అమెరికాకు సమన్లు జారీ చేసిన భారత్
న్యూఢిల్లీ : భారత్‌లో బీజేపీ నేతల కాల్డేటాను అమెరికా తస్కరించటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం అమెరికా దౌత్యవేత్తలను పిలిపించి చర్చించింది. ఇటువంటి చర్యలు ఆమోద యోగ్యం కాదని భారత్ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. అయితే మళ్లీ అలాంటి తప్పిదం జరగదంటూ అమెరికా హామీ ఇచ్చింది. కాగా నిఘా చర్యను నిరసిస్తూ అమెరికా దౌత్య అధికారులకు భారత్ సమన్లు జారీ చేసింది.
కాగా భారతీయ జనతా పార్టీ సహా.. ప్రపంచంలోని కొన్ని రాజకీయ పార్టీలపై నిఘా పెట్టే అధికారాన్ని అమెరికా నిఘా సంస్థ ఎన్ఎస్ఏకు 2010లో అక్కడి కోర్టు మంజూరు చేసింది. ఈజిప్టులోని ముస్లిం బ్రదర్హుడ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. నిఘా వ్యవహారం ఇన్నేళ్ల తర్వాత బయటపడింది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించిన విషయం తెలిసిందే.