసిన బోయింగ్, పెప్సీకో, మెక్‌డోనాల్డ్స్ లాంటి పలు కంపెనీల మార్కెట్ విలువను కూడా దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ అధిగమించేసింది. భవిష్యత్తులో దీనికున్న ప్రాధాన్యాన్ని పసిగట్టిన దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీలు బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌ను కూడా ప్రశేపెట్టాయి. ఇటీవలే షికాగో స్టాక్ ఎక్సే్చంజ్‌లో బిట్‌కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మొదలైంది. నాస్డాక్ కూడా కొత్త ఏడాది ఆరంభంలోనే ఫ్యూచర్స్‌కు రంగం సిద్ధం చేసింది. -
బిట్‌కాయిన్‌పై వేటు
సియోల్: బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీ లావాదేవీలను నిర్వహించరాదని దక్షణి కొరియా బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు బిట్‌కాయిన్‌ను కొనడం, కలిగిఉండటం, వాటిని సెక్యూరిటీగా పెట్టుకోవడం నిషేధించినట్టు దక్షిణ కొరియా స్పష్టం చేసింది. క్రిప్టో కరెన్సీ స్పెక్యులేషన్స్‌తో బిట్‌కాయిన్ బుడగ ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో దాదాపు 20 శాతం లావాదేవీలు దక్షిణ కొరియాలోనే చోటుచేసుకుంటుండటం గమనార్హం. దక్షిణ కొరియాలో దాదాపు పది లక్షల మంది చిన్న ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్స్ కలిగిఉన్నారు. వర్చువల్ కరెన్సీకి అతిపెద్ద మార్కెట్ అమెరికా కన్నా 20శాతం అధికంగా కొరియాలో బిట్‌కాయిన్ ధర పలుకుతుండటం విశేషం. ఈ ఏడాది అంతర్జాతీయ బిట్‌కాయిన్ ధరలు జనవరిలో వేయి డాలర్లుగా ఉంటే ఈ వారం 17,000 డాలర్లకు చేరుకున్నాయి. చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్చ్సేంజ్‌లో తొలిసారిగా లిస్ట్ అయిన తర్వాత బిట్‌కాయిన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు వచ్చేవారం చికాగో మర్కెంటైల్ ఎక్ఛ్సేంజ్లోనూ బిట్‌కాయిన్ లిస్ట్ అవనుంది. -
పోతే పోనీ అనుకుంటే...ఆదాయం అదుర్స్!
♦ రిస్క్‌తో పాటు భారీ రాబడినిచ్చేవి ఈక్విటీలొక్కటే కాదు ♦ మెరుగైన రాబడులకు మరిన్ని ప్రత్యామ్నాయాలున్నాయ్ ♦ బిట్ కాయిన్, విలువైన రాళ్లు, పీటుపీ వ్యాపారం ఇలాంటివే ♦ వీటిపై అవగాహన పెంచుకున్నాకే పెట్టుబడి పెట్టడం బెటర్ ♦ లేకపోతే పెట్టుబడి పెట్టిన అసలుకూ ఎసరే చాలామంది అంటుంటారు... షేర్ మార్కెట్ అంటే రిస్క్ ఎక్కువని. నిజమే!! కొన్ని చిన్న, మధ్య తరహా షేర్లలో పెట్టుబడి పెడితే నెల రోజులకే మన సొమ్ము రెట్టింపయిపోవచ్చు. పది రోజులు తిరక్కుండానే జీరో కూడా అయిపోవచ్చు. దీనర్థం ఒక్కటే!! రిస్క్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో... అక్కడ రివార్డ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే రాబడి అన్నమాట. మరి ఇలా రిస్క్ తీసుకుంటే భారీ రివార్డ్నిచ్చేది స్టాక్ మార్కెట్ ఒక్కటేనా? షేర్లు ఒక్కటేనా? ఇంకేవీ ఈ స్థాయిలో లేవా? ఈ ప్రశ్నకు ఉన్నాయనే సమాధానమే వస్తుంది. మరి ఆ ప్రత్యామ్నాయా పెట్టుబడి సాధనాలేంటి? వాటిలో ఉండే రిస్క్‌లేంటి? ఇవన్నీ తెలియజెప్పేదే ఈ కథనం. వడ్డీ వ్యాపారం... పీటుపీ అప్పులిచ్చే వ్యాపారం నిజానికి బ్యాంకులు... ఆర్థిక సంస్థలది. కాకపోతే కొందరు వ్యక్తులు కూడా ఇపుడు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. డబ్బులు అవసరమైనవారికి వారు అప్పులిస్తారన్న మాట. ఈ ఇద్దరినీ కలపటానికి ఇపుడు ఆన్లైన్ వేదికగా ‘ఐలెండ్’ వంటి మార్కెట్ లీడర్లతో పాటు పలు సంస్థలున్నాయి. దీన్నే పీర్ టు పీర్ (పీటుపీ) అంటుంటారు. ఉదాహరణకు... వరుణ్ (38) అనే ప్రైవేటు ఉద్యోగి ఇదే విధమైన వ్యాపారాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.20వేల రుణాన్ని ఇస్తుంటాడు. ఇలా 100 మందికి రుణాలిచ్చి సగటున 28 – 30 శాతం రాబడులను అందుకుంటున్నాడు. ఈ విధమైన వ్యాపారంలో ఎగవేతల ప్రమాదం కూడా ఉంటుంది. వరుణ్ దగ్గర అప్పు తీసుకున్న వారిలో ఇద్దరు ఏడాదిగా చెల్లించడం మానేశారు. ఇదే ఈ వ్యాపారంలో రిస్క్. ఈ రంగంలో ఎగవేతలు 4 శాతం వరకూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారం అన్న తర్వాత రిస్క్ ఎలానూ ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో వాటిని ఎదుర్కోవటం కష్టం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఉదాహరణకు కొత్తగా పీటుపీ వ్యాపారంలో అడుగు పెట్టేవారు... ఒక్కరికే ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వకూడదు . ఉదాహరణకు రూ.లక్ష పెట్టుబడితో రంగంలోకి దిగితే ఒక్కరికి రూ.5 వేలకు మించి రుణం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. రుణ గ్రహీతల మనస్తత్వం, వారి చెల్లింపుల తీరుపై అవగాహన తర్వాత తదుపరి అడుగులు వేయాలన్నది ఈ రంగంలోని నిపుణుల సూచన. ఉదాహరణకు కొందరు పీటుపీ వ్యాపారులు పెళ్లి కాని బ్రహ్మచారులకు రుణాలు ఇవ్వరు. పెళ్లయి, పిల్లలు ఉన్నవారికే వారి ప్రాధాన్యం. ఎందుకంటే వీరు బాధ్యతగా ఉంటారని. క్రిప్టో కరెన్సీ...: బిట్ కాయిన్ రిస్క్‌తో పాటు రివార్డు కూడా భారీగా ఉన్న పెట్టుబడి సాధనాల్లో బిట్ కాయిన్ ఒకటి. యువ, కొత్త ఇన్వెస్టర్లను ఇప్పుడు బాగా ఆకర్షిస్తోంది. డిజిటల్ రూపంలో మాత్రమే కనిపించే ఈ అనధికార కరెన్సీ (ఆర్బీఐ ఆమోదం లేదు) ధర ఏడాది కిందట ఒకో బిట్‌కాయిన్‌కు 579 డాలర్లు. ప్రస్తు తం ఇది 2,600 డాలర్ల స్థాయిలో ఉంది. ఇటీవలే 3,100 డాలర్ల స్థాయికి కూడా వెళ్లొచ్చింది. అంటే ఏడాదిలో దీని రాబడులు 4 నుంచి 5 రెట్ల వరకు ఉన్నాయన్న మాట. ఒక బిట్‌కాయిన్‌లో మిల్లీ వంతును కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు దీనివైపు చూస్తున్నారు. అంతర్జాతీయంగా బదిలీ చేసుకోతగ్గ ఈ ఆన్లైన్ కరెన్సీకి ప్రపంచంలో ఏ ప్రభుత్వ ఆమోదమూ లేదు. కానీ పలు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌తో సహా అమెజాన్ వంటి సంస్థలు కూడా ఈ కరెన్సీలో చెల్లింపుల్ని అంగీకరిస్తున్నాయి. మరో వంక ఈ కరెన్సీపై ఏ ప్రభుత్వానికీ నియంత్రణ కూడా లేదు. నిజానికి ఇది సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం కానే కాదు. కాకపోతే దీన్ని ఆమోదించే ప్రైవేటు సంస్థల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దీని విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టేవారు కూడా స్వల్ప కాలంలో లాభాలను తీసుకునే ధోరణితోనే ఉంటున్నారు. ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకుంటే వీటిలో రిస్క్ ఎక్కువేనని తెలుసు. ఎందుకంటే ఇటీవలే ఇది 3,100 డాలర్ల స్థాయిని తాకింది. మరి అప్పుడు కొన్నవారి పరిస్థితేంటి? స్వల్పకాలంలోనే 15 శాతం నష్టపోయినట్లు లెక్క. అయితే అధిక రాబడుల కోసం వీటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఒకవేళ బాగా రిస్క్ తీసుకోవటానికి సిద్ధపడ్డవారైతే తమ దగ్గరున్న నిధుల్లో కేవలం 2 నుంచి 3 శాతం లోపే ఈ తరహా సాధనాలకు కేటాయించడం కొంతలో కొంత సురక్షితం. ఎందుకుంటే భారీ ప్రతిఫలాన్ని ఇవ్వడంలో ముందుండే ఇవి... అదే సమయంలో కుడి ఎడమైతే జీరో అయిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. వీటిలో ఆటుపోట్లు ఎక్కువ. విలువైన రాళ్లు... నకిలీలుంటాయ్!! వజ్రాలు, ఇతర విలువైన రాళ్లపై పెట్టుబడులు కూడా మంచి రాబడులను ఇవ్వగలవు. వీటిలో రాబడులు ఒక నెలలో 10 నుంచి 15 శాతం వరకూ ఉండొచ్చు. ఒక్కో సారి నెల పాటు, ఏడాది పాటు కూడా ధరలు స్థిరంగా ఉండేందుకూ అవకాశం లేకపోలేదు. ఈ వ్యాపారం ఎక్కువ శాతం అవ్యవస్థీకృతం. అయినప్పటికీ పారదర్శకత ఎక్కువే. ఎప్పటికప్పుడు రేట్లను ఆన్లైన్లో చూసుకోవచ్చు. తద్వారా మార్కెట్ ధరపై ఒక అంచనాకు రావచ్చు. డివైన్ సొలిటైర్స్ తదితర కొన్ని కంపెనీలు ప్రతి నెలా వజ్రాల ధరలను ప్రకటిస్తున్నాయి. ఎవరైనా కొనుగోలుదారుడు తిరిగి విక్రయించాలనుకుంటే వారికి మార్కెట్ ధరలో కనీసం 90 శాతం చెల్లిస్తామన్న హామీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. ఆభరణాల విక్రేత ఈ మేరకు ధర ఇచ్చేందుకు నిరాకరిస్తే నేరుగా కంపెనీనే సంప్రదించొచ్చు. పెట్టుబడుల కోసం వజ్రాల బాట పడితే అధిక నాణ్యత గలవి కాకుండా మోస్తరు నాణ్యత ఉన్న వాటిని, అందులోనూ 0.3 క్యారట్ల నుంచి 0.8 క్యారట్ల మధ్యలో ఉన్నవి ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో రాబడులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. నకిలీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నది వీరి సూచన. రంగు, క్లారిటీ, కట్, క్యారట్ ఇవన్నీ ఓ వజ్రం ధరలో కీలక పాత్ర పోషిస్తాయి. పెట్టుబడుల కోసం వజ్రాలు కొనే వారు కొంచెం ఫీజు చెల్లించయినా సరే తప్పకుండా సీరియల్ నంబర్‌తో ఉన్న సర్టిఫికెట్ తీసుకోవాలి. క్రౌడ్ ఫండింగ్... హీరో–జీరో ఏదైనా ఓ కొత్త వ్యాపారం లేదా స్టార్టప్ సంస్థలో పెట్టుబడి పెట్టడమే క్రౌడ్ ఫండింగ్. ఉదాహరణకు ఓ వ్యక్తి అద్భుతమైన ఉత్పత్తిని తయారు చేశాడు. దాన్ని మార్కెట్లోకి తేవటానికి తన దగ్గర డబ్బుల్లేవు. వాటికోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్లపై ఆధారపడ్డారు. అంటే ఆయా సైట్లలో తన ఉత్పత్తిని వివరిస్తూ... పెట్టుబడి కావాలని అభ్యర్థించాడు. అలా పెట్టుబడి పెట్టినవారికి తన కంపెనీలో వాటా ఇస్తాడన్న మాట. ఒకవేళ ఆ ఉత్పత్తి గనక మార్కెట్లోకి వచ్చి విజయవంతమైతే... తన వ్యాపారానికి తిరుగుండదు. ఈ క్రౌడ్ ఫండింగ్ చేసినవారి వాటా విలువ కూడా భారీగా పెరుగుతుంది. అయితే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు స్వీకరించే సంస్థల్లో నకిలీవి కూడా ఉంటాయి. నిధులందుకుని బోర్డు తిప్పేసే అవకాశమూ ఉంటుంది. నిజానికి క్రౌడ్ ఫండింగ్ చేసినవారికి కంపెనీ నిర్ణయాల్లో ఎటువంటి పాత్రా ఉండదు. ఇలా నిధులు సమీకరించే వాటిలో ఎక్కడో ఒకటి రెండు మాత్ర మే దీర్ఘకాలానికి నిలదొక్కుకుని లాభాలను అందించే అవకాశం ఉంటుంది. స్టార్టప్ విఫలమైనా, ఉత్పత్తి ఆదరణకు నోచుకోకపోయినా పెట్టుబడి పెట్టిన వారికి అసలు కూడా తిరిగి రాదు. అందుకే పెట్టుబడికి ముందే నేరుగా సంబంధిత స్టార్టప్ లేదా ఉత్పత్తికి సంబంధించి యజమానులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవాలన్నది ఈ రంగంలోని నిపుణుల సూచన. -
చుక్కలు చూపిస్తున్న బిట్‌కాయిన్
ఒకే వారంలో 22 శాతం పతనం ∙ 3,017 డాలర్ల నుంచి 2,529 డాలర్లకు.. (సాక్షి బిజినెస్ విభాగం) అంతర్జాతీయంగా ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఇటీవల పెద్ద సంచలనంగా మారిన వర్చువల్ కరెన్సీ (డిజిటల్ రూపంలో ఉండేది) బిట్ కాయిన్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 12న 3,017.78 డాలర్ల స్థాయికి వెళ్లిన బిట్ కాయిన్... మూడు రోజులు తిరిగేసరికి జూన్ 15న ఏకంగా 2,120 డాలర్ల కనిష్ట స్థాయికి చేరింది. కాకపోతే అదే రోజు 2,290 డాలర్ల వద్ద క్లోజయింది. మళ్లీ 16న... అంటే శుక్రవారం 2,529 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఈ వారం బిట్ కాయిన్ క్లోజింగ్ ధర రూ.1,57,732.14. ఈ వారంలో మొత్తం మీద బిట్ కాయిన్ విలువ గత వారం క్లోజింగ్‌తో చూస్తే 22 శాతం పతనమైంది. డిసెంబర్ 2013 తర్వాత ఒకే వారంలో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే. ఇక ఈ ఏడాది జనవరి నుంచీ చూస్తే మాత్రం ఇప్పటికి బిట్ కాయిన్ విలువ 137 శాతం పెరిగింది. ఎందుకీ హెచ్చుతగ్గులు? బిట్ కాయిన్‌కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్... బేరిష్ రిపోర్ట్ జారీ చేసింది. కొన్నాళ్లు క్షీణత కొనసాగవచ్చని అంచనా వేసింది. మరోవంక చైనాకు చెందిన బిట్మెయిన్ కొత్త వెర్షన్ బిట్ కాయిన్ బ్లాక్ చెయిన్ ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తోం దంటూ వార్తలు వెలువడ్డాయి. నిజానికిది వర్చువల్ కరెన్సీ. మరో బిట్‌కాయిన్ వెర్షన్ అంటే... దీని విలువ తరిగిపోతుంది కదా! అందుకని ఇన్వెస్టర్లు లాభాలకు దిగారు. ఇవే బిట్ కాయిన్ క్షీణతకు ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఎనిమిదేళ్ల బిట్ కాయిన్ చరిత్రలో ఒకే రోజులో గరిష్టంగా 18% పెరగ్గా, 13% తగ్గిన చరిత్ర కూడా ఉంది. గోల్డ్ మ్యాన్ శాక్స్ రిపోర్టే కరెక్షన్కు కారణమని బిట్ మెక్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ జఫారీ పేర్కొన్నారు. స్వల్ప కాలానికి 3,134 డాలర్లు గరిష్ట స్థాయి, 2,330 డాలర్లు కనిష్ట స్థాయిల మధ్య కదలాడే అవకాశాలున్నాయని, స్టాప్ లాస్ 1,915 డాలర్లుగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత బిట్ కాయిన్ నెట్‌వర్క్‌లో ఎన్ని కావాలంటే అన్ని బిట్కాయిన్లు సృష్టించటానికి వీల్లేదు. గరిష్ఠంగా 2,099 కోట్ల బిట్కాయిన్లను మాత్రమే సృష్టించగలరు. వీటిలో 72% ఇప్పటికే చలామణిలో ఉన్నాయి కూడా. అయితే ఒక్కో బిట్ కాయిన్‌ను కోటి భాగాలుగా విభజించొచ్చు. కోటి భాగంగా ఉండే బిట్‌కాయిన్‌ను ‘సతోషి’ పేరిట చలామణి చేస్తున్నారు. అంటే... కోటి సతోషిలు ఒక బిట్‌కాయిన్ అన్న మాట. ఈ దృష్ట్యా బిట్‌కాయిన్ రేటు పెరుగుతుండటంతో... దీనికి పరిష్కారంగా కొత్త వెర్షన్ బిట్ కాయిన్ సృష్టించే ఆలోచనలో చైనా బిట్ మెయిన్ ఉంది. -
వివరం : బిట్‌కాయిన్ కథ కంచికేనా ?!
బిట్‌కాయిన్ ఒక పాల పొంగా! లేక భవిష్యత్ అవసరమా!! బిట్‌కాయిన్ పురిట్లోనే సంధికొట్టేసిందా! లేక ఎదుగుతున్న క్రమంలో ఇవన్నీ బాలారిష్టాలేనా!! బిట్‌కాయిన్ కంచికి చేరిపోతోందా! లేక కడలి కెరటంలా పడినా లేస్తుందా!! ఇవన్నీ ఈ డిజిటల్ కరెన్సీ చుట్టూ ముసురుకుంటున్న సందేహాలు. ఎందుకంటే బిట్‌కాయిన్‌ను మిగతా కరెన్సీల నుంచి వేరు చేసే అంశాల్లో ప్రధానమైనవి రెండు. వాటిలో మొదటిది ఆన్లైన్ భద్రత కాగా... రెండవది పూర్తి డిజిటల్ రూపంలో ఉండటం. కానీ ఇటీవలే హ్యాకర్ల దాడితో ఓ బిట్ కాయిన్ ఎక్స్ఛేంజీ మూతపడింది. దాంతో ఆన్లైన్ భద్రత ప్రశ్నార్థకమయ్యింది. దీనికి తోడు హాంకాంగ్‌లో వస్తురూపంలో బిట్కాయిన్లను విక్రయించే స్టోర్ కూడా మొదలయంది. అంటే ఇది పూర్తి ఆన్లైన్ కరెన్సీ కాదు! మరెందుకు బిట్‌కాయిన్??? ఆగండాగండి!! అసలు ఎందుకీ బిట్ కాయిన్ అని ప్రశ్నించేవారికన్నా... అసలు ఏంటీ బిట్ కాయిన్ అని ప్రశ్నించేవారే ఎక్కువ!! సింపుల్‌గా ఇదో ఆన్లైన్ కరెన్సీ! డిజిటల్ కరెన్సీ... అని సమాధానాలిస్తే వారికి అర్థం కాదు. ఎందుకంటే మనకు రూపాయి ఉన్నట్టే ప్రతి దేశానికీ ఓ కరెన్సీ ఉంది. పెపైచ్చు ఆ కరెన్సీలను నియంత్రించడానికి మన రిజర్వు బ్యాంకు మాదిరి ఆయా దేశాల్లో సెంట్రల్ బ్యాంకులున్నాయి. ఇక అంతర్జాతీయంగా దాదాపు అందరూ ఆమోదించే అమెరికన్ డాలర్ ఎటూ ఉంది. ఒకవేళ ఆన్లైన్లో కొనాలంటే వీసా, మాస్టర్ కార్డులు ఉండనే ఉన్నాయి. మరి ఈ బిట్ కాయిన్ ఎందుకు? ఏంటీ బిట్‌కాయిన్? ఎలా పుట్టింది? దీన్ని మేనేజ్ చేసేదెవరు? తయారు చేసేదెవరు? దీన్ని మనం సంపాదించటమెలా? అసలిప్పుడు దీని విలువెంత? దీంతో ఏది పడితే అది కొనుక్కోవచ్చా? అందరూ వీటిని అంగీకరిస్తారా? బిట్ కాయిన్లు మన దగ్గరుంటే మార్చుకోవచ్చా? అమ్మో!! ఇన్ని సందేహాలా!! ఇవే కాదు. ఈ సందేహాల చిట్టా అంతు లేకుండా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే... ఇది డబ్బు బాబూ... డబ్బు!!ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఎవరికి వాళ్లు తమకి కావాల్సిన సొమ్మును, ఎప్పుడంటే అప్పుడు, భారీ చార్జీలు లేకుండా డిజిటల్ రూపంలో పంపించుకోగలిగితే!! ఈ ఊహ నుంచి పుట్టిందే బిట్‌కాయిన్ వ్యవస్థ. ఇది ఏ దేశానికీ చెందదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. దీని సృష్టికర్త ఎవరికీ తెలీదు. కానీ సతోషి నకమోటో అనే జపానీస్ మారుపేరుతో బిట్కాయిన్ల గురించి 2008లో ఒక కథనం ప్రచురితమైంది. తర్వాత ఏడాదికి... అంటే 2009 జనవరి 3న ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఒక భారీ నెట్‌వర్క్‌గా ఏర్పడిన కంప్యూటర్ల ద్వారా (బ్లాక్‌చెయిన్) సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారు. ఈ నెట్‌వర్క్‌లో ఉండే కంప్యూటర్లు కూడా అత్యంత శక్తిమంతమైనవి. పెపైచ్చు ప్రతి కంప్యూటర్ ద్వారా సృష్టించగలిగే బిట్కాయిన్ల సంఖ్య చాలా పరిమితం. అత్యంత సంక్ల్లిష్టమైన ఈ ప్రక్రియ పేరు మైనింగ్. ఎప్పటికైనా సరే... మొత్తం బిట్కాయిన్ల సంఖ్య 2.1 కోట్లకు మించకుండా ఈ విధానాన్ని రూపొందించారు. 2009 నుంచి ఇప్పటి దాకా 1.24 కోట్ల బిట్కాయిన్ల మైనింగ్ జరిగింది. లావాదేవీలు జరిగేదెలా? ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బిట్కాయిన్లు వాడొచ్చు. బిట్కాయిన్లతో ఏది కొన్నా... ఆ లావాదేవీ తక్షణం డిజిటల్ రూపంలో ‘లాగ్’ అవుతుంది. ఈ ‘లాగ్’లో ఎప్పుడు కొన్నారు? లావాదేవీ జరిగాక ఎవరి దగ్గర ఎన్ని కాయిన్లున్నాయి? వంటివన్నీ అప్డేట్ అయిపోతాయి. బిట్‌కాయిన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క లావాదేవీ ఈ లాగ్‌లో అప్డేట్ అవుతుంటుంది. ఈ వ్యవస్థే బ్లాక్ చెయిన్. ఈ చెయిన్‌లో మొదటి నుంచి అప్పటిదాకా జరిగిన ప్రతి లావాదేవీ నమోదవుతుంది. బ్లాక్‌చెయిన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ... లావాదేవీలు పొల్లుపోకుండా జరిగాయో లేదో చూసే వారే మైనర్స్. ఒకరకంగా చెప్పాలంటే లావాదేవీలకు ఆమోదముద్ర వేసేవారన్న మాట. ఇలా చేసినందుకు వీరికి వ్యాపారుల నుంచి కొంత ఫీజు ముడుతుంది. వెయ్యి డాలర్లనూ తాకింది!! ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ మారకం విలువ 640 అమెరికన్ డాలర్లు. ఇటీవల ఈ విలువ 1100 డాలర్లను తాకింది కూడా!! ఎందుకంటే బంగారం మాదిరిగా బిట్‌కాయిన్లూ అరుదైనవే. వీటిని సూపర్ కంప్యూటర్ల ద్వారా... అది కూడా పరిమితంగానే సృష్టించగలరు. అందుకే బిట్కాయిన్ల ట్రేడింగ్‌లో స్పెక్యులేషన్ పెరిగింది. పెపైచ్చు వర్డ్‌ప్రెస్, ఓవర్‌స్టాక్.కామ్, రెడ్డిట్, ఓకే క్యుపిడ్, వర్జిన్ గెలాక్టిక్, బైదు లాంటి సంస్థలన్నీ ఆన్లైన్ షాపింగ్‌కు బిట్కాయిన్లను అనుమతిస్తున్నాయి. అందుకే వీటిని కావాలనుకునేవారు పెరిగారు. దీంతో బిట్కాయిన్ల మారకం రేటు రయ్యిమని పెరిగింది. ఇంతలో కొన్ని దేశాలు దీని వాడకంపై పరిమితులు విధిస్తామని చెప్పటం, మారకం ఎక్స్ఛేంజీలపై హ్యాకర్లు దాడులు చెయ్యటంతో విలువ కొంత పడింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న బిట్కాయిన్ల మార్కెట్ విలువ సుమారు 8.4 బిలియన్ డాలర్లుంటుంది. బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీలు 70కి పైగా ఉండగా... వీటి మొత్తం విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లుంటుందని అంచనా. దీన్లో సింహభాగం బిట్‌కాయిన్లదే కనక దీనికంత ప్రాధాన్యం. బిట్ కాయిన్ కావాలా..? ప్రస్తుతం బిట్కాయిన్లు కొనాలంటే ఆన్లైన్ ఎక్స్చేంజీలను ఆశ్రయించాల్సిందే. దీనికోసం ఆయా ఎక్స్ఛేంజీల్లో ఒక ఖాతా క్రియేట్ చేసుకుని, దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఈ ఖాతాయే మనం కొనే బిట్కాయిన్లను దాచిపెట్టుకునే వాలెట్. మన అకౌంటు వెరిఫికేషన్ పూర్తయ్యాక... సరిపడే మొత్తాన్ని ఎక్స్చేంజీకి బదలాయిస్తే మన వాలెట్‌లోకి బిట్కాయిన్లు వచ్చి చేరతాయి. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు సుమారు పది రోజులు పైగా పడుతోందని, ఈలోగా బిట్‌కాయిన్ మారకం విలువ భారీగా మారిపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. బిట్కాయిన్లను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థేమీ లేదు. యూజర్ల బ్లాక్‌చెయినే దీని వ్యవస్థ. ప్రతి యూజరుకు ఆన్లైన్లో ఇలా 1ఒఅట6్జ్డఉ3అఒ9టో3్చఊజ్జీ1ఆఝఖీఛిఞ ఊఎజూ86జిఅ వంటి కోడ్‌తో నిర్దిష్టమైన అడ్రెస్ ఉంటుంది. వారి లావాదేవీలన్నీ ఇలాంటి అడ్రెస్‌తోనే జరుగుతాయి. ఒక లావాదేవీ జరిగినపుడు... ఒక అడ్రస్ నుంచి బిట్కాయిన్లు మరో అడ్రస్‌కు బదిలీ అవుతాయి. కేవలం అడ్రస్ తప్ప... ఈ లావాదేవీ చేసినవారి వ్యక్తిగత వివరాలేవీ బయటకు రావు. అందుకే బిట్కాయిన్ల ద్వారా ఆన్లైన్లో పెద్ద ఎత్తున అక్రమాయుధాలు, మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలా వివరాలు తెలియకపోవటమన్నది దీనికి ప్లస్సే కాదు... మైనస్ కూడా. ఏంటట దీని గొప్ప!! మామూలు కరెన్సీతోనే అన్నీ చేయగలుగుతున్నపుడు బిట్ కాయిన్ల అవసరమేంటి? సహజంగా ప్రతి ఒక్కరికీ కలిగే సందేహమే ఇది. నిజానికి పేరుకు కాయిన్ అయినా ఆన్లైన్లో ఇది బైనరీ అంకెల కోడ్లా కనిపిస్తుంది. పెపైచ్చు బిట్‌కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తి ఎవ్వరూ ఉండరు. నేరుగా మన వాలె ట్లోంచి డబ్బు వ్యాపారి వాలెట్‌లోకి వెళుతుంది. మన వివరాలు బయటకు రావు. వీటికితోడు వేరొకచోటికి తీసుకెళ్లటం, దాచుకోవటం వంటి అంశాల్లో కష్టం ఉండదు. వీటన్నిటితో పాటు... బిట్‌కాయిన్ లావాదేవీలపై ఛార్జీలుండవు. కొన్ని సందర్భాల్లో ఉన్నా... నామమాత్రమే. అన్నిటికన్నా ముఖ్యం... బిట్కాయిన్లలో జరిగే ప్రతి లావాదేవీ యూజర్లందరికీ తెలుస్తుంది. అంతా పారదర్శకమన్న మాట. మరి మన ఇండియాలోనో...? ఇంకా మన దగ్గర బిట్కాయిన్ల వాడకం పెద్దగా లేదు. ఐఎన్‌ఆర్‌బీటీసీ, ైబె సెల్బిట్కో.ఇన్, ఆర్బిట్కో.ఇన్ లాంటి ఎక్స్చేంజీలున్నా... ఇటీవల ఆర్బీఐ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు అహ్మదాబాద్‌లోని బెసైల్బిట్.కో.ఇన్ నిర్వహించే ట్రేడర్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దాడులు నిర్వహించింది. ఈ వెబ్సైట్ ద్వారా సుమారు 400 మంది కోట్ల విలువ చేసే వెయ్యికి పైగా లావాదేవీలు చేశారని తేలింది. ఈ పరిణామాలతో దేశీయంగా పలు ఎక్స్చేంజీలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశాయి. సెక్యూరిటీ లేకుంటే ఎలా...? ఇది అన్నిటికన్నా ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఈ నెల 2న కెనడాలోని అల్బెర్టాలో ఉన్న ఫ్లెక్స్కాయిన్ బ్యాంక్‌పై హ్యాకర్లు దాడిచేశారు. దాని హాట్ వాలెట్లోని దాదాపు 7లక్షల డాలర్ల విలువచేసే బిట్కాయిన్లను దోచేశారు. దీంతో ఆ బ్యాంకు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపేసింది. అంతకు నాలుగురోజుల కిందటే... జపాన్‌కు చెందిన మౌంట్ గాక్స్ ఎక్స్ఛేంజీ... తన వాలెట్ నుంచి హ్యాకర్లు ఏకంగా 480 మిలియన్ డాలర్ల విలువ చేసే బిట్కాయిన్లను దోచేశారని పేర్కొంటూ బిట్‌కాయిన్ అభిమానుల కలలు చెదరగొట్టింది. అందుకని తమకు దివాలా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. బిట్కాయిన్ల విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఆన్లైన్ భద్రతే. యూజర్లంతా కలిసి లావాదేవీల్ని పర్యవేక్షిస్తూ ఉంటారని, ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఎన్ని బిట్‌కాయిన్లున్నాయో అప్డేట్ అవుతుంటుందని చెప్పే వ్యవస్థ... హ్యాకర్లను గుర్తించకపోతే ఇక నమ్మేదెలా? ఎవరు నమ్ముతారు ఇలాంటి కరెన్సీని...? - మంథా రమణమూర్తి ఏటీఎంలూ ఉన్నాయి... బిట్కాయిన్లు తీసుకోవాలంటే ఎక్స్చేంజీలకు ప్రత్యామ్నాయంగా మరో మార్గం కూడా ఉంది. ఆన్లైన్ ఫోరంలలో బిట్కాయిన్లను అమ్మదల్చుకున్నవారు తారసపడితే వారిని స్వయంగా కలిసి, నగదు అందజేసి, స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా బిట్కాయిన్లను మన డిజిటల్ వాలెట్లలోకి బదిలీ చేసుకోవచ్చు. ఇలాంటి లావాదేవీలు, ఎక్స్చేంజీలు వంటి బాదరబందీ లేకుండా... కెనడా వంటి దేశాల్లో రోబోకాయిన్ కియోస్క్‌ల పేరిట ఏకంగా బిట్కాయిన్ల ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏటీఎంలలో నగదును ఇన్సర్ట్ చేసి, స్మార్ట్‌ఫోన్‌తో నిర్దిష్ట కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు! తత్సమానమైన బిట్కాయిన్లు మన వాలెట్‌లోకి వచ్చి చేరతాయి. ఈ ఏటీఎంలలో మన దగ్గరుండే బిట్కాయిన్లను నగదుగా కూడా మార్చుకోవచ్చు.