NSA
-
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందన్న డబ్బు తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి బిట్‌కాయిన్ వాలెట్ పాస్వర్డ్ మర్చిపోయారు. పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారు. అప్పట్లో (2013) తన వాలెట్లో తక్కువ బిట్కాయిన్లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్కాయిన్లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా పట్టించుకోలేదు.ఇటీవల బిట్‌కాయిన్ విలువ ఏకంగా 2000 శాతం పెరిగింది. ఇది గమనించిన వ్యక్తి.. ఎలాగైన తన బిట్కాయిన్లను పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హ్యాకర్లలో కింగ్‌పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 'జో గ్రాండ్'ను ఎంచుకున్నారు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్వర్డ్ రికవర్ చేసాడు.సుమారు దశాబ్దంలో బిట్‌కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, కోల్పోయిన మరుగున పడ్డ బిట్‌కాయిన్ విలువ సంపదగా పెరిగింది. అది సుమారు రూ. 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. -
'బెంగాల్ విభజనను సమర్థించింది ఎవరో..?' ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
ఢిల్లీ:నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దేశ చరిత్రపై మాట్లాడుతూ ధోవల్ వంచకుల పక్షాన చేరిపోయాడని సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. బెంగాల్ విభజనకు మద్ధతు తెలిపిన వ్యక్తుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపకుడు. జనసంఘ్ తదనంతరం బీజేపీగా అవతరించింది. ధోవల్ వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్..నేతాజీ గాంధీపై ఛాలెంజ్ చేశారా? బోస్ వామపక్షవాదా? లౌకికవాదా? అని ప్రశ్నలు సందిస్తూ బోస్ ఉంటే దేశం విడిపోకుండా ఉండేదా? ఎవరు చెప్పగలరు? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నేతాజీ అన్నయ్య శరత్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ బెంగాల్ విభజనను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమర్థించారని అన్నారు. నెహ్రూ, బోస్ జీవితాలపై రుద్రాంక్షు ముఖర్జీ రాసిన పుస్తకాన్ని ధోవల్‌కు పంపిస్తానని జైరాం రమేశ్ అన్నారు. ఆ విధంగానైనా ధోవల్ సరైన చరిత్రను తెలుసుకుంటారని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్మారక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అజిత్ ధోవల్ మాట్లాడారు. బోస్ ధైర్య సాహసాల గురించి చెప్పే క్రమంలో.. నేతాజీ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపాయి. Mr. Ajit Doval who doesn’t speak much has now joined the tribe of Distorians. 1. Did Netaji challenge Gandhi? Of course he did. 2. Was Netaji a leftist? Of course he was. 3. Was Netaji secular? Of course staunchly and stoutly so. 4. Would Partition not have happened if… pic.twitter.com/Uo8BZCQ51f — Jairam Ramesh (@Jairam_Ramesh) June 17, 2023 ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు -
సరిహద్దు ఉద్రిక్తత.. దోవల్ సమీక్ష
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నతాధికారులతో సమవేశమయ్యి.. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ దళాలు.. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.(చదవండి: చైనా కుట్ర: దోవల్ ఆనాడే హెచ్చరించినా..) ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్, మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ భారత్‌కు చెందిన ప్యాంగ్యాంగ్ త్సో, ఫింగర్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొగ్రుంగ్ నాలా ప్రాంతాల్లోకి వచ్చాయి. -
చైనా కుట్ర: దోవల్ ఆనాడే హెచ్చరించినా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో నెలకొన్న ప్రతిష్టంభన వారాల తరబడి కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. సరిహద్దు ఘర్షణలు కాస్తా దళాల మోహరింపునకు దారితీయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తున్నాయి. గల్వాన్ లోయలో జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన అనంతరం ఇరు సైనికాధికారుల చర్చలు సానుకూలంగా సాగినా సరిహద్దుల్లో చైనా దళాల మోహరింపు డ్రాగన్ దుర్నీతిని వెల్లడిస్తోంది. ఇప్పటి ఉద్రిక్తతలు ఇలా ఉంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2013లోనే భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్‌లు కుట్రకు తెరలేపాయని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు భారత్‌లో అలజడి రేపేందుకు ఈ రెండు పొరుగు దేశాల కుట్రను అజిత్ దోవల్ ఆనాడే బహిర్గతం చేశారు. ‘చైనా ఇంటెలిజెన్స్ : పార్టీ సంస్థ నుంచి సైబర్ యోధులుగా’ అనే వ్యాసంలో దోవల్ ఈ విషయం ప్రస్తావించారు. చైనా నిఘా వర్గాలు భారత్ సహా పలు దేశాల్లో మాటువేసి తమ దేశం తరపున ప్రణాళికాబద్ధంగా గూఢచర్యం నెరిపిన తీరును ఈ వ్యాసంలో దోవల్ కళ్లకు కట్టారు. ఈ వ్యాసం రాసే సమయంలో ఆయన ఢిల్లీకి చెందిన వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌కు సేవలందించారు. ఆ తర్వాత ఏడాదికి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరిన క్రమంలో కేంద్రం ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా కీలక బాధ్యతలను కట్టబెట్టింది. చదవండి : భయపడవద్దు.. మాట ఇస్తున్నా: అజిత్ దోవల్ దోవల్ వెల్లడించిన వివరాల ప్రకారం 1959లో దలైలామా తన 80,000 మంది శిష్యులతో భారత్‌లో ఆశ్రయం పొందిన అనంతరం చైనా భారత్‌పై గూఢచర్య కార్యకలాపాలను వేగవంతం చేసింది. అక్సాయ్‌చిన్ ప్రాంతంలో 219 జాతీయ రహదారిపై లాసా, జిన్‌జియాంగ్‌లను కలుపుతూ చైనా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. 1959, నవంబర్ 21న ఐబీ అధికారి కరంసింగ్ చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కన్నుమూశారు. భారత నిఘా సంస్థలు చైనా కార్యకలాపాలపై ప్రభుత్వానికి సమాచారం చేరవేసినా అప్పటి పాలకులు వాటిపై పెద్దగా దృష్టిసారించలేదని దోవల్ వెల్లడించారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నిన చైనా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారం కూడా తీసుకుందని దోవల్ చెప్పారు. భారత్‌లో ఉగ్రసంస్ధలకు సహకరించేందుకు చైనా పాకిస్తాన్‌లు కలిసి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏకంగా ఆపరేషనల్ హబ్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. -
జమాత్ సభ్యులపై అస్త్రం ప్రయోగించిన యోగి
సాక్షి, న్యూ ఢిల్లీ: ప్రజల ప్రాణాలు రక్షించడమే తమ కర్తవ్యంగా వైద్యులు భయంకరమైన కరోనా శత్రువుతో పోరాడుతున్నారు. ఈ పోరాటానికి వారికి చేయెత్తి నమస్కరించాల్సింది పోయి కనీస సంస్కారం లేకుండా దాడులకు దిగుతూ, దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. పైగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మూల కారణంగా భావిస్తున్న తబ్లిగి జమాత్ సభ్యులే ఈ దాడులకు దిగడం శోచనీయం. వీరి ఆగడాలపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. (‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్ ) ఘజియాబాద్‌లోని క్వారంటైన్ కేంద్రంలో మహిళా నర్సుల ఎదుటే అర్ధనగ్నంగా తిరుగుతూ, అసభ్య పదజాలాన్ని వాడుతూ అనుచితంగా ప్రవర్తించిన తబ్లిగి జమాత్ సభ్యులపై ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తబ్లిగి సభ్యులు ఉన్న కోవిడ్-19 వార్డులో మహిళా నర్సులు, మహిళా పోలీసులను తొలగించాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్యసిబ్బందిపై దాడి వంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కాగా ఓ వ్యక్తి వల్ల దేశ ప్రయోజనాలకుగానీ లేదా శాంతి భద్రతలకుగానీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించినప్పుడు అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అవకాశం ఉంటుంది. (డాక్టర్లపై ఉమ్మివేసినవారి అరెస్ట్) (కదిలిస్తే కన్నీళ్లే!) -
నా భర్తను చంపేస్తారేమో?!
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరిగిన నిరసనల్లో విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలపై గత జనవరిలో అదుపులోకి తీసుకున్న పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ భార్య షబీస్టా ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జైలులో ఉన్న భర్తను కలిసిన అనంతరం ఆయన భద్రతపై ఆమె అనేక సందేహాలు వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తన భర్త జైలుల్లోపల మానసిక వేధింపులకు గురవుతున్నారని, ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచివుందని పేర్కొన్నారు. జైలుకు తీసుకువచ్చిన ఐదు రోజుల పాటు ఆహారం కూడా ఇవ్వకుండా చాలా అమానవీయంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు జైలు లోపలే తన భర్తను హత్య చేసే ప్రమాదం వుందని, తన భర్తకు భద్రత కల్పించాని విజ్ఞప్తి చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగే యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ హోమ్, యూపీ డీజీ( జైలు)కు కూడా తన లేఖను అందించారు. కాగా 2017లో ప్రభుత్వ ఆస్పత్రిలో 60మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో మృతిచెందిన ఘటనలో అరెస్టయి నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ కఫీల్ ఖాన్‌ను గతేడాది (డిసెంబర్ 12న) అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లో సీఏఏ పై రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) ప్రయోగించిన అనంతరం మధుర జైలుకు తరలించారు. గత వారం, ఖాన్ మామ నుస్రుల్లా అహ్మద్ వార్సీని రాజ్‌ఘాట్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులుకాల్చి చంపారు. 2018 లో ఖాన్ సోదరుడిపై హత్యా యత్నం జరిగింది. కాని అతను ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. -
‘ఉగ్ర నిధులకు కోత’
న్యూఢిల్లీ : ఉగ్రవాదులను మట్టికరిపించాలంటే వారి సిద్ధాంతంతో పోరాడాల్సిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పుకొచ్చారు. ‘ఉగ్రవాదం కొత్తేమీ కాదు..ఉగ్రవాదుల నుంచి ఆయుధాన్ని..వారి భావజాలాన్ని దూరం చేసినప్పుడే ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీయగల’మని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కార్యక్రమంలో పాల్గొన్న దోవల్ పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడటం ఒక్కటే సరిపోదని ఉగ్ర నిధులను నియంత్రించి వారిని ఏకాకులుగా చేయాలని చెప్పారు. నేరస్తుడికి ప్రభుత్వ ఊతం లభిస్తే మరింత చెలరేగుతాడని, అది ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత సంక్లిష్టం చేస్తుందని అన్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ప్రభుత్వాలు ఆరితేరాయని, దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ప్రభుత్వ విధానంగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాద నిరోధక బృందాల చీఫ్‌లు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దోవల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇందులోభాగంగా సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసిందనీ, వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్లోకి ప్రవేశించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్ ఎగుమతి కావడంపై పాక్ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ వద్దున్న ఏకైక అస్త్రమని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్.. పాక్ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. టవర్లు ఏర్పాటుచేసిన పాక్.. కశ్మీర్ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసిందని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తెలిపారు. ‘‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్ మండిపడుతూ..‘అసలు అన్ని ఆపిల్ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్ యాసలో మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్ వ్యాపారి హమీదుల్లా రాథర్ ఇంటికెళ్లారు. హమీదుల్లా నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్(25), రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’’ అని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని మెజారిటీ కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ప్రత్యేక హక్కు ఎంతమాత్రం కాదనీ, అతి ప్రత్యేకమైన వివక్షని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం 10 పోలీస్స్టేషన్ల పరిధిలోనే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయనీ, ఉగ్రవాదులు సంప్రదింపులు జరపకుండా ఉండేందుకే ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేశామన్నారు. -
మిలిటెంట్ల డెన్‌లో అజిత్ దోవల్ పర్యటన
అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శనివారం అనంత్‌నాగ్‌లో పర్యటించారు. అక్కడి స్థానికులతో ముచ్చటించారు. ఉగ్రవాదులకు అడ్డగా పేరొంది.. జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీకి కేంద్రంగా ఉన్న అనంత్‌నాగ్‌లో అజిత్ దోవల్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంత్‌నాగ్‌లో ఇటీవల పెద్దసంఖ్యలో ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో స్థానికంగా పర్యటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అజిత్ దోవల్ స్థానికులతో మమేకమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అనంత్‌నాగ్‌లో పర్యటించిన దోవల్.. వీధుల్లో తిరుగుతూ తనకు ఎదురుపడిన స్థానికులతో మాట్లాడారు. పిల్లలతో సరదాగా ముచ్చటించారు. మౌల్వీలు, కార్మికులు, పాదచారులు.. ఇలా అనేక మందితో మాటామంతి కలిపారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అనంత్‌నాగ్‌లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్ మాట కలిపారు. వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ గొర్రెల వ్యాపారి దోవల్‌తో మాట్లాడుతుండగా.. అతన్ని మరొకరు ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. దీనికి అతను తెలియదని బదులిచ్చాడు. అదేం పెద్ద సమస్య కాదని దోవల్ బదులిచ్చారు. మరో వీడియోలో నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ బంధువులతో, ఇతరులతో మాట్లాడటం కష్టంగా ఉందని దోవల్‌కు పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి దోవల్ స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా షోపియన్ జిల్లాలో స్థానికులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్థానికుల్లో విశ్వాసం కల్పించేలా స్థానికులతో మాటా-మంతి కలిపారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయని దోవల్ వారిని ప్రశ్నించగా.. అంతా బాగుందని వారు బదులిచ్చారు. ‘ఔను. అంతా కుదురుకుంటుంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించే రోజులు వస్తాయి. ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మీ భద్రత, సంక్షేమం కోసం మేం తపిస్తున్నాం. రానున్న తరాల అభివృద్ధి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాం’ అని దోవల్ వారితో తెలిపారు. మీ పిల్లలకు మంచి విద్య అందించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారిలో దోవల్ భరోసా నింపారు. ఈ మేరకు షోపియన్ జిల్లాలో స్థానికులతో దోవల్ భోజనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయాలను స్థానికులు స్వాగతిస్తున్నారని, లోయలో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని దోవల్ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, షోపియన్‌లో స్థానికులతో దోవల్ భోజనం చేసిన వీడియోపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు. పైసాలిస్తే ఎవరైనా మీతో కలిసివస్తారంటూ ఆయన ఎద్దేవా పూర్వకంగా వ్యాఖ్యలు చేశారు. -
‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్
గుర్గావ్: ‘పుల్వామా ఘటనను దేశం మరిచిపోలేదు, మర్చిపోదు. ఇటువంటి చర్యలపై దేశ నాయకత్వం సమర్థంగా, దీటుగా బదులిస్తుంది’ అని జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు. సీఆర్పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో దోవల్ మాట్లాడారు. ఈ సందర్భంగా పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. అమరులైన జవాన్లు, వారి కుటుంబాలకు దేశం ఎన్నడూ రుణ పడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘మీరు నిండైన ఆత్మస్థైర్యంతో ఉంటే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. చరిత్ర చెప్పేది కూడా ఇదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బలహీనమైన అంతర్గత రక్షణ వ్యవస్థలున్న 60 వరకు దేశాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం, సార్వభౌమత్వం కోల్పోవడం వంటివి సంభవించాయి’ అని తెలిపారు. దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాల నుంచి యుద్ధ క్షేత్రాలకు సత్వరం తరలివెళ్లి బాధ్యతలు చేపట్టడంలో సీఆర్పీఎఫ్ ముందుందని కొనియాడారు. దేశంలో భద్రతాపరమైన సవాళ్లు తలెత్తిన ప్రతిచోటా సీఆర్‌పీఎఫ్‌నే కీలకంగా ఉంటుందని చెప్పారు. గణతంత్ర దినం సందర్భంగా ప్రకటించిన సాహస అవార్డులను ఈ సందర్భంగా దోవల్ జవాన్లకు అందజేశారు. కాగా, 1939లో బ్రిటిష్ పాలనలో ‘క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్’ పేరుతో ఏర్పాటైన ఈ విభాగం పేరును దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో సీఆర్పీఎఫ్గా మార్చారు. ప్రస్తుతం 246 బెటాలియన్లు, 3 లక్షల మంది జవాన్లతో దేశ వ్యాప్తంగా వివిధ రకాలైన కీలక విధులను నిర్వహిస్తోంది. -
భారత్‌కి అమెరికా నుంచి పెరుగుతున్న మద్దతు
-
డిప్యూటీ ఎన్ఎస్ఏగా పంకజ్ శరణ్
న్యూఢిల్లీ: భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా సీనియర్ దౌత్యవేత్త పంకజ్ శరణ్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ పంకజ్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1982 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) బ్యాచ్‌కు చెందిన పంకజ్ 2015 నుంచి ఇప్పటివరకూ రష్యాలో భారత రాయబారిగా ఉన్నారు. ప్రధాని కార్యాలయంలో 1995–99 మధ్యకాలంలో డిప్యూటీ కార్యదర్శిగా, 2007 నుంచి 2012 వరకూ సంయుక్త కార్యదర్శిగా పంకజ్ పనిచేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పంకజ్ సహాయకారిగా ఉండనున్నారు. -
అమెరికాలోని మేరీలాండ్‌లో కాల్పుల కలకలం
-
అమెరికాలో కాల్పుల కలకలం
మేరీలాండ్, అమెరికా : అమెరికాలోని మేరీలాండ్‌లో గల నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఎన్ఎస్ఏ ప్రాంతంలో కాల్పులకు దిగిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అరెస్టు చేసిన దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
పని బారెడు..జీతం మూరెడు
ఎస్ఎస్ఏలో కాంట్రాక్ట్ సిబ్బంది ఆవేదన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కొత్తపేట : విద్యాభివృద్ధి, ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ ఫలితాలే లక్ష్యమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు ఆచరణలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. విద్యాశాఖలో సర్వ శిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ)లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల పనితో పోలిస్తే ఎక్కువ పనిచేస్తున్నా తగిన ఫలితం మాత్రం పొందలేకపోతున్నారు. తమకు ఉద్యోగ భద్రత ,సమాన పనికి సమాన వేతనం, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఏమాత్రం కరుణించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో ఎస్ఎస్ఏ ద్వారా 1,175 మంది పని చేస్తుండగా వారిలో 287 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ), 64 మంది చొప్పున కంప్యూటర్ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, ఎంఆర్సీ అసిస్టెంట్స్, పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు 696 మంది ఉన్నారు. చాలిచాలని వేతనాలు 2011లో అప్పటి ప్రభుత్వం జిల్లా కమిటీ ఇంటర్వూలు ద్వారా గ్రాడ్యుయేట్‌తో బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారిని రూ.5,500 వేతనంతో నియమించింది. 2013,14 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రూ.1,500 చొప్పున పెంచింది. ప్రస్తుతం రూ.8,500 జీతంతో తీవ్ర కష్టాల నడుమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు 2004లో అప్పటి ప్రభుత్వం రూ.1,500 వేతనంతో నియమించింది.తరువాత 2007 నుంచి 2014 వరకూ 5 దఫాలుగా రూ.8,500 పెంచాయి.ప్రస్తుతం రూ 10,000 జీతంతో పనిచేస్తున్నారు. 2012 లో అప్పటి ప్రభుత్వం ఎంఐఎస్ కోర్డినేటర్స్ను రూ.8,500 వేతనంతో నియమించింది. 2013,14ల్లో రూ.3,500 పెంచింది.ప్రస్తుతం రూ.12 వేలు జీతానికి పనిచేస్తున్నారు. 2005లో చేరిన ఎంఆర్సీ అసిస్టెంట్లు ప్రస్తుతం రూ.7,500కు పని చేస్తున్నారు. రూ 6 వేలతో ఎలా బతికేదెలా? 2012–13 సంవత్సరంలో ఎస్ఎస్ఏ లో పార్టటైం ఇన్స్ట్రక్టర్లు (డ్రాయింగ్,క్రాప్టు, పీఈటీలు)గా జిల్లాలో సుమారు 696 మంది నియమితులయ్యారు. మొదట వారికి రూ.4,500 గౌరవ వేతనంగా చెల్లించారు.2014–15 లో రూ.6 వేలకు పెంచారు. గతంలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లను విద్యా సంవత్సరం నిర్వహించిన విధులకు సంబంధించి వేతనాలు చెల్లించగా ఈ ఏడాది మే 3 నుంచే విధుల్లోకి తీసుకోవాలని ఆర్సీ నెంబరు 1707/ఏపీ ఎస్ఎస్ఏ/ఏ9-2017 ప్రకారం స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) మే 3న జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో అధికారులు లేనిపోని సాకులు చూపుతూ అమలు చేయలేదని వారు వాపోయారు. కేవలం తమ టీచింగ్ విధులే కాక అదనంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తమను ఉపయోగించుకుంటున్నారని, తాజాగా విద్యార్థి గణన కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పీఏబీ ప్రతిపాదిత జీతాలేవి? ఎస్ఎస్ఏ కు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ప్రతిపాదించిన రూ.20,755 చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ మిగిలిన నిధులను వేరే పథకాలకు మళ్లిస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల పొట్టకొడుతోందని వాపోతున్నారు. ఆర్పీ, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోర్డినేటర్లు, ఎంఆర్సీ అసిస్టెంట్లకు మే నుంచి, పీటీఐలకు కూడా ఎస్పీడీ ఉత్తర్వుల ప్రకారం 2 నెలలుగా జీతాలు విడుదల కావడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేస్తామని మరచిపోయారని విమర్శిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 7న ఔట్సోర్సింగ్ సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు సరికదా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి పెంచలేదు. ఈ మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. అరకొర జీతాలతో కుటంబాల పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. -ఎం శ్రీనివాసరావు,ప్రెసిడెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్, అల్లవరం -
ఉగ్రదాడా..? ఉలికిపాటా?
బారాముల్లా కాల్పుల ఘటనపై గందరగోళం * ఇద్దరు ఉగ్రవాదుల మరణం నిర్ధారణ కాలేదన్న హోం శాఖ * జవాన్ ఎలా చనిపోయాడన్న దానిపై సందిగ్ధం * ఎల్వోసీ వెంట ఉద్రిక్తతల తగ్గింపుపై ఎన్ఎస్ఏల చర్చలు శ్రీనగర్: ఆదివారం రాత్రి 10.30 గంటలు... కశ్మీర్‌లోని బారాముల్లా పట్టణం బీఎస్ఎఫ్ ఆర్మీ శిబిరంపై తెగబడ్డ ఉగ్రవాదులు.. జవాన్ల ఎదురు కాల్పులు.. ఉగ్రవాదుల హతం.. ఒక బీఎస్ఎఫ్ జవాను అమరుడయ్యాడంటూ కథనాలు...తెల్లారేసరికి సీన్ రివర్స్... ఉగ్రవాదులెవరూ మరణించలేద ని ప్రకటనలు..! హోం శాఖ మాత్రం ఉగ్రవాదులు హతమయ్యారంటూ ఒకసారి, ఇంకా నిర్ధారణ కాలేదంటూ మరోసారి ప్రకటించి గందరగోళాన్ని మరింత పెంచింది. ఇక ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లు మాత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, చీకట్లో తప్పించుకుపారిపోయారంటూ పేర్కొన్నాయి. జన్బాజ్పురా వద్ద 40వ బెటాలియన్ సెంట్రీ... వంట ప్రాంతంలో అనుమానాస్పద కదలికల్ని గుర్తించి కాల్పులు జరిపాడు. ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించారా? లేదా బయటి నుంచి కాల్పులు జరుపుతున్నారా? అన్నది తెలియక జవాన్లు నలువైపుల నుంచి కాల్పులు కొనసాగించారు. 90 నిమిషాల తర్వాత భారీ వెలుతురులో వెదికితే ఉగ్రవాదుల ఆనవాళ్లు కనిపించలేదు. ఉగ్రవాదుల కాల్పులు నిజం: ఆర్మీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, చీకట్లో తప్పించుకు పారిపోయారన్నది ఆర్మీ అధికారుల వాదన. కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ నితిన్, పుల్విందర్లు గాయపడగా వారిని శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నితిన్ చికిత్స పొందుతూ మరణించాడు. బీఎస్ఎఫ్ జవాను ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడా? లేదా... సైన్యం కాల్పుల్లో పొరపాటున గాయపడి మరణించాడా?(ఫ్రెండ్లీ ఫైరింగ్) అన్నది ఇంకా తేలలేదు. ఆదివారం అర్ధరాత్రి ఉధమ్‌పూర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కమాండ్ పరిధిలోని బారాముల్లాలో కాల్పులు జరిగాయని ఆర్మీ ట్వీట్ చేసింది. దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని సోమవారం ఉదయం పేర్కొన్న హోంశాఖ అనంతరం ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పింది. జీపీఎస్ పరికరం, మందుగుండు స్వాధీనం బీఎస్ఎఫ్ ఐజీ (కశ్మీర్ ) వికాస్ చంద్ర మాట్లాడుతూ... దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నారని, జీపీఎస్ పరికరం, కంపాస్, వైర్ కట్టర్‌తో పాటు మందుగుండును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. సోమవారం ఉదయం జీలం నది పరీవాహక ప్రాంతంలో గాలింపు నిర్వహించామన్నారు. నితిన్‌పైకి ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడన్నారు. ఉగ్రవాద గ్రూపుల ప్రయత్నాల్ని భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లేహ్‌లో అన్నారు. పాక్ కవ్వింపు కాల్పులు పాక్ దళాలు సోమవారం నాలుగుసార్లు కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దు వెంట ఉన్న భారత సైనిక శిబిరాలు, జనావాసాలపై కాల్పులకు తెగబడ్డాయి.ఐదుగురు పౌరులు గాయపడగా, అనేక దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పాక్ దాడుల్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పూంచ్ జిల్లాలోని షాహ్పూర్, కృష్ణగాటి, మండీ, సబ్జీయన్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. జాతీయ భద్రతా సలహాదారుల చర్చలు ఉద్రిక్తత తగ్గించాలని భారత్, పాక్ అంగీకారానికి వచ్చాయని, ఈ మేరకు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఫోన్లో మాట్లాడుకున్నారని పాక్ దౌత్యవేత్త సర్తాజ్ అజీజ్ చెప్పారు. భారత భద్రతా సలహాదారు దోవల్, పాక్ సలహాదారు జన్జువాలు చర్చించారన్నారు. ఎల్వోసీలో ఉద్రిక్తత తగ్గాలనేది పాక్ కోరికని, కశ్మీర్‌పై దృష్టి పెట్టడమే తమ లక్ష్యమన్నారు. -
ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ
-
ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: జాతీయ భద్రత సంస్థ(ఎన్ఎస్ఏ) ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదుల దాడిపై ఈ సమావేశంలో చర్చించారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని ఈ సమావేశం నిర్వహించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పఠాన్ కోట్ లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆరుగురు తీవ్రవాదులను కాల్చిచంపినట్టు సమాచారం. -
'ఆ రహస్య భేటీ వివరాలు వెల్లడించాలి'
న్యూ ఢిల్లీ: బ్యాంకాక్‌లో ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, దీపిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనను విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పాకిస్థాన్‌తో సంబంధాల విషయంలో పార్లమెంట్లో చేసిన ప్రకటన నుంచి ప్రభుత్వం తప్పుకొన్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. పాక్‌తో సంబంధాలపై ప్రభుత్వ విధానాన్ని బహిర్గతం చేయాలని మాజీ విదేశాంగ మంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు. బ్యాంకాక్‌లో సోమవారం ఇరు దేశాల భద్రతా సలహాదారుల సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పర్యావరణ సదస్సు సందర్భంగా పారిస్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతా సలహాదారుల సమావేశం బ్యాంకాక్‌లో జరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా వచ్చే ఏడాది పాక్‌లో జరగనున్న సార్క్ సదస్సుకు నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
'45 నిమిషాల్లో లక్షన్నర ఫాలోవర్స్'
న్యూఢిల్లీ: అమెరికాకు సంబంధించి పలు రహస్యాలను బట్టబయలు చేసి ఆ దేశానికి వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రస్తుతం పెరుగుతున్న ఫాలోవర్స్ సంఖ్య నిమిషానికి మూడు వేలమంది ఉన్నారు. తనకు అంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్న స్నోడెన్ మాత్రం తొలిసారి అమెరికాకు చెందిన రక్షణ సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఎజెన్సీని ఫాలో అవడం విశేషం. 'కెన్ యూ హియర్ మీ నౌ' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు. ఆయన ఖాతా ప్రొఫైల్ వివరాల ప్రకారం ఫ్రీడాన్ఆఫ్ ప్రెస్‌కు ఆయన ప్రస్తుతం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ట్విట్టర్లో స్నోడెన్ జాయిన్ అవడం పట్ల అన్ని దేశాలతోపాటు భారత్ కూడా ఆయన ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారా అని తీవ్ర ఆసక్తితో ఉంది. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 7.79 లక్షలుమంది ఉండగా మరో నాలుగు రోజుల్లో 50 లక్షలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా పౌరుడు, సీఐఏ మాజీ ఉద్యోగి అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికాకు సంబంధించి అసాధారణమైన అంశాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పౌరులు నిత్యమూ జరుపుతున్న ఫోన్ సంభాషణలు, ఛాటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్సింగ్‌లు, ఈమెయిల్స్‌పై అమెరికా నిరంతర నిఘా పెట్టిందని, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లే కాదు... క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల పిన్ నంబర్లు దొంగిలిస్తున్నదని ఆయన అమెరికా దుశ్చర్యలను చెప్పాడు. స్వ పర భేదాలు కూడా లేకుండా నమ్మకస్తులైన మిత్రులుగా ఉంటున్న యూరోపియన్ యూనియన్ దేశాలపైనా, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియాలపైనా కూడా గూఢచర్యానికి పాల్పడుతున్నదని స్నోడెన్ వెల్లడించడంతో పెను సంఛలనమే అయింది. -
ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు?
కశ్మీర్ అంశంపై పాక్‌కు హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రశ్న * భారత్-పాక్ చర్చల రద్దుపై రాజకీయ పార్టీల విచారం * పాక్ తప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశమిచ్చింది: కాంగ్రెస్ * ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట బయటపెట్టాం: బీజేపీ న్యూఢిల్లీ/శ్రీనగర్: భారత్-పాకిస్తాన్ల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలు రద్దవటం పట్ల కేంద్ర ప్రభుత్వం సహా వివిధ రాజకీయ పార్టీలు విచారం వ్యక్తం చేశాయి. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్.. ఆ అంశాన్ని ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారు. ఎన్ఎస్ఏ చర్చలకు ఉఫాలో నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ పక్కకు మళ్లాల్సింది కాదన్నారు. పొరుగుదేశంతో స్నేహసంబంధాలకు భారత్ ఎప్పుడూ సానుకూలంగా ఉందని, ఆ దిశగా కృషి కొనసాగుతుందని అన్నారు. అయితే.. ప్రభుత్వం పాక్ ఆడిన ఆటలో పావుగా మారిందని, ఉగ్రవాదంపై చర్చల నుంచి పాక్ తప్పించుకోవటానికి అవకాశమిచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కానీ.. ఈ చర్చల నుంచి తప్పుకున్న పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట తమ సర్కారు బట్టబయలు చేసిందని అధికార బీజేపీ పేర్కొంది. ప్రతి ద్వైపాక్షిక చర్చల్లో అందరి భాగస్వామ్యం కోసం పట్టుపట్టటం వాంఛనీయం కాదని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వేర్పాటువాద హురియత్ నేతలు విమర్శించారు. చర్చలు రద్దుకావటానికి కారణం వారేనని, వెనక్కు తగ్గి ఉండాల్సిందని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తప్పుపట్టారు. భారత్ - పాక్‌ల మధ్య చర్చలు రద్దుకావటం పట్ల అమెరికా నిరాశ వ్యక్తంచేసింది. ఇరు దేశాలూ త్వరలో చర్చలు పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఉఫాలో భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు నిర్ణయించిన మేరకు.. పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ సోమవారం ఢిల్లీలో భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో సమావేశమై చర్చలు జరపాల్సి ఉండగా.. అజీజ్ ఢిల్లీలో హురియత్ నేతలను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరో అంశాన్ని లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేయటంతో పాక్ ఆ చర్చలను శనివారం నాడు రద్దుచేసుకున్న విషయం తెలిసిందే. పాక్ నేతలు భారత్ వచ్చినపుడు హురియత్ నేతలను కలవటం మామూలేనని, కశ్మీర్ అంశం లేనిదే చర్చలు నిష్ర్పయోజనమని పేర్కొన్న పాక్.. ఈ అంశాలపై భారత్ ముందస్తు షరతులు పెడుతోందని ఆరోపిస్తూ చర్చలు రద్దుచేసుకుంది. అయితే.. తాము ముందస్తు షరతులు పెట్టలేదని.. ఉఫాలో ఒప్పందం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా ప్రకారం కేవలం ఉగ్రవాదం, దానికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరపాలని, సిమ్లా ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక చర్చల్లో మూడో పక్షానికి తావులేదని.. ఈ రెండు ఒప్పందాల స్ఫూర్తిని గౌరవించాలని మాత్రమే తాము చెప్తున్నామని భారత ప్రభుత్వం పేర్కొన్న విషయమూ విదితమే. ఈ పరిణామాలపై ఆయా పార్టీల ప్రతిస్పందనలివీ... మూడో పక్షానికి తావులేదు: కేంద్రం ‘‘కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్ ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు కలిసినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అది ఎజెండాలో ఎన్నడూ లేదు. ఎన్ఎస్ఏల చర్చలు రద్దుకావటం విచారకరం. ఉఫాలో ఇరువురు ప్రధానుల సమావేశం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ దారిమళ్లాల్సింది కాదు. ఎన్ఎస్ఏ చర్చల్లో మూడో పక్షానికి (హురియత్) తావులేదు. ఈ చర్చలకు ముందు కానీ, మధ్యలో కానీ, తర్వాత కానీ ఇతరులతో చర్చలు జరపటమనే ప్రశ్నే లేదు. ముందు నిర్ణయించినట్లు ఉగ్రవాదంపై పాక్ చర్చలు జరపాల్సింది. భవిష్యత్తులో ఎలాంటి చర్చలైనా సాధ్యమవుతాయా లేదా అన్నది పాక్ పైనా ఆధారపడి ఉంది.’’ - రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి పాక్ ఆటలో పావు అయింది: కాంగ్రెస్ ‘‘పాక్ ఆడిన ఆటలో కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా లేకపోవటం, సంసిద్ధంగా లేకపోవటం, దృష్టి కేంద్రీకరించి లేకపోవటం వల్ల పావుగా మారింది. ఉగ్రవాదంపై చర్చల నుంచి తప్పుకుపోవటానికి ఆ దేశానికి అవకాశమిచ్చింది.’’ - అభిషేక్సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాక్ వైఖరి తేటతెల్లమైంది: బీజేపీ ‘‘చర్చల నుంచి పాక్ వైదొలగటం చాలా విచారకరం. ఉగ్రవాదంపై చర్చిస్తే ప్రపంచం ఎదుట తన బండారం బయటపడుతుందని పాక్‌కు తెలుసు. చర్చల నుంచి పాక్ వైదొలగటంతో.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ వేదికపై ఆ దేశ వైఖరిని మా ప్రభుత్వం బట్టబయలు చేసింది.’’ - సంబిత్పాత్రా, బీజేపీ అధికార ప్రతినిధి ‘‘వేర్పాటు నేతలను కలవాలని పాక్ ఎన్ఎస్ఏ పట్టుపట్టటం సరికాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎస్పీ పూర్తి మద్దతు ఇస్తోంది.’’ - రామ్‌గోపాల్‌యాదవ్, ఎస్పీ నేత ‘‘హురియత్ నేతలు పాక్ దౌత్యకార్యాలయంలో కార్యక్రమానికి హాజరుకాకుండా ఏ చట్టం కింద నిరోధించవచ్చు? మోదీ నరేంద్రమోదీ మాట్లాడాలి. నా జీవితంలో అత్యంత నిరుత్సాహకరమైన వ్యక్తి ఆయన.’’ - రాంజెఠ్మలాని, బీజేపీ మాజీ నేత లేహ్‌లో పారికర్ పర్యటన.. లదాఖ్ సరిహద్దుల వెంట, సీమాంతర చొరబాట్ల విషయంలో రక్షణ సంసిద్ధత సహా జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమీక్షించారు. లదాఖ్ పర్యటనలో భాగంగా పారికర్ సైన్యం చీఫ్ జనరల్ దల్బీర్సింగ్తో కలిసి ఆదివారం లేహ్ వచ్చారు. భారత్‌ను తప్పుపట్టిన పాక్ మీడియా భారత్-పాక్‌ల మధ్య ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దుకావటానికి.. ముందస్తు షరతులు పెట్టిన భారత్ వైఖరే కారణమని పాక్ మీడియా తప్పుపట్టింది. ప్రధాన వార్తాపత్రికలన్నీ చర్చల రద్దు కావటంపై ఆదివారం తొలి పేజీలో కథనాలు ప్రచురించాయి. పాక్ ఎన్ఎస్ఏ ఢిల్లీలో భారత్ ఎన్ఎస్ఏను కలసి ఉగ్రవాదం సహా అన్ని అంశాలపైనా చర్చించాల్సి ఉందని.. కానీ భారత్ ముందస్తు షరతులు పెట్టిందని.. దానివల్లే చర్చలు రద్దయ్యాయని విమర్శించాయి. డాన్, న్యూ ఇంటర్నేషనల్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తదితర పత్రికలు భారత్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. గిలానీ సదస్సు ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు శ్రీనగర్: అతివాద హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ గిలానీ ఆదివారం శ్రీనగర్‌లోని తన నివాసంలో పార్టీ సదస్సు నిర్వహించటానికి చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వాధికారులు విఫలం చేశారు. హైదర్‌పోరాలోని గిలానీ నివాసానికి వెళ్లే ఎయిర్పోర్ట్ రోడ్ వెంట భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి దారిని మూసివేశారు. దీంతో ఆగ్రహించిన హురియత్ కార్యకర్తలు సమీపంలోని ప్రార్థనామందిరం వద్ద సమావేశమై.. పోలీసు వలయం నుంచి దూసుకెళ్లటానికి ప్రయత్నించారు. కార్యకర్తలకు, పోలీసులకు ఘర్షణ తలెత్తింది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్, లాఠీలు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. డీజీఎంఓ చర్చలు జరుగుతాయి: పాక్ ఇస్లామాబాద్: ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను రద్దు చేసుకున్న పాకిస్తాన్.. ఆ మరుసటి రోజే రెండు దేశాల డీజీఎంఓల (డెరైక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) భేటీలు యథావిధిగా జరుగుతాయని పేర్కొంది. ఉఫా ప్రకటన మేరకు పాక్ రేంజర్లు - బీఎస్ఎఫ్ ప్రతినిధుల చర్చలు జరుగుతాయని పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ ఆదివారం వెల్లడించారు. వచ్చే నెల 6న నిర్ణయించిన ఈ భేటీకి.. మరింత వ్యవస్థీకరణ అవసరమన్నారు. ఎన్ఎస్ఏ చర్చల రద్దుకు భారతే కారణమన్నారు. ‘‘కశ్మీర్ అంశంపై చర్చలు జరపటం ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ఉఫా భేటీ లక్ష్యం.. ఉద్రిక్తతను తగ్గించటం. కాబట్టి కశ్మీర్‌పై చర్చించాల్సిన అవసరముంది’’ అని అన్నారు. -
పాక్‌తో చర్చలు అనుమానమే!
భారత్ - పాక్‌ల ఎన్ఎస్ఏ చర్చలపై ‘హురియత్’ నీలినీడలు కశ్మీర్ వేర్పాటు నేతలతో పాక్ ఎన్ఎస్ఏ భేటీ కావాలనుకోవడంపై భారత్ ఆగ్రహం అది సరికాదని, ఆ ఆలోచన విరమించుకోవాలని పాక్‌కు సూచన * భారత్ సలహాను తోసిపుచ్చిన పాకిస్తాన్; హురియత్ నేతలను కలుస్తామని స్పష్టీకరణ * సంయమనం పాటించాలని ఇరుదేశాలకు ఐరాస చీఫ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాక్ మొండి పట్టుదలతో చర్చలకు పురిట్లోనే సంధి కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. చర్చల కోసం రేపు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ కశ్మీర్ వేర్పాటు నేతలతో భేటీ కావాలనుకోవడంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం చర్చల ప్రక్రియ నిలిపివేతకు దారితీసేలా కనిపిస్తోంది. వేర్పాటువాద నేతలతో భేటీ సరికాదని భారత్ సున్నితంగా ఇచ్చిన సూచనను పాక్ పెడచెవిన పెట్టింది. ఎన్ఎస్ఏ చర్చల కోసం భారత్ వస్తున్న పాక్ అధికారి.. కశ్మీర్ వేర్పాటు నేతలను కలుసుకోవడం తమకు ఆమోదయోగ్యం కాదన్న భారత్ సలహాను పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భారత్ వెళ్లే తమ నేతలు, అధికారులు వేర్పాటువాదులతో భేటీ కావడం సాధారణమేనని, ఆ సంప్రదాయాన్ని కాలదన్నే ఆలోచన తమకు లేదని అధికారికంగానే తేల్చిచెప్పింది. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, హురియత్ నేతలే ‘భారత్ ఆక్రమిత కశ్మీరీ’ల నిజమైన ప్రతినిధులంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేసింది. చర్చల బంతి భారత్ కోర్టులో ఉందని, చర్చల్లో పాల్గొంటారా? లేక బంతిని తీసుకుని పారిపోతారా? చూడాల్సి ఉందంటూ పాక్ సమాచార మంత్రి పర్వేయిజ్ రషీద్ అన్నారు. పాక్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. నిర్మాణాత్మక చర్చలు జరపాలంటూ రష్యాలోని ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్‌లు తీసుకున్న నిర్ణయం నుంచి పాక్ తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. ‘హురియత్ నేతలతో భేటీ కావాలనుకునే పాక్ పట్టుదల ఉఫా ఒడంబడికకు సంపూర్ణ ఉల్లంఘనే కాకుండా ఆమోదిత ఎజెండానుంచి తప్పుకోవడమే’ అని స్పష్టం చేసింది. ‘ద్వైపాక్షిక సంబంధాల్లో ఇద్ద రు ప్రతినిధులు మాత్రమే ఉంటారు. ముగ్గురు కాదనే విషయంలో భారత్ స్పష్టతతో ఉంది. ఆ విధానానికే కట్టుబడి ఉంది. ఏకపక్షంగా షరతులు, ఆమోదిత ఎజెండాను ఉల్లంఘించడం చర్చలకు ప్రాతిపదిక కాబోవు’ అని తేల్చిచెప్పింది. భారత్ ఆగ్రహాన్ని పట్టించుకోని పాక్.. సోమవారం ఉదయం 9.30 గంటలకు పాక్ ఎన్ఎస్ఏ అజీజ్ కశ్మీర్ అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీతో భేటీ అవుతారని ప్రకటించింది. అంటే, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో భేటీకి ముందే గిలానీతో అజీజ్ సమావేశమవుతారు. కాగా, పాక్‌తో జరిగే చర్చల్లో ఉగ్రవాదం మాత్రమే ఎజెండా అని భారత హోంమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. చర్చలకు కట్టుబడి ఉన్నామని, అయితే, పాక్ విధిస్తున్న ఏకపక్ష షరతులు చర్చల కొనసాగింపునకు ప్రాతిపదిక కాబోవని భారత్ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఉఫాలో రెండు దేశాల ప్రధానులు అంగీకరించిన ఎజెండాపై పాక్ వెనక్కి వెళ్తోందని, అది చర్చలను పాక్ సీరియస్ తీసుకున్నట్లు కనిపించడం లేదంది. అది మా సంప్రదాయం: పాక్ అర్థంలేని కారణాలు చూపుతూ భారత్ ముందస్తు షరతులు విధించడం తమకు నిరుత్సాహం కలిగిస్తోందని పాక్ పేర్కొంది. ముందు అంగీకరించిన నిర్ణయాలపై భారత్ వెనక్కు వెళ్తోందంటూ పాక్ విదేశాంగ శాఖ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. హురియత్ నేతలతో తమ చర్చలుంటాయని స్పష్టం చేసింది. భారత్ ఆజ్ఞలను పాటించబోమని, భారత్-పాక్ చర్చలు షరతులతో కూడిన దౌత్యంపై ఆధారపడిలేవని పేర్కొంది. చర్చల నుంచి పారిపోయేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇప్పటికీ చర్చల ఎజెండాను భారత్ తమకు పంపించనేలేదని ఆరోపించింది. చర్చలకు ముందస్తు షరతులు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదంది. పాక్ సైన్య, పౌర నాయకత్వంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక సమాలోచనలు జరిపిన అనంతరం ఈ స్పందన వెలువడింది. ‘అమలు చేయని ఐరాస భద్రతామండలి తీర్మానం ప్రకారం.. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతం. భారత్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల వాస్తవ ప్రతినిధులు హురియత్ నేతలే. కశ్మీర్ సమస్య పరిష్కార యత్నాల్లో వారిదే వాస్తవ ప్రాతినిధ్యం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉఫా ప్రకటన మేరకు కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలతో ఎజెండాను ఈ చర్చల నిమిత్తం భారత్‌కు ప్రతిపాదించాం’ అని తెలిపారు. హురియత్ నేతలతో భేటీ కావడమనే సంప్రదాయం నుంచి తప్పుకోదల్చుకోలేదని పాక్‌లోని భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్‌కు పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధరి శుక్రవారం సందేశం పంపించారు. దౌత్యంలో షరతులుండవు: హురియత్ న్యూఢిల్లీ/శ్రీనగర్: దౌత్య వ్యవహారాల్లో హద్దులు, షరతులు ఉండకూడదని జమ్మూ కశ్మీర్ మితవాద వేర్పాటువాది, హురియత్ నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ అన్నారు. భారత్, పాక్‌లు చిత్తశుద్ధితో చర్చల ప్రక్రియ కొనసాగించగలిగితే, ఆ చర్చల్లో ఎప్పుడు పాలు పంచుకోవాలనే విషయంలో తమకు పట్టింపు లేదన్నారు. కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యలు పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమన్నారు. కశ్మీర్ సమస్యను పక్కనపెట్టడమో, పట్టించుకోకపోవడమో చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ‘కశ్మీర్ సరిహద్దు సమస్య కానే కాదు. అది 1.25 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. కశ్మీరీలు తృతీయ స్థాయి ప్రతినిధులు కాదు. వారే మౌలికప్రతినిధులు’ అని ఆయన స్పష్టం చేశారు. చర్చలు జరపండి.. కాగా, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ బాన్‌కి మూన్ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్చలను జరపాలన్నారు. పాక్, ఐఎస్ఐఎస్ జెండాల ప్రదర్శన శ్రీనగర్: శ్రీనగర్‌లో శుక్రవారం కొంతమంది యువకులు భారత జాతీయ పతాకాన్ని తగులబెట్టి, పాక్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. నౌహట్టా ప్రాంతంలోని జామియా మసీదులో ప్రార్థనలు ముగిశాక ఆందోళనకారులు అక్కడి దగ్గర్లో నిరసన తెలిపారు. త్రివర్ణ పతాకంతోపాటు పీడీపీ పార్టీ జెండాలనూ దగ్ధం చేశారు. వారిలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వేర్పాటువాద నేత అహ్మద్ షాకు గృహనిర్బంధం కశ్మీర్ వేర్పాటువాద నేత, డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ చీఫ్ షాబిర్ అహ్మద్ షాను శుక్రవారం ప్రార్థన నేపథ్యంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసులు ఆయనకు ప్రార్థనల కోసం బయటకెళ్లేందుకు అనుమతించలేదని పార్టీ ప్రతినిధి తెలిపారు. మరోపక్క.. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ గృహనిర్బంధం కొనసాగుతోంది. హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్ తదితర వేర్పాటు నేతలను గురువారం పోలీసులు కొన్నిగంటల పాటు గృహనిర్బంధంలో ఉంచి తర్వాత విడుదల చేశారు. ఉఫా స్ఫూర్తిని కాలదన్నడమే: భారత్ పాక్ తీరు ‘ఉఫా’ స్ఫూర్తిని కాలదన్నేలా ఉందని భారత్ పేర్కొంది. ‘అన్ని ఉగ్రవాద అంశాలపై చర్చించాలని ఉఫాలో ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతికి చర్యలు తీసుకోవాలని అంగీకరించారు. కానీ జరుగుతున్నదేంటి? సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిగాయి. ఓ పాక్ ఉగ్రవాదిని పట్టుకున్నాం. ఇవన్నీ చర్చల సందర్భంగా పాక్‌కు ఇబ్బంది కలిగించేవే. అందుకే చర్చల నుంచి తప్పుకునేందుకు పాక్ ఈ ఎత్తులు వేస్తోంది’ అని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ జైపూర్‌లో అన్నారు. చర్చల ఎజెండాను పాక్‌కు పంపామని, దానికి విరుద్ధమైన ఎజెండాను పాక్ పంపిందని వెల్లడించారు. -
టైప్ రైటర్లు మళ్లీ వచ్చేస్తున్నాయోచ్!
కంప్యూటర్లు, లాప్ టాప్ లు, టాబ్ ల యుగంలో టైప్ రైటర్లకు పనేంటి అనుకుంటున్నారా? ఆధునిక లైఫ్ లో డైనోసార్ల లాంటి మెషిన్ అవసరం ఏమిటి అనుకుంటున్నారా? అవసరం ఉందంటున్నారు జర్మన్లు. అందుకే జర్మనీలో ఇప్పుడు టైప్ రైటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అమెరికా గూఢచర్యం నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు జర్మన్లు టైప్ రైటర్లపైనే ఆధారపడుతున్నారు. ఎందుకంటే అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఎన్ ఎస్ ఏ ఏకంగా జర్మనీ చాన్స్‌లర్ ఎంజిలా మెర్కెల్ ఫోన్ నే ట్యాప్ చేసింది. చాలా మంది రాజకీయనాయకుల ఫోన్లను, ఈ మెయిల్ ఎకౌంట్లను, వెబ్ సైట్లను కూడా అమెరికా నిఘావేసి చూస్తోంది. దీంతో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా గూఢచర్యం చేయడం సులువని జర్మన్లు గుర్తించారు. అందుకే టైప్ రైటర్ల యుగానికి వెళ్లిపోదాం అని వారు నిర్ణయించుకున్నారు. ఒలింపియా, బాందెర్మాన్ కంపెనీల టైప్ రైటర్లకు ఇప్పుడు భారీగా గిరాకీ పెరిగింది. తమకు 10000 కి పైగా ఆర్డర్లున్నాయని ఆ కంపెనీలు చెబుతున్నాయి. టైప్ రైటర్ ను బగ్ చేయడం, ట్యాప్ చేయడం అసాధ్యం కాబట్టి దీన్నే వాడమని జర్మన్ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారట. అందుకే జర్మనీలో టైప్ రైటర్లు వచ్చేశాయోచ్! -
అమెరికాకు సమన్లు జారీ చేసిన భారత్
న్యూఢిల్లీ : భారత్‌లో బీజేపీ నేతల కాల్‌డేటాను అమెరికా తస్కరించటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం అమెరికా దౌత్యవేత్తలను పిలిపించి చర్చించింది. ఇటువంటి చర్యలు ఆమోద యోగ్యం కాదని భారత్ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. అయితే మళ్లీ అలాంటి తప్పిదం జరగదంటూ అమెరికా హామీ ఇచ్చింది. కాగా నిఘా చర్యను నిరసిస్తూ అమెరికా దౌత్య అధికారులకు భారత్ సమన్లు జారీ చేసింది. కాగా భారతీయ జనతా పార్టీ సహా.. ప్రపంచంలోని కొన్ని రాజకీయ పార్టీలపై నిఘా పెట్టే అధికారాన్ని అమెరికా నిఘా సంస్థ ఎన్ఎస్ఏకు 2010లో అక్కడి కోర్టు మంజూరు చేసింది. ఈజిప్టులోని ముస్లిం బ్రదర్హుడ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. నిఘా వ్యవహారం ఇన్నేళ్ల తర్వాత బయటపడింది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించిన విషయం తెలిసిందే.