'ఆ రహస్య భేటీ వివరాలు వెల్లడించాలి'
న్యూ ఢిల్లీ: బ్యాంకాక్లో ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, దీపిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనను విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పాకిస్థాన్తో సంబంధాల విషయంలో పార్లమెంట్లో చేసిన ప్రకటన నుంచి ప్రభుత్వం తప్పుకొన్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. పాక్తో సంబంధాలపై ప్రభుత్వ విధానాన్ని బహిర్గతం చేయాలని మాజీ విదేశాంగ మంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు.
బ్యాంకాక్లో సోమవారం ఇరు దేశాల భద్రతా సలహాదారుల సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పర్యావరణ సదస్సు సందర్భంగా పారిస్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతా సలహాదారుల సమావేశం బ్యాంకాక్లో జరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా వచ్చే ఏడాది పాక్లో జరగనున్న సార్క్ సదస్సుకు నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.