సియోల్: బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీ లావాదేవీలను నిర్వహించరాదని దక్షణి కొరియా బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు బిట్‌కాయిన్‌ను కొనడం, కలిగిఉండటం, వాటిని సెక్యూరిటీగా పెట్టుకోవడం నిషేధించినట్టు దక్షిణ కొరియా స్పష్టం చేసింది. క్రిప్టో కరెన్సీ స్పెక్యులేషన్స్‌తో బిట్‌కాయిన్ బుడగ ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో దాదాపు 20 శాతం లావాదేవీలు దక్షిణ కొరియాలోనే చోటుచేసుకుంటుండటం గమనార్హం.
దక్షిణ కొరియాలో దాదాపు పది లక్షల మంది చిన్న ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్స్ కలిగిఉన్నారు. వర్చువల్ కరెన్సీకి అతిపెద్ద మార్కెట్ అమెరికా కన్నా 20శాతం అధికంగా కొరియాలో బిట్‌కాయిన్ ధర పలుకుతుండటం విశేషం. ఈ ఏడాది అంతర్జాతీయ బిట్‌కాయిన్ ధరలు జనవరిలో వేయి డాలర్లుగా ఉంటే ఈ వారం 17,000 డాలర్లకు చేరుకున్నాయి.
చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్చ్సేంజ్‌లో తొలిసారిగా లిస్ట్ అయిన తర్వాత బిట్‌కాయిన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు వచ్చేవారం చికాగో మర్కెంటైల్ ఎక్ఛ్సేంజ్‌లోనూ బిట్‌కాయిన్ లిస్ట్ అవనుంది.
Comments
Please login to add a commentAdd a comment