సాక్షి, అమరావతి: ‘సేవా మిత్ర’ టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌ను ఒక్కసారి మొబైల్ ఫోన్ లేదా డెస్క్‌టాప్‌పై డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని సాఫ్ట్‌వేర్ నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న మరుక్షణం నుంచి ఫోన్ కంట్రోల్ యాప్ అభివృద్ధి చేసిన ఐటి గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్ ఎక్కడ ఉందన్న విషయంతో పాటు ఫోన్‌లో మాట్లాడిన మాటలను రికార్డు చేస్తారు. చివరకు ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంకు ఖాతాల వివరాలను అన్నీ వారు యధేచ్ఛగా చూడటమే కాకుండా, అవసరమైతే మీకు తెలియకుండానే వారు డిలీట్ చేస్తారు. ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి, ఎస్‌డీ కార్డులో ఉన్న డేటాను వినియోగించి యజమానుల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చని నిపుణులతో పాటు పోలీసులుకూడా హెచ్చరిస్తున్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!)
సేవామిత్ర యాప్ తీసుకునే అనుమతులు, వాటి పర్యవసానాలు..
- అప్రాక్సిమేట్, ప్రిసైజ్ లోకేషన్: ఈ అనుమతి ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే లోకేషన్ సర్వీస్ ఆన్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది.
- ఫోన్ కాల్స్: ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్ ఫోన్ నంబర్‌తో పాటు డివైస్ ఐడీని తెలుసుకోచ్చు.
- స్టోరేజ్ సిస్టమ్: యూఎస్‌బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్ వచ్చి చేరిపోవచ్చు.
- మైక్రోఫోన్: మైక్రోఫోన్ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది.
- ఆడియో సెట్టింగ్స్: స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ మారిపోతుంటాయి. కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment