
న్యూయార్క్: టెస్లా ఎలక్ట్రిక్-కార్ల తయారీ సంస్థ గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్లా ఇంక్ చీఫ్ ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు బిట్‌కాయిన్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో అమెరికా వెలుపల ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. "మీరు ఇప్పుడు బిట్‌కాయిన్‌తో టెస్లా కొనుగోలు చేయవచ్చ" అని బుధవారం ట్వీట్ చేస్తూ టెస్లాకు చెల్లించే బిట్‌కాయిన్ సంప్రదాయ కరెన్సీగా మార్చబడదని అన్నారు. ప్రపంచంలో బిట్‌కాయిన్‌ను అనుమతించిన మొదటి కార్ల తయారీ సంస్థ టెస్లానే కావడం విశేషం.
ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ధర రోజు రోజుకి పెరుగుతోంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్రిప్టోకరెన్సీలను ప్రోత్సహిస్తున్న మస్క్, గత నెలలో సంప్రదాయ కరెన్సీని విమర్శించారు. బిట్‌కాయిన్ లావాదేవీలను ఆపరేట్ చేయడానికి టెస్లా కేవలం అంతర్గత, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందని ఆయన తెలిపారు. మొదట్లో పరిమిత స్థాయిలో చట్టాల అనుగుణంగా బిట్‌కాయిన్‌ను అనుమతించి తమ ఉత్పత్తులను అమ్ముతామని టెస్లా స్పష్టం చేసింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment