పాస్‌వర్డ్‌ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు | How NSA Tool Helped Man Crack Password After 11 Years to Recover Rs 25 Crore in Bitcoin Wallet | Sakshi
Sakshi News home page

పాస్‌వర్డ్‌ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు

Published Fri, Jun 7 2024 8:45 AM | Last Updated on Fri, Jun 7 2024 2:00 PM

How NSA Tool Helped Man Crack Password After 11 Years to Recover Rs 25 Crore in Bitcoin Wallet

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందన్న డబ్బు తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌ వాలెట్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోయారు. పాస్‌వర్డ్‌ మర్చిపోవడం వల్ల ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారు. అప్పట్లో (2013) తన వాలెట్‌లో తక్కువ బిట్‌కాయిన్‌లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్‌కాయిన్‌లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా పట్టించుకోలేదు.

ఇటీవల బిట్‌కాయిన్‌ విలువ ఏకంగా 2000 శాతం పెరిగింది. ఇది గమనించిన వ్యక్తి.. ఎలాగైన తన బిట్‌కాయిన్‌లను పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హ్యాకర్లలో కింగ్‌పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 'జో గ్రాండ్'ను ఎంచుకున్నారు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్ రికవర్ చేసాడు.

సుమారు దశాబ్దంలో బిట్‌కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, కోల్పోయిన మరుగున పడ్డ బిట్‌కాయిన్ విలువ సంపదగా పెరిగింది. అది సుమారు రూ. 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement