స్టాక్ మార్కెట్ల గురించి తెలియని వారు కూడా ఈ ఏడాది బిట్‌కాయిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన లేనివారు కూడా బిట్‌కాయిన్లో పెట్టుబడి పెట్టాలని ఊగిపోయారు. ఇదంతా ఎందుకంటే బిట్‌కాయిన్ పెట్టిన పరుగు అలాంటిది మరి. నిన్న మొన్నటివరకూ దీన్నో అర్ధంకాని అంశంగా భావించిన సామాన్య ఇన్వెస్టర్లూ ఇపుడు దీనివెంట పడటం మొదలెట్టారు.
2017 ఆరంభంలో దాదాపు వెయ్యి డాలర్ల వద్ద కదలాడిన ఈ క్రిప్టో కరెన్సీ... ఏడాది చివరినాటికి ఏకంగా 20,000 డాలర్ల స్థాయికి దూసుకెళ్లి.. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. అంటే ఏకంగా 1,900 శాతం ఎగబాకినట్లు లెక్క. ఏడేళ్లలో అయితే ఏకంగా 44 లక్షల శాతానికి పైగా పెరిగిన ఏకైక అసెట్‌క్లాస్‌గా రికార్డు సృష్టించింది.
అంతేకాక... బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి ఎందరో సంపన్నుల సంపదను, ఇంకెన్నో దేశాల జీడీపీని.. మరెన్నో ప్రపంచవ్యాప్తంగా బలమైన ముద్రవేసిన బోయింగ్, పెప్సీకో, మెక్‌డోనాల్డ్స్ లాంటి పలు కంపెనీల మార్కెట్ విలువను కూడా దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ అధిగమించేసింది. భవిష్యత్తులో దీనికున్న ప్రాధాన్యాన్ని పసిగట్టిన దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీలు బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌ను కూడా ప్రశేపెట్టాయి. ఇటీవలే షికాగో స్టాక్ ఎక్సే్చంజ్‌లో బిట్‌కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మొదలైంది. నాస్‌డాక్ కూడా కొత్త ఏడాది ఆరంభంలోనే ఫ్యూచర్స్‌కు రంగం సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment