TDP Seva Mitra App
-
డేటా దొంగలకు ఢిల్లీ లింక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు దీర్ఘకాలిక పన్నాగాన్ని పక్కాగా అమలు చేసినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని అంత పక్కాగా తస్కరించగలిగారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2015 నుంచే పన్నాగం... 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం టీడీపీ గుప్పిట్లోకి వచ్చేలా 2015లోనే చంద్రబాబు పథక రచన చేశారు. ముందస్తు వ్యూహంతోనే ఆధార్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వ ఈ–గవర్నెన్స్, ఐటీ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఇలా జోడు పదవుల్లో ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. టీడీపీ కార్యాలయానికి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. దాన్ని రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ద్వారా టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరవేసింది. సాధికారిక సర్వేలో సేకరించిన సమాచారాన్ని మించి ప్రజల వ్యక్తిగత వివరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహం రచించింది. తెలంగాణ ప్రజల సమాచారం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్న విధంగానే ఢిల్లీలోని ఆధార్ అథారిటీ నుంచి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం లభించినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీకి చేరవేశారు. పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా మొత్తం వ్యక్తిగత సమాచారం అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి చేరిపోయింది. సైబర్ నేరాలకు ఊతం తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు చేరడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో శాస్త్రవేత్తలు, రక్షణ పరిశోధనా సంస్థలు, త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది వివరాలు కూడా ఉండటంతో ఈ వ్యవహారం అత్యంత సున్నితంగా మారింది. ఇది సైబర్ నేరాలకు ఊతమివ్వడంతోపాటు దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శత్రు దేశాలకు ఈ సమాచారం చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి లోకేష్‌తో అశోక్ (ఫైల్) ఇంటి దొంగల హస్తం! ప్రజల వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కడం అంటే పార్లమెంటులో చేసిన ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆధార్ సమాచారం బయటకు పొక్కడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అథారిటీ రంగంలోకి దిగి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అథారిటీ డేటా చోరీపై ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం.. డేటా చోరీపై తెలంగాణా పోలీసుల దర్యాప్తుతోపాటు ఆధార్ అథారిటీ అంతర్గత విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆధార్ అథారిటీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. డేటా తస్కరించిన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఈఏఎస్ శర్మ,, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరడం వెనుక ఆధార్ అథారిటీ పెద్దల పాత్ర కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఆధార్ అథారిటీ అధికారుల పాత్ర లేకుండా కీలక సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి చేరడం అసంభవమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఓ లేఖ రాశారు. ఆధార్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను గతంలోనే కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ నియామకాన్ని పునఃసమీక్షించకపోవడాన్ని తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్స్‌తోపాటు ఆధార్ అథారిటీ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన రాజకీయ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్ అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సర్వర్లు భద్రం: యూఐడీఏఐ తమ సర్వర్లు పూర్తి భద్రంగానే ఉన్నాయని ఆధార్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ బుధవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ (సీఐడీఆర్), ఇతర సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చౌర్యానికి గురి కాలేదని అందులో పేర్కొంది. ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు టీడీపీ సర్కార్ షెల్టర్ డేటా చోరీ కేసులో టీడీపీ సేవామిత్ర యాప్‌ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డేటా చోరీ కేసులో దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ డి.అశోక్ కుమార్‌తోపాటు తెరవెనుక సూత్రధారులపై తెలంగాణ సిట్ దృష్టి సారించింది. ఆధార్‌తోపాటు మరో 17 రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కొద్ది రోజుల క్రితం ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలతో అశోక్ కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్ లొంగిపోకపోవడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. అశోక్‌తోపాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏబీ పర్యవేక్షణలోనే ఆశ్రయం! మరోవైపు అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆయన్ను టీడీపీ సర్కారే కాపాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం సేవామిత్ర యాప్ కోసం తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దోషులుగా నిలబడే పరిస్థితి రావడంతో అశోక్‌ను రహస్య ప్రదేశంలో దాచినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే అశోక్‌కు ప్రభుత్వం షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వ్యక్తి మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలో తొలుత అశోక్‌ను ఉంచినట్టు ప్రచారం జరిగింది. అనంతరం విజయవాడ గొల్లపూడిలోని ఇంటెలిజెన్స్ అతిధిగృహంలో అశోక్‌ను పోలీసుల రక్షణ నడుమ కొద్ది రోజులు దాచినట్టు తెలిసింది. తరువాత ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో అశోక్‌కు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత నిఘా చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా చంద్రబాబు కోసం అశోక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షెల్టర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్‌కు ముందు రోజు సేవామిత్రతో సూచనలు డేటా స్కామ్ బయట పడిన మరుక్షణమే మూసివేసిన టీడీపీ సేవామిత్ర యాప్‌ను పోలింగ్‌కు ఒక రోజు ముందు మళ్లీ పని చేయించడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు ఓటింగ్‌పై సూచనలు ఇచ్చేందుకు సేవామిత్ర యాప్‌ను వినియోగంలోకి తెచ్చారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్ డైరెక్షన్లోనే మళ్లీ సేవామిత్ర యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలంగాణ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అశోక్‌ను ఎక్కడకు తరలించారనే అంశంపై తెలంగాణ పోలీసు ప్రత్యేక బృందాలు దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదనే చర్చ ఏపీ పోలీసు వర్గాల్లోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల డేటా సైతం చోరీ సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికలో ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఆధార్ వివరాలు కూడా ఉన్నట్లు తెలంగాణ సిట్ బృందం గుర్తించింది. దీంతో ఇన్నాళ్లూ భావించినట్లుగా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా కూడా ఉండటంతో కేసు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరస్థుల గాలింపు కోసం పలు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆధార్ వివరాలు కోరినా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అంగీకరించలేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) కూడా దాదాపుగా ఇలాంటి విజ్ఞప్తే చేసినా నిరాకరించింది. ఆధార్ సెక్షన్ 29 ప్రకారం పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అత్యంత అరుదైన కేసుల్లో సెక్షన్ 33 ప్రకారం మాత్రమే పరిమిత సమాచారం ఇస్తామని పేర్కొంది. -
డేటా ఇచ్చిందెవరు?
-
‘ఐటీ గ్రిడ్స్’కు డేటా ఇచ్చిందెవరు?
సాక్షి, హైదరాబాద్: ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వద్ద భద్రంగా ఉం డాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది. ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం ఉండొ చ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. తొలుత వేటు పడేది అధికారులపైనే.. ఈ కేసులో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40కిపైగా హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం జరిగిందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవ్వడంతో సిట్ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్‌లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది. -
డేటా చోరి కేసులో సంచలన నిజాలు
-
ఇది దేశ భద్రతకే సవాల్
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్పడిన డేటా స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్ చోరీ నిజమేనంటూ ఆధార్ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ టి.భవానీ ప్రసాద్ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్ జిల్లాలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 278/ 2019లో సెక్షన్ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు. 18 రకాల వ్యక్తిగత సమాచారం చోరీ ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్ డేటా బేస్‌కు లింక్ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌నకు లింక్ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆధార్ డేటాను నిందితుడు అక్రమంగా అమెజాన్‌లో స్టోర్ చేశాడని, ఈ సున్నితమైన డేటా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ముప్పని పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆధార్ అథారిటీ డీడీ భవానీప్రసాద్ పేర్కొన్న భాగం ఫిర్యాదుదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డితో పాటు ముద్దనలాలిగారి జయరామిరెడ్డి, అక్కల మద్దిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్ వెంకటప్రతాప్లను నమూనాలుగా తీసుకుని డేటా స్కామ్ తీగ లాగారు. దీంతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ గుట్టురట్టు అయ్యింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. వాటిలో ఆధార్ (యూఐడీ) నంబర్‌తోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్(ఈఐడీ) నంబర్, కలర్ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్ నంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేరాఫ్ పేరు, పుట్టిన రోజు, గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడీ, పిన్‌కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం.. ఆధార్ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) భవానీ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. ‘యూనిక్ ఐడీ(ఆధార్) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం లింక్ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్‌తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్‌కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్‌పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ప్రధాన నిందితుడికి ప్రభుత్వ పెద్దల షెల్టర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినదంతా తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్ మేరకు ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ(సీఐడీఆర్), రాష్ట్రానికి చెందిన స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వంటి వాటి వద్ద భద్రంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతుల్లోకి వెళ్లడం తీవ్ర నేరం. సీఐడీఆర్, ఎస్ఆర్డీహెచ్లకు చెందిన ప్రతినిధులు విధుల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు చెందిన సమాచారాన్ని బయటకు లీక్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆధార్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 సెక్షన్ 28(5) ప్రకారం నేరం. ప్రభుత్వ పథకాలు, సర్వేల కోసం కాంట్రాక్టులో భాగంగా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 29(3) ప్రకారం నేరం. ఇతర ప్రయోజనాల కోసం, సర్వేలు, ఫలితాలు, ఓటర్ల జాబితాలో తొలగింపులు వంటి తదితర అక్రమాలకు ప్రజల వ్యక్తిగత డేటాను మళ్లించడం సెక్షన్ 38(జి) ప్రకారం నేరం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దాన్ని తమ అవసరానికి అనుగుణంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు చేయడం, విలువైన డేటాకు భంగం కలిగించి వేరే ప్రయోజనాలకు వాడుకోవడం సెక్షన్ 38(హెచ్) ప్రకారం నేరం. ఇందుకు సెక్షన్ 40 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది లక్షలు జరిమానా ఉంటుంది. ఆధార్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు దాన్ని ఇంటర్నెట్లో వాడుకోవడం, ఇతర వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ డేటాను ట్రాన్స్‌మీట్ చేయడం, రహస్యంగా దాచడం తీవ్రమైన నేరం. ప్రభుత్వ పెద్దల దన్నుతో డేటా స్కామ్‌కు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆ డేటాను అమెజాన్ (అమెరికా) వెబ్ సర్వీసులోని క్లౌడ్ సర్వర్‌లో పెట్టడం తీవ్ర నేరం. సెక్షన్ 44 ప్రకారం దీనిని దేశం బయట జరిగే నేరం (అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తున్నారు. ఈ డేటా మన శత్రుదేశమైన పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చిక్కినా, ఆంతర్జాతీయ నేరస్తులకు చిక్కినా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సాధికార (పల్స్) సర్వే పేరుతో సేకరించిన సున్నితమైన సమాచారంతో అనుసంధానమై ఉండటం ఐటీ యాక్ట్ – 2008 సెక్షన్ 72(ఎ), సెక్షన్ 65, సెక్షన్ 66(బి) కింద పూర్తిగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం. ఆధార్ డీడీ రిపోర్టుకు కారణం ఇదే.. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డేటా స్కామ్‌కు పాల్పడుతున్న వైనంపై ఈ ఏడాది మార్చి 2న ఫిర్యాదు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర మార్చి 15న కేంద్రం పరిధిలోని ఆధార్ అథారిటీ (యూఐడీఏఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) టీవీ భవానీ ప్రసాద్ ఈ నెల 12న మాదాపూర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. -
20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట..
సాక్షి, అమరావతి : చోరీ అయిన ప్రభుత్వ డేటా ఇప్పుడు రాష్ట్రంలోని లబ్దిదారులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రభుత్వం వద్ద మాత్రమే గోప్యంగా ఉండాల్సిన సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారం ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల వద్దకు చేరింది. దీంతో వారు తమ ప్రాంతంలో లబ్ధిదారులను కలిసి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికలయ్యేవరకూ చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయడానికి.. పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులతో పాటు ‘పసుపు–కుంకుమ’ ఇచ్చినందున గ్రామాలు, పట్టణ వార్డుల వారీగా డ్వాక్రా మహిళలు లబ్దిదారులతో గ్రూపులుగా ఏర్పడాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల అధికార పార్టీ నేతల నుంచి ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఏడాది క్రితం రియల్ టైం గవర్నెనెన్స్ సిస్టం (ఆర్టీజీఎస్) శాఖలో సాధికార మిత్రల వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలతో ఓ మొబైల్ యాప్ తయారైంది. ఇప్పుడా యాప్‌లోని సమాచారం మొత్తం టీడీపీ బూత్ కార్యకర్తల సేవామిత్ర యాప్ డేటాను పోలి ఉంది. ఇప్పుడీ డేటా మొత్తం టీడీపీ అభ్యర్థుల చేతికి చేరడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట.. మార్చి 20 నుంచి గ్రామాల వారీగా తాము చెప్పినప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి గ్రూపులు సిద్ధంగా ఉండాలని జిల్లాల్లో టీడీపీ నేతలు హుకుం జారీచేసి వెళ్తున్నారని పలుచోట్ల లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛనుదారులు, డ్వాక్రా మహిళలను ఈ ప్రచారంలో భాగస్వామ్యం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ సిబ్బంది సైతం అధికార పార్టీ నేతలతో కలిసి లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్నతాధికారులు అయితే తమ విభాగాల్లో మండల స్థాయిలో పనిచేసే వారిని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ మౌఖికంగా ఆదేశాలు జారీచేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. వణికిపోతున్న లబ్ధిదారులు ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వస్తున్న ఒత్తిళ్లతో పింఛనుదారులు, డ్వాక్రా మహిళలు వణికిపోతున్నారు. ‘నిరుపేదలం.. మాకెందుకు ఈ రాజకీయాలన్నా అధికార పార్టీ నేతలు ఒప్పుకోవడంలేదు.. సెర్ప్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నా’రని వారంటున్నారు. ‘రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్లు మంజూరు అవ్వబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తోంది. మాకెందుకయ్యా ఈ రాజకీయాలు అన్నా వదలడం లేదయ్యా’ అంటూ శ్రీకాకుళం జిల్లాలో ఒక పింఛనుదారుడు వాపోయాడు. ‘ప్రచారం చేయకపోతే పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు, భయం వేస్తోంది’ అని అతను కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ప్రచారం చేయకపోతే పింఛను ఇప్పుడే తీసేస్తారని భయంగా ఉందంటూ కృష్ణాజిల్లాలో ఒక లబ్దిదారుడు వాపోయాడు. (చదవండి: సైబర్ నేరగాళ్లకు ‘డేటా’..!) -
జాతకాలు తవ్వుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పీడ్ పెంచింది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో మార్చి 2, 9 తేదీల్లో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లను సోమవారం పరిశీలించింది. కంప్యూటర్లలో ఏముందన్న విషయాన్ని రాబట్టే పనిని సైబర్ నిపుణులకు అప్పగించారు. ప్రస్తుతం వారు అందులో ఉన్న, డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అశోక్ అరెస్టుకు వ్యూహం ఎలా? టీడీపీ సేవామిత్ర యాప్ సాయంతో 3.60 కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ అరెస్టు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సిట్ సోమవారం చర్చించింది. ఈ విషయంపై సిట్ బాస్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర తన బృంద సభ్యులతో సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం అశోక్ ఏపీలో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో తలెత్తే పరిణామాలపై పోలీసులు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వం కూడా రెండు వేర్వేరు సిట్ బృందాలను వేసిన నేపథ్యంలో అశోక్ ఏపీ సిట్ పోలీసుల ముందు ప్రత్యక్షమవుతాడా? అన్న విషయం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అశోక్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. గత అరు నెలల్లో అశోక్ ఎవరెవరితో మాట్లాడారు? అందులో ఉన్న ప్రముఖులు ఎవరు? ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ప్రాథమిక విచారణకు వెళ్లిన రోజు అశోక్ ఏపీలోని పలువురు ప్రముఖులకు పెద్ద మనుషులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో కొత్త ఉత్సాహం తనను అన్యాయంగా డేటా చౌర్యం కేసులో ఇరికించారంటూ తెలంగాణ హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. తెలంగాణ పోలీసులకు సమాధానం చెప్పాలని స్పష్టం చేసిన నేపథ్యంలో సిట్ బృందానికి కొత్త ఉత్సాహం వచ్చింది. అశోక్ తరఫున వాదించేందుకు దేశంలో పేరుమోసిన లాయర్లు రావడం, ఏపీ ప్రభుత్వం అతన్ని వెనకేసుకురావడం, త్వరలోనే బయటికి వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ సీఎం ప్రకటించడంతో అసలు అశోక్ చిరునామా దొరుకుతుందా? అనే సందిగ్ధంలో పడిన పోలీసులు కోర్టు ఆదేశాలతో మరింత వేగంగా పనిచేయనున్నారు. అతని కదలికలపై ఇప్పటికే సమాచారం ఉన్నప్పటికీ తెలంగాణ సిట్ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అతన్ని చట్టపరంగానే కోర్టు ముందు నిలబెట్టాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో అశోక్ ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తాడనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
‘చోరీ డేటా’ అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘సేవామిత్ర’యాప్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూసిన డేటా స్కాం మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ యాప్, దాన్ని తయారు చేసిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూనే తిరుగుతోంది. ఈ యాప్ తయారీలో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరపు అశోక్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అందులో ప్రధానమైంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం. తాము చేస్తున్న భారీ స్కాం భవిష్యత్తులో వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లభించకుండా ఉండేందుకే అశోక్ ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించి ఉపయోగించే పరిజ్ఞానమే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ విధానం. వాట్సాప్ ద్వారా ఓ కాంటాక్ట్‌కు తొలిసారి ఎవరైనా సందేశం పంపినప్పుడు ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’అంటూ ప్రత్యేక సూచన వస్తుంది. అంటే ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్‌కు వెళ్లే వరకు అది ఎన్‌క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్ చేస్తే అది ఎన్‌క్రిప్ట్ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. ఉదాహరణకు ‘టీడీపీ’అనే పదాన్ని ‘ఎండీ5 ఆన్లైన్’అనే ఎన్‌క్రిప్టర్ వెబ్సైట్లో టైప్ చేస్తే (5ec7c4ede4cb6 c64289a5ed105285945) అనే ‘కీ’గా మారిపోయింది. దీంతో ఇది ఎన్‌క్రిప్ట్ అయినట్లు లెక్క. ఈ సందేశం రీసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్లోకి వచ్చిన తర్వాత డిక్రిప్షన్ ప్రక్రియ పూర్తై మళ్లీ ‘టీడీపీ’అనే పదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల డేటాను దుర్వినియోగం చేయడానికి ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇదే విధానాన్నే వినియోగించింది. ట్యాబ్‌లలో వాడిన సాఫ్ట్వేర్ అదే... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సేవామిత్ర సర్వేయర్లకు ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా జారీ చేసిన ట్యాబ్స్‌ను ఆ సంస్థకు సంబంధించిన సర్వర్‌తో అనుసంధానించారు. ఈ ట్యాబ్స్‌లో ఉండే ‘సేవామిత్ర’యాప్‌లో ఎన్‌క్రిప్షన్‌తోపాటు డిక్రిప్షన్ సాఫ్ట్వేర్ సైతం అంతర్భాగంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్ నుంచి ట్యాబ్ వరకు డేటా మార్పిడి మొత్తం ఎన్క్రిప్షన్ విధానంలోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న డేటాను డిక్రిప్షన్లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ‘కీ’లలోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ ‘కీ’తో కూడిన ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని సర్వర్ నుంచి తీసినా సాధారణ పదాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఈ డేటాను ప్రైవేట్ ‘కీ’తో ఎన్‌క్రిప్ట్ చేసింది. దీంతో ఎవరైనా సర్వర్‌ను స్వాధీనం చేసుకున్నా... అమెజాన్ వంటి సంస్థల నుంచి డేటా పొందినా డిక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్’డేటాను రాసే ‘అల్గోరిథమ్’ను బట్టి మారిపోతుంది. ఓ సంస్థ రూపొందించిన ‘అల్గోరిథమ్’మరొకరి దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలదు. తమ వ్యవహారం గుట్టురట్టైనా ఆధారాలు చిక్కకూడదనే ఐటీ గ్రిడ్స్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండేలా చేస్తే భవిష్యత్తులో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలు ఐటీ గ్రిడ్స్‌తోపాటు అమెజాన్ నుంచి సమాచారం తీసుకున్నా అది ఆధారంగా పనికి రాకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రూపంలో ఉన్న డేటాతో కేవలం ‘కీ’తెలుసుకోవడం తప్ప అందులోని పదాలను గుర్తించలేదు. డేటాకు సంబంధించిన ప్రైవేట్ ‘కీ’అందుబాటులో ఉంటే తప్ప ఆ ‘కీ’లను పదాలుగా మార్చి అందులోని అంశాలను తెలుసుకోలేరు. ఈ విషయం గుర్తించిన తెలంగాణ సిట్ అధికారులు... సైబర్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ప్రాథమికంగా డేటా మొత్తం క్రోడీకరిస్తే ఆపై డిక్రిప్ట్ చేయవచ్చని యోచిస్తున్నారు. -
‘సేవామిత్ర’ తో ఓట్లు తొలగించారు
సాక్షి, న్యూఢిల్లీ : తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ నేతలు ప్లాన్ ప్రకారం రెండేళ్ల నుంచి తొలగిస్తున్నారని వైఎఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సేవామిత్ర యాప్ ద్వారా బూత్‌ల వారిగా ఓట్లను తొలగించారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకంగా సేవామిత్ర యాప్‌కు ప్రభుత్వ సమాచారాన్ని ఇచ్చి నాలుగేళ్లలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారని చెప్పారు. ఫారం 7 పై టీడీపీ ఇష్టారీతిగా మాట్లాడుతుందని మండిపడ్డారు. డబుల్ ఓట్లపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బాధ్యత కలిగినవారెవరైనా డూప్లికేట్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చెయ్యొచ్చునన్నారు. డూప్టికేట్ ఓట్లు కావాలని టీడీపీ ఎందుకు కోరుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు విచ్చల విడిగా జీవోలు జారీ చేశారని ఆరోపించారు. రహస్యం పేరుతో జీవోల సమాచారాన్ని దాచిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక పద్దతిలో ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. -
పార్టీ కోసం ప్రభుత్వ సేవ
రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు. ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు. సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో ఉన్న సమాచారమంతా పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారమేనని ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారందరి సమాచారంతో పాటు ప్రభుత్వ సమాచారం, పౌరుల వ్యక్తిగత డేటాతో ఒక మొబైల్ యాప్‌ను ప్రైవేట్ సంస్థలతో తయారుచేయించి, ఆ తర్వాత దానిని తెలుగుదేశం పార్టీ సేవా మిత్రల ట్యాబ్‌లకు మళ్లించారని స్పష్టమైంది. ఇప్పుడు ఈ యాప్ గుట్టురట్టు చేసే ఓ వీడియో ఒకటి ‘సాక్షి’కి చిక్కింది. ప్రభుత్వం తయారుచేయించిన ఈ యాప్‌లో ఉన్న వివరాలు, సేవామిత్ర యాప్‌లో ఉన్న వివరాలు ఒక్కటేనన్నట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ యాప్‌లో వ్యక్తుల వారీగా కేటాయించిన కోడ్ నెంబర్లు, సేవామిత్రల్లో పేర్కొన్న వ్యక్తుల కోడ్ నెంబర్లు ఒకే రీతిన ఉన్నాయి. అయితే, ప్రభుత్వం తయారుచేసిన యాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైం గవర్ననెన్స్ (ఆర్టీజీఎస్) శాఖలో రూపొందించిన విషయాన్ని ఆ విభాగాధిపతిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు స్వయంగా వెల్లడించారు. ‘మీ భూమి’ వెబ్లాండ్లో ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న రైతుల భూముల వివరాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను కూడా పొందుపరిచేలా ఓ మొబైల్ యాప్‌ను తయారుచేయమని చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని ఆయన అందులో బయటపెట్టేశారు. రైతుల భూముల వివరాలతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కూడిన యాప్‌పై అవగాహన కలిగించేందుకు 2018 జూన్ 21న జరిగిన ప్రభుత్వ సమావేశంలో అహ్మద్ బాబు ఆ యాప్ గురించి సీఎంతో పాటు ఐఏఎస్ ఉన్నతాధికారులకు వివరిస్తున్న వీడియో ‘సాక్షి’కి దొరికింది. అందులో యాప్‌కు సంబంధించిన అంశాలపై అహ్మద్ బాబు ఏం చెప్పారంటే.. – రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు. – ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు. – కుటుంబ సభ్యుల వారీగా ఒకొక్కరూ ఏఏ పథకాల ద్వారా లబ్ధిపొందారన్న వివరాలున్నాయి. – యాప్ తయారీకి ఆర్టీజీసీ ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు నెంబరు కేటాయించింది. ఆ నెంబరు క్లిక్ చేయగానే ఆ వ్యక్తి ఫొటో, ఆధార్, పేరు, అతని ఫోన్ నెంబరు, అతని ఆదాయం సహా అన్ని వివరాలు యాప్ ఉన్న మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. – వ్యవసాయ భూముల వివరాలు, ఉపాధి హామీ పథకంలో ఎవరెన్ని రోజులు పనిచేశారు.. ఇళ్లు మంజూరైన వారి వివరాలు.. చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులు.. రేషన్ సరుకులు తీసుకుంటున్న వారు, పసుపు–కుంకుమ కింద డబ్బులు పొందిన డ్వాక్రా మహిళల వివరాలు ఆ యాప్‌లో పొందుపరిచారు. – ప్రభుత్వం ఏర్పాటుచేసిన 1100 నెంబరుకు ఎవరైనా ఫోన్‌చేస్తే.. వారి వివరాలు అప్పటికప్పుడు యాప్‌కు చేరేలా అనుసంధానం చేశారు. ఇలా 2018 జూన్ నాటికి 61 లక్షల మంది వివరాలు యాప్‌కు అనుసంధానం చేసినట్టు అహ్మద్ బాబు ఆ వీడియోలో వివరించారు. – ఆ యాప్ ద్వారా ఎక్కడ నుంచైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు. – ఈ యాప్‌లో నమోదు చేసే ప్రతి అంశం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరుతుంది. సాధికార మిత్రల కోసమంటూ టీడీపీ కార్యకర్తల ట్యాబ్‌లోకి.. వాస్తవానికి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం 2018 జూన్‌లో 4.80లక్షల డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి, వారికి సాధికార మిత్రలుగా నామకరణం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని మొత్తం 1.40కోట్ల కుటుంబాలకు వివరించేందుకు ఒక్కో సాధికార మిత్రకు 35 కుటుంబాలను కేటాయించారు. ఈ యాప్‌తో సాధికార మిత్రలను ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగించుకుంటే, 4.80 లక్షల మందిలో ఎవరో ఒకరి ద్వారా విషయం బయటకు పొక్కుతుందని సర్కారు పెద్దలు అనుమానించి ఆ తర్వాత ప్లాన్ మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వారికి స్మార్ట్ ఫోన్ల కొనుగోలూ ఖర్చుతో కూడుకున్నదని భావించింది. దీంతో ఈ యాప్‌ను పూర్తిగా టీడీపీ బూత్ కమిటీ నేతల ట్యాబ్‌లకు మళ్లించారని అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, ఈ యాప్‌ను మొదట సాధికార మిత్రల కోసమని ప్రభుత్వం తయారుచేయించినట్లు అహ్మద్ బాబు సైతం ఆ వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఆర్టీజీఎస్ తయారుచేసిన యాప్‌లో లబ్ధిదారులకు ఇచ్చిన కోడ్ నెంబర్లు, టీడీపీ సేవా మిత్రలో ఉన్న కోడ్ నెంబర్లు ఒకే తీరులో ఉండడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేస్తోంది. -
ఇది బాహుబలిని మించిన కుట్ర..
సాక్షి, అమరావతి: తాము రాష్ట్ర ప్రజల డేటా దొంగిలించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం భారీ కుట్రని, భారతదేశ చరిత్రలో ఇలాంటి కుట్ర ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఒక పథకం ప్రకారం విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకుట్ర రచించారని..ఇది బాహుబలిని మించిన కుట్రని చెప్పారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన డేటా చోరీ అంశంపై మాట్లాడారు. ఈ ఫిర్యాదు కుట్రను తాను ప్రజల ముందు పెడుతున్నానని, మోడీ, అమిత్‌షా, కేసీఆర్, జగన్ బరితెగించి ఈ కుట్ర చేశారని విమర్శించారు. గత నెల 19 తేదీన విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారని దాని ప్రకారం తెలంగాణ పోలీసులు చట్ట విరుద్ధంగా 23వ తేదీన ఐటి గ్రిడ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీపై దాడి చేశారని చెప్పారు. టీడీపీ సేవా మిత్ర యాప్ సమాచారం, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం అంతా చోరీ చేశారని ఆరోపించారు. దాడులు చేసిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో డేటా దొంగతనం వార్త ప్రచురితమైందని తెలిపారు. ఈ ఫిర్యాదు తాను చేసినట్లు విజయసాయిరెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఎవరి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్‌పై దాడి చేశారు?!.. తెలంగాణ వేసిన సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర 23వ తేదీన ఐటీ గ్రిడ్‌పై దాడి నిజమేనని ఒప్పుకున్నాడని చంద్రబాబు చెప్పారు. కాగా, విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని చెబుతూ...ఆ ఫిర్యాదు కాపీని విడుదల చేసిన ఆయన.. ఎవరి ఫిర్యాదుతో ఫిబ్రవరి 22న ఐటీ గ్రిడ్‌పై దాడి చేశారని ప్రశ్నించడంతో మీడియాతో సహా అక్కడున్న టీడీపీ నేతలు సైతం అవాక్కయ్యారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులోనే కుట్రకు స్కెచ్ ఉందని, అందులో కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రచించారని..వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసీకి అందించారని తెలిపారు. ఫిర్యాదులో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా రాశారని అన్నారు. సోదాల్లో ఐటీ గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి, ఎవరెవరిని ఎలా విచారించాలి, ఎఫ్ఐఆర్ ఎలా రిజిష్టర్ చేయాలి, డేటా ఎలా సీజ్ చేయాలి, ఉద్యోగుల సెల్ ఫోన్లు ఎలా లాక్కోవాలి, వారిని ఎలా వేధించాలి, ఎలా బెదిరించాలి, సేవా మిత్ర యాప్‌ను ఎలా నిర్వీర్యం చేయాలి, సేవామిత్ర కీలక కార్యకర్తలను ఎలా గుర్తించాలి, కోర్టు ద్వారా సీబీఐ విచారణ ఎలా కోరాలి, జాతీయ మీడియాకు ఇవన్నీ ఎలా తెలపాలనే అన్ని విషయాలను పేర్కొన్నారని ఆరోపించారు. ఇదే ఫిర్యాదును ఈసీకి మార్చి ఎనిమిదో తేదీన బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి చేశారని, దీనిప్రకారం తెలంగాణ పోలీసులు పనిచేశారన్నారు. రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు వస్తాడు.. ఐటీ గ్రిడ్ సంస్థ తమ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అని, అందులో పనిచేసే వారిని హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి బయటకు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. కాగా, దాకవరపు అశోక్ ఎక్కడున్నాడనే మీడియా ప్రశ్నకు రెండు, మూడురోజుల్లో బయటకు వస్తాడని చెప్పారు. దీంతో తామే అశోక్‌ను దాచామనే విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పడంతో.. అక్కడున్న టీడీపీ నేతలు ఇబ్బందిగా కనిపించారు. ఈ కేసుకు సహకరించిన తెలంగాణ పోలీసులను తాము వదలబోమని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల ఆధార్ కార్డును పార్టీ యాప్‌కు లింక్ చేశారనే ఆరోపణపై మాట్లాడుతూ ఆధార్ ఎక్కడ లీకైందని దబాయించి.. ఆధార్ నంబర్ ఇస్తే తీసుకోవచ్చని అయినా ఆధార్ డేటా తీసుకుని కార్యకర్తలు ఏంచేస్తారని, వారికి కావల్సింది ఓటరు జాబితా అని చెప్పారు. బ్లూఫ్రాగ్ సంస్థ చాలా సంవత్సరాలుగా తమకు సేవలందిస్తోందని తెలిపారు. ఫార్మ్–7 దాఖలు చేయడం పెద్ద నేరమని, తన ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ వేల కోట్లను ఏపీకి పంపిస్తున్నాడని, ఇప్పటికే వెయ్యి కోట్లు జగన్‌కు ఇచ్చాడని, అవి అభ్యర్థులకు చేరిపోయాయని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా హైదరాబాద్ నుంచి రాకుండా కేసీఆర్‌తో కలిసి కుట్రలు చేస్తున్నాడన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ తయారు చేస్తున్నారని, వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదని కేసీఆర్ అని చంద్రబాబు విమర్శించారు. -
అశోక్ కదలికలపై నిఘా..
-
సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!
సాక్షి, గోకవరం, (జగ్గంపేట): రాష్ట్ర ప్రభుత్వమే ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని, 1100 కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి సమస్య చెప్పిన ప్రతి ఒక్కరి డేటా సంగ్రహించి సేవామిత్రకు ఇచ్చారని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరానికి చెందిన నేషనల్, ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎం.శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరిస్తే 72 గంటల్లో దీనిని నిరూపిస్తానని శుక్రవారం జగ్గంపేటలో ఆయన ‘సాక్షి’కి చెప్పారు. తమ ఇండస్ట్రీకి చెందిన ఒక సమస్యపై తాను 1100కు ఫోన్‌చేస్తే ఆధార్ నంబర్ అడిగారని.. నంబర్ చెప్పిన వెంటనే ఆధార్‌లో ఉన్న చిరునామా వారు చెప్పి, ప్రస్తుతం ఉన్న అడ్రస్‌లు అడిగి తెలుసుకున్నారని, అప్పుడే తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ విధంగా 1100కు ఫోన్ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును వారు గుర్తించి డేటాను సేవామిత్రకు అప్పగించారన్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగినట్లు భావిస్తున్నానన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ద్వారా ఇది జరిగిందని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. సేవామిత్రకు డేటా వెళ్లిందన్న విషయాన్ని రుజువు చెయ్యొచ్చని, ఈ విధంగా చాలా ఓట్లు తీసేశారని నిరూపించవచ్చన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు బయటపెడతానని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడైన ఓ వ్యక్తి సవాల్ విసరడంతో తాను ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేశానని శ్రీధర్ చెప్పారు. ఇవి చదవండి : అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్! టీడీపీ వైపు లాగండి.. లేకుంటే ఓట్లు ఎత్తేయండి! -
స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?
సాక్షి, అమరావతి/కావలి : ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంలో కీలక నిందితుడు దాకవరం అశోక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎవరు? ఎవరికి బినామీ? ఎవరు కాపాడుతున్నారు? అనే అనుమానాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్‌తో తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్‌గా వార్తల్లోకి ఎక్కిన అశోక్.. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖా మంత్రి లోకేశ్ ఆశీస్సులే కారణమని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!) అశోక్ అనతికాలంలోనే రూ.65 కోట్ల విలువైన ఐటీ గ్రిడ్స్ సంస్థకు అధిపతి ఎలా కాగలిగాడు? దాదాపు 40 ఎకరాలను ఎలా కొనగలిగాడు? తూర్పుగోగులపల్లిలో 100 సీజేఎఫ్ఎస్ రొయ్యల గుంటల సాగు ఎలా చేస్తున్నాడు?.. హైదరాబాద్‌లోని మాదాపూర్ సెంటర్లో సామాన్య వ్యక్తిగా.. సాదాసీదా బైక్‌పై తిరిగిన అతను ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన కూర్చునే స్థాయికి ఎదిగేలా చేసిందెవరు? ..ఇలా అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు, నెల్లూరు జిల్లా కావలిలో మొదలైన అతని ప్రస్థానం అమరావతి వరకు సాగిన క్రమం ఇదిగో ఇలా ఉంది.. కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామానికి చెందిన అశోక్ తండ్రి బుజ్జయ్య చిన్నపాటి ఉప్పు రైతు. కుటుంబ పోషణ, ఉప్పు సాగుతో అప్పులపాలైన బుజ్జయ్య వాటిని తీర్చలేక చేతులెత్తేసాడు. ఆ తర్వాత ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ తరఫున బుజ్జయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయితే, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అశోక్.. టీడీపీ నేతలు బీదా బ్రదర్స్‌కు దగ్గరయ్యాడు. మాజీ ఎమ్మెల్యే, అమరావతి రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రలతో సన్నిహిత సంబంధాలు పెరగడంతో అశోక్ తండ్రి బుజ్జయ్యను టీడీపీలోకి తీసుకొచ్చాడు. అలా టీడీపీతో వారి బంధం మొదలైంది. (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!) లోకేశ్‌కు బినామీగా ఇలా.. రాజకీయ నాయకుల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని సర్వేలు, సమీకరణాలు అంటూ అశోక్ పదేళ్ల క్రితమే డబ్బు సంపాదనే మార్గంగా రంగంలోకి దిగాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పార్టీ అనలిస్ట్ డాట్ కామ్‌ను స్థాపించాడు. అప్పట్లో ఇక్కడకు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, విద్యావేత్త చుక్కా రామయ్య వంటి ప్రముఖులను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ‘పార్టీ అనలిస్ట్’ అనే వెబ్సైట్ ద్వారా ప్రజల్లో రాజకీయ పార్టీల బలాబలాలను అధ్యయనం చేస్తామని చెప్పాడు. ఆ సంస్థను ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చాడు. ఈ క్రమంలోనే లోకేశ్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. మూడేళ్ల క్రితం బీదా బ్రదర్స్ ద్వారా లోకేశ్‌తో అశోక్‌కు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో వేమూరి హరిప్రసాద్ ద్వారా లోకేశ్‌కు మరింత దగ్గరయ్యాడు. సీఎం చంద్రబాబును, ఐటీ మంత్రి లోకేశ్‌ను పలుమార్లు కలిసి ఐటీలో తన ఆలోచనా విధానాన్ని వివరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే టీడీపీ సేవామిత్ర యాప్‌కు రూపకల్పన చేశారు. సీఎం చంద్రబాబును ఒప్పించి మరీ లోకేశ్ తొలివిడతగా అప్పట్లో రూ.8 కోట్లు డబ్బులు పెట్టుబడిగా పెట్టి లోకేశ్‌కు బినామీగా అవతారం ఎత్తినట్లు ప్రచారం జరుగుతోంది. యాప్ నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఈ నేపథ్యంలో.. రాజకీయ ప్రయోజనం కోసమే అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అంతర్గత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌కు అందేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, లోకేశ్ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ రూపొందించింది. టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను కూడా తయారుచేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలుగుచూసిన డేటా స్కాంకు ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యుడని సీనియర్ ఐఏఎస్‌లు చర్చించుకుంటున్నారు. పోలీసుల వద్దే అశోక్? ఇదిలా ఉంటే.. అశోక్ ఇప్పుడు ఎక్కడున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డేటా చోరీపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో పోలీసులకు చిక్కకుండా అతను పరారయ్యాడు. అతను పట్టుబడితే మొత్తం గుట్టురట్టవుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలే పోలీసుల రక్షణ కవచంలో రాజధాని పరిసరాల్లో కాపాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలోని ఒక క్లబ్లో దాచిన అశోక్‌ను శుక్రవారం రాత్రి మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌కు తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో అశోక్ ఉన్నట్టు చెబుతున్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం సిట్ బృందం హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. తరువాత రెవెన్యూ అధికారుల సమక్షంలో కార్యాలయానికి సీల్ వేసి సీజ్ చేసింది. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా కొందరు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏపీ పోలీసులు రాకుండా... ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’ఏర్పాటు చేయగానే అందుకు పోటీగా ఏపీ సర్కారు సైతం రెండు సిట్ లను వేసిన సంగతి తెలిసిందే. పైగా ఐటీ గ్రిడ్స్‌పై దాడుల సందర్భంగా ఏపీ పోలీసులు ఈ కేసులోని ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని తమకు అప్పగించాలంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సిట్ బృందాలు హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణ పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. దీనివల్ల ఎవరైనా ఇక ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలోకి ప్రవేశించాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. అశోక్ కదలికలపై నిఘా.. ప్రజల వ్యక్తిగత వివరాల చోరీకి సంబంధించిన అంశం కావ డంతో ఈ కేసును తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. ముఖ్యంగా కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే ఓ బృందాన్ని విజయవాడకు పంపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ కదలికలపై సిట్ బృందానికి సమాచారం అందిందని తెలిసింది. తాము అశోక్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని సిట్ బృందం ధీమాగా ఉంది. ఏపీకి చెందిన ఓ మంత్రి సంరక్షణలో అశోక్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. సిట్ కార్యాలయం మార్పు.. ఐటీ గ్రిడ్స్ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం కార్యాలయాన్ని మార్చారు. తొలుత డీజీపీ కార్యాలయం నుంచే సిట్ పనిచేస్తుందని ప్రకటించారు. కానీ శనివారం నుంచి ఈ కార్యాలయం గోషామహల్లో నుంచి విధులను నిర్వహించనుంది. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లోని సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‌డబ్లూ)లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇవి చదవండి : సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..! అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్! -
అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు?
సాక్షి, హైదరాబాద్ : ఫారమ్ 7 అప్లై చేయడం నేరం కాదని ఈసీ అధికారులే చెబుతున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకింత కంగారు పడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. డేటా చోరీపై చంద్రబాబు నాయుడు ఇంతవరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదని, హడావుడిగా రెండు జీవోలు మాత్రం జారీ చేశారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఏపీ ప్రభుత్వం సేవామిత్ర యాప్, ఫారమ్ 7కు సంబంధించి రెండు సిట్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ ఓట్లు ఉన్న విషయాన్ని తమ పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లిందని పునరుద్ఘాటించారు. నకిలీ ఓట్లను తొలగించమనే ఫారమ్ 7 అప్లోడ్ చేశారు.. అందులో టీడీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు. సేవామిత్ర యాప్‌తో టీడీపీ నిండా మునిగిపోయిందని.. ఆ కేసును డైవర్ట్ చేసేందుకు ఫారమ్ 7పై 300లకు పైగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యతను కూడా టీడీపీ తీసుకుంటుందా ఏంటి అని ఎద్దేవా చేశారు. లోకేష్ ట్వీట్లు మాని బయటకు రావాలి.. సేవామిత్రలో 30 లక్షల మంది సమాచారం టీడీపీ వారిది అనుకుంటే 3 కోట్ల మంది ప్రజల సమాచారం ఎవరు ఇచ్చారని బుగ్గన ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అసలు అశోక్‌ను ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదన్న బుగ్గన... లోకేష్ ట్వీట్లు చేయడం మానేసి.. బయటికి రావాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తోందని చాటుగా 100 జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ సభ్యత్వ నమోదు వీడియోను బయటపెట్టారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. -
టీడీపీ వైపు లాగండి.. లేకుంటే ఓట్లు ఎత్తేయండి!
సాక్షి, అమరావతి: ‘మీకు ఓటర్లందరి పూర్తి సమాచారమిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రెండు కుటుంబాలను టీడీపీకి అనుకూలంగా మార్చండి. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ఇలా చేస్తే ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు మనకు అదనంగా వస్తాయి. అప్పుడు ఎన్నికల్లో మన గెలుపు ఈజీ అవుతుంది..’ అని ఐటీ మంత్రి, సీఎం తనయుడు లోకేశ్ టీడీపీ సమావేశాల్లో కార్యకర్తలకు ఉద్బోధ చేస్తూ వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ప్రజా సాధికార సర్వే డేటా మొత్తాన్ని సేవా మిత్ర యాప్‌కు అనుసంధానం చేశారు. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలోని ఐదు శాతం ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యంగా రెండేళ్లుగా టీడీపీ నాయకత్వం చాపకింద నీరులా పనిచేసింది. ఇందుకు టీడీపీ బూత్ కన్వీనర్లు, సభ్యులు, కొన్నిచోట్ల సాధికార మిత్రలను కూడా ఉపయోగించుకున్నారు. ప్రజాసాధికార సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చెందిన సమస్త సమాచారాన్ని సేకరించిన టీడీపీ ప్రభుత్వం.. ఇంతవరకు ఈ సర్వే పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. (ఓట్ల తొలగింపు కేసులు...తలలు పట్టుకుంటున్న పోలీసులు ) కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఈ సమాచారాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేసింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో పరిశీలించే పేరుతో 25 వేల మంది సాధికార మిత్రలను నియమించారు. ప్రతి సాధికార మిత్రకు 35 కుటుంబాలను కేటాయించి.. వారిని స్థానికంగా ఉన్న టీడీపీ బూత్ కన్వీనర్లు, నాయకులకు అనుసంధానం చేశారు. ఆయా కుటుంబాల సమస్త సమాచారాన్ని సేవా మిత్ర యాప్ ద్వారా వీరికి అందించారు. టార్గెట్లు ఇచ్చారు. వారి అవసరాలను ఉపయోగించుకుని ఈ కుటుంబాల్లో కనీసం రెండింటినైనా టీడీపీ వైపు ఆకర్షించే బాధ్యతను వారికి అప్పగించారు. రెండు కుటుంబాలంటే సరాసరిన పది ఓట్లుగా లెక్కించారు. ఇలా ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో ఐదు శాతం ఓట్లు, నియోజకవర్గ స్థాయిలో సుమారు పది వేల ఓట్లను ప్రభావితం చేసేలా ప్లాన్ రూపొందించారు. టీడీపీ వైపు రాకపోయినా, వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నా.. ఆయా కుటుంబాల్లోని వారందరి ఓట్లను తొలగించారు. (ఇబ్బందికర డేటాను తొలగించండి..) -
పార్టీ సేవలో ఎంపీ మురళీమోహన్ కోడలి సంస్థ
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను నిర్వహించే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీ స్కామ్‌తో ఏపీలో ఆ పార్టీకి సేవలు అందిస్తున్న పలు ఐటీ సంస్థల్లో కలవరం మొదలైంది. ఆయా సంస్థల్లో ఉన్న ఇబ్బందికర డేటాను క్లియర్ చేయాలని (తొలగించాలని) అధికార పార్టీ నేతల నుంచి నిన్న సాయంత్రం మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐటీ మంత్రి నారా లోకేశ్ అనుచరులుగా చెప్పుకొనే కొందరు రంగంలోకి దిగి తమ పార్టీకి అనుకూలంగా ఉండే ఐటీ సంస్థను అప్రమత్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. డేటా చోరీ స్కామ్‌కు సంబంధించి ఎవరైనా వచ్చి ప్రశ్నించినా వివరాలు చెప్పొద్దని, మీ కార్యాలయంలోని కంప్యూటర్స్ (సిస్టమ్స్)లో హార్డ్ డిస్క్‌లను క్లియర్ చేసి, రోజువారీ పనులు చేసుకుంటున్నట్టు కూల్‌గా ఉండాలని కీలక నేతలు దిశానిర్ధేశం చేసినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ మాదిరిగానే ఏపీలో దాదాపు 13 సంస్థలు పనిచేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శాఖలు, వాటి వివరాలు, పనితీరు, సేవలు, అబ్ధిదారుల సమాచారం.. ఇలా అనేక పేర్లతో అనేక ఐటీ సంస్థలను సర్వీసు ప్రొవైడర్లుగా ఏర్పాటు చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయాల ప్రజాధనం ఫలహారంగా పంచుతూ వచ్చింది. ప్రభుత్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ కోసం పనిచేసే ఐటీ సంస్థలకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో కొన్ని ఐటీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని సంస్థలను సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్టు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ వ్యవహారంతో తేటతెల్లమైంది. ప్రోనిక్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈపీ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొడ్ ట్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎల్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీఆర్ టెక్నాలజీస్, శ్రేయ కంప్యూటర్స్, ఇన్వెంట్జీ ఎంటర్ ప్రైజెస్ ప్రైౖవేట్ లిమిటెడ్, ప్రొస్పెక్టా టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అల్కోర్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘన జీయోమెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రభుత్వంలోని పలు శాఖలకు సేవలందిస్తున్నాయి. వాటికి ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. వాటిలో కొన్ని సంస్థలు టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌కు డేటాను అందజేసినట్టు సమాచారం. పార్టీ సేవలో ఎంపీ మురళీమోహన్ కోడలి సంస్థ టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలికి చెందిన టెలీబ్లూ ఐటీ సంస్థ ప్రభుత్వంతో పలు అంశాలపై ఒప్పందాలు చేసుకుని పార్టీకి సేవలు చేస్తోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లిలో ఉన్న ఈ కార్యాలయంలో దాదాపు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన ఆర్టీజీఎస్ నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థకు అప్పగించినట్టు తెలిసింది. ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్(మెస్సేజ్)లు పంపించి పలు అంశాలపై ప్రజలను ఆరా తీసే ఈ సంస్థ రాజకీయ కోణంలో మంత్రి లోకేశ్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోందని చెబుతున్నారు. ఇటీవల ఈ సంస్థ నుంచి ఒక ఉద్యోగి అభిప్రాయ సేకరణ పేరుతో ప్రకాశం జిల్లా పెదదోర్నాల గ్రామంలో టీడీపీ కార్యకర్తకు ఫోన్ చేసాడు. మా గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన వారికి అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇచ్చారంటూ టీడీపీ కార్యకర్త బదులిచ్చాడు. మీరు చెప్పిన సమాచారం లోకేశ్ కార్యాలయానికి చెబుతామని, వారు చర్యలు తీసుకుంటారని టెలీబ్లూ సంస్థ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. -
బాబు.. అశోక్‌ను ఎక్కడ దాచారు?
-
బాబు.. అశోక్‌ను ఎక్కడ దాచారు?
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను చంద్రబాబు నాయుడు అక్రమంగా తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాంబు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి ఆధార్ డేటా ఎలా వచ్చిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఇరు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. డేటా చోరీ కేసుపై చంద్రబాబు విచారణకు సిద్ధమని చెప్పగలరా అని సవాల్ చేశారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్‌ని ఎక్కడ దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్ విచారణకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజాధరణ లేదని తెలుసుకున్న చంద్రబాబబు.. ప్రజాస్వామ్యాన్ని దగా చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేప్పేవి నీతులు.. చేసేవన్ని దొంగపనులని ఎద్దేవా చేశారు. బీజేపీ చంకనెక్కింది.. కేసీఆర్ యాగానికి వెళ్లింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏపీ ప్రజలు కప్పం కట్టే పరిస్థితిని వైఎస్ జగన్ రానివ్వరని చెప్పారు -
సేవామిత్ర యాప్‌ను ఎందుకు క్లోజ్ చేశారు?
సాక్షి, హైదరాబాద్ : డాటా చోరీకి పాల్పడలేదని చెబుతున్న టీడీపీ.. తమ వెబ్సైట్ సేవామిత్ర యాప్‌ను ఎందుకు క్లోజ్ చేసిందో చెప్పాలని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో తాము అడిగిన ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. బుకాయింపు ధోరణిని టీడీపీ అవలంబించడం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధి బయటపడ్డ తాజా వీడియోని ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయడం లేదని నిలదీశారు. -
లోకేష్, అశోక్‌ల దోస్తానాకు సాక్ష్యమిదే..!
సాక్షి, అమరావతి: ఈ ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తిని చూశారా.. ఆయనే దాకవరం అశోక్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఈయన. ఆధార్, రాష్ట్ర ప్రభుత్వ రహస్య డేటా అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న ఈయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరంగా జరిగే అధికారిక సమీక్ష సమావేశాల్లో మంత్రి నారా లోకేష్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్యనే దర్జాగా కూర్చొని ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అయిన టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీ యజమాని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమీక్ష సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లభించడం, మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య దర్జాగా కూర్చోవడాన్ని బట్టి చూస్తే.. మంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యం ఏమిటో బోధపడుతుంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయన అండతోనే ప్రభుత్వ అధికార సమీక్ష సమావేశాల్లో అశోక్ పాల్గొంటున్నారని అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) లోకేష్ వెంటే ఉంటూ ఎప్పుడూ ఆయన అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని వారు చెబుతున్నారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రి లోకేష్ చాంబర్లోనే అశోక్ ఎప్పుడూ ఉంటారని.. మంత్రి కార్యాలయంలో ఆయనదే పూర్తి హవా అని అంటున్నారు. టీడీపీకి ఐటీ సేవలందించే అశోక్‌కు చెందిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మంత్రి లోకేష్ శాఖల ద్వారానే కోట్ల రూపాయలు చెల్లింపులు సైతం జరిగాయి. గత ఎనిమిది నెలల్లో నాలుగు విడతల్లో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.01 కోట్లు చెల్లించింది. దీన్నిబట్టి పార్టీకోసం పనిచేసేవారిని ప్రభుత్వ విధుల్లో భాగస్వాముల్ని చేయడమేగాక ప్రభుత్వం నుంచి ఐటీ కాంట్రాక్టులను సైతం కట్టబెట్టారనేది స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ తతంగంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన భారీ కుట్ర దాగి ఉందని అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇది చదవండి : టీడీపీ మైండ్‌గేమ్! -
ఇదీ జరుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ‘టీడీపీ కీ–పర్సన్’ అనే కోడ్‌తో పిలిచే వారు కీలకంగా వ్యవహరించారని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ ‘కీ’పర్సన్స్ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ యాప్ వ్యవహారంలో ఆన్లైన్లో జరిగే కీలక పరిణామాలను ఆయన మ్యాప్ రూపంలో వివరించారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) సేవామిత్ర యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ.. వివిధ మార్గాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటా సంగ్రహించింది. దీని ఆధారంగా ఇక్కడి కాల్ సెంటర్లోని వాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తారు. వారు చెప్పే అంశాలను పొందుపరుస్తూ.. ఆ వివరాలను సేవామిత్ర సైట్‌కు అప్లోడ్ చేస్తారు. ఈ డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది. దీన్ని నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి సేవామిత్ర కన్వీనర్లకు అనువుగా తయారు చేసి వారికి పంపిస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ అందులోని ఓటర్ల వివరాలను సరిచూసే ఈ బూత్ స్థాయి కన్వీనర్లు వారి ఆధార్, మొబైల్ నంబర్లు, కులం, రాజకీయ ప్రాధాన్యం వివరాలు సేకరిస్తారు. ఇలా రూపొందించిన డేటాను మళ్లీ హైదరాబాద్‌లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు పంపిస్తారు. ఈ డేటాను మరికొన్ని కోణాల్లో విశ్లేషించే ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీ వ్యతిరేక ఓటర్లు, ఆయా ప్రాంతాల్లో లేని వారిని గుర్తిస్తుంది. ఇలా సమగ్ర విశ్లేషణతో తయారు చేసిన జాబితాలను తెలుగుదేశం పార్టీ ‘కీ’పర్సన్‌కు పంపిస్తుంది. సదరు యాప్‌లో వీరికి ‘టీడీపీ కీ–పర్సన్’అనే కోడ్ వర్డ్ ఇచ్చారు. ఆ కీపర్సన్ తనకు అందిన ఫైనల్ జాబితాలోని ఓటర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదని నిర్ధారించుకుంటాడు. వారి పేరుతో తప్పుడు మార్గంలో ఫామ్–7 రూపొందించి ఓట్లు తొలగించేందుకు ఓటర్ ప్రమేయం లేకుండానే సంబంధిత అధికారికి పంపించేస్తారు. సేవామిత్ర సర్వేలో వేరే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన వారు తమకు ఓటు వేయరనే ఉద్దేశంతో తొలగించేస్తున్నారు. సర్వే సమయంలో అందుబాటులో లేని వాళ్లు.. పోలింగ్ సమయంలో వచ్చి వేరే పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో తీయించేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) -
మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!
అమెరికాలోని జార్జియాలో 2018లో గవర్నర్ ఎన్నికలు జరిగాయి. దీనికి బ్రెయిన్ కెంప్–స్టేసీ అబ్రహమ్ పోటీపడ్డారు. 2010 నుంచి కొన్నాళ్లు జార్జియా సెక్రటరీగా పని చేసిన కెంప్ ఆ ప్రాంతంలో ఉన్న 3.4 లక్షల మంది కలర్ మైనార్టీల ఓట్లు వారి ప్రమేయం లేకుండానే తీసేయించేసి లబ్ధిపొందారు. దీన్ని అక్కడి పరిభాషలో ‘రాంగ్లీపర్జ్’అని అంటారు. అప్పుడు కెంప్ వినియోగించిన విధానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీలో వాడుతోంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న కందుల రంగారెడ్డి, కందుల నాగమణి అమీర్‌పేటలో ఉంటున్నారు. చిత్తూరుకు చెందిన ఓటర్లు వేణుగోపాల్‌రెడ్డి, నాగవేణి సైతం నగరంలో నివసిస్తున్నారు. వీరికి ఐటీ గ్రిడ్స్ కాల్‌సెంటర్ నుంచి ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. ఇందులో టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే.. ఈ నలుగురూ తమ ప్రమేయం లేకుండానే ఏపీలో ఉన్న ఓట్లు కోల్పోయారు. సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారి సమాచారం మాత్రమే కాదు.. ఏ ఓటర్ ఏ పార్టీకి చెందిన వారు అనే సమాచారం ఉంది. ఇవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలివి. ఇలా ఐటీ గ్రిడ్స్ సంస్థను అడ్డంపెట్టుకుని టీడీపీ చేస్తున్న ఎన్నో కుట్రల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ రూపొందించిన సేవామిత్ర యాప్‌ను ఆయుధంగా వాడుకుంటూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అక్రమంగా లబ్ధిపొందడానికి తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు తెరలేపింది. తమ దురుద్దేశపూర్వక సర్వేల్లో ఎవరైనా తమ పార్టీకీ ఓటు వేయరని తేలినా.. ఆ వ్యక్తి సర్వే సమయంలో సదరు నియోజకవర్గంలో లేకపోయినా వారి ఓట్లు కుట్రపూరితంగా తొలగించేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ ‘కీ’పర్సన్స్ కీలకపాత్ర పోషించేవారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. (ఇదీ జరుగుతోంది!) మొదటి వారు తమ ఓటర్లు కాదనే ఉద్దేశంతో, రెండో వారు తమకు వేయకపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో ఇలా చేసుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ గ్రిడ్స్ సాయంతో తెలుగుదేశం పార్టీ చేసిన, చేస్తున్న అక్రమాలపై నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన వివరించారు. వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, పి.రాధాకిషన్‌రావులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. బాధితులంతా నగరంలో ఉంటున్నవారే హైదరాబాద్‌లోని మధురానగర్‌కు చెందిన దశరథరామిరెడ్డి ఫిర్యాదుతో శనివారం రాత్రి ఐటీ గ్రిడ్స్‌పై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడితోపాటు ఇప్పటి వరకు గుర్తించిన బాధితులంతా హైదరాబాద్‌లో ఉంటున్న వారే. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ‘పరిధి’అనే సమస్య ఉత్పన్నం కాదు. తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్.. ఐటీ గ్రిడ్స్ కంపెనీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు చేస్తోంది. ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారం, ఈసారి ఎన్నికల్లో వారి ప్రాధాన్యం, గుర్తింపు పత్రాల వివరాలు.. ఇలా అనేక అంశాలు సేకరిస్తోంది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) దీనికోసం ఐటీ గ్రిడ్స్ సంస్థ వారు చాలా మంది సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఈ యాప్‌లో ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. సదరు ఓటరు నియోజకవర్గంలో ఉంటున్నారా? లేదా? స్వతహాగా ఏ పార్టీకీ చెందిన వారు? రానున్న ఎన్నికల్లో ఆయన ఓటింగ్ ప్రాధాన్యం ఏ పార్టీకి? ప్రశ్నలకు సమాధానాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ కాల్ సెంటర్ నుంచి ఫోన్‌కాల్స్ ద్వారా, క్షేత్రస్థాయిలో సర్వేయర్ల ద్వారా సేకరిస్తోంది. దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత టీడీపీ వారికి అందిస్తోంది. వారి ద్వారానే ఓటర్‌కు తెలియకుండానే ఓట్లు తొలగిపోతున్నాయి. అన్ని పార్టీల ఓటర్లతో సర్వే సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. ఒక ఓటరు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనేది తెలుసుకుని యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఆయా పార్టీకి రేటింగ్స్ కూడా ఇస్తూ డేటాబేస్ రూపొందించారు. ఐటీ గ్రిడ్స్‌కు చెందిన సేవామిత్ర యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ వ్యతిరేక ఓటర్లను తొలగించి రానున్న ఎన్నికల్లో అక్రమ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమే అని పోలీసులు తేల్చారు. ఈ యాప్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండని, తమ పార్టీకి ఓటు వేయరని భావించిన వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండానే తొలగిస్తున్నారు. సేవామిత్ర యాప్‌లో ఉన్నది తెలుగుదేశం పార్టీ డేటా మాత్రమే అన్నది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది విద్య, వృత్తి, వ్యాపారాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. అలాంటి వారి ఓట్లను కూడా.. వారి ప్రమేయం లేకుండానే తీసేశారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వివరాలు, మార్గదర్శకాలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఢిల్లీకి సైబర్ క్రైం బృందం ఐటీ గ్రిడ్స్ సంస్థపై నమోదైన కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సంస్థ తొలగించిన 80 జీబీ సమాచారాన్ని బయటికి తీసి (రిట్రీవ్ చేసిన).. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బుధవారం సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్ (యూఐడీఏఐ) కార్యాలయాల అధికారులను కలిసి ఐటీ గ్రిడ్స్ దగ్గరున్న డేటా గురించి ఆరా తీయనున్నారు. ఆధార్ కార్డు, ఓటరు కార్డుకు సంబంధించిన కలర్ ఫొటోలతో కూడిన కాపీలు వీరికెలా వచ్చాయి? అసలు వాటిని ఎవరెవరికి ఇస్తారు? ఇచ్చినా వాటికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలేంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరి పరిరక్షణలో ఈ వివరాలుంటాయి? వీటి గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రహస్య సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ప్రక్రియ ఉందా? ఇస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మరో బృందం బుధవారం కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థలో డిలీటెడ్ సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీని కోసం సైబర్ నిపుణులు పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో సున్నితంగా మారడంతో కేసు దర్యాప్తులో నిర్లక్ష్యాన్నికి తావులేకుండా ప్రతి అంశం కీలకంగా మారింది. దీంతో మరోసారి ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బుధవారం సైబరాబాద్ పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేసి అతని వద్దను ఆధారాలను పరిశీలించారు. బెదిరించిన పోలీసులు తెలిసిన వాళ్లే... ఐటీ గ్రిడ్స్ సంస్థ పై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బెదిరించింది ఏపీ పోలీసులేననే ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. లోకేశ్వర్‌రెడ్డి ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజీని, ఆయన కాల్‌డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఇంటికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన ఓ ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారని సేకరించిన ఆధారాల ద్వారా స్పష్టమైంది. సైబరాబాద్ పోలీసులు బుధవారం అమెజాన్ సర్వీసుకు 91 సీఆర్పీసీ నోటీసులను జారీ చేశారు. మొదటిరోజు నోటీసులు జారీ చేసినా అమెజాన్ వెబ్ సర్వీసు ఇంకా స్పందించలేదు. దీంతో బుధవారం మరో సారి సైబరాబాద్ పోలీసులు 91 సీఆర్పీసీ నోటీసును జారీ చేసి దర్యాప్తుకు అవసరం ఉన్న సమాచారాన్ని త్వరగా ఇచ్చేలా అమెజాన్ సంస్థ చర్యలు తీసుకోవాలని నోటీసులో స్పష్టంచేశారు. -
నేరాన్ని దాచేందుకు ఎదురుదాడి
సాక్షి, అమరావతి: ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే... దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా అధికార తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం సాగిస్తోంది. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమా చారాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఘోరమైన నేరానికి పాల్పడటమే కాకుండా ఆ సమాచారం ఆధారంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కొందరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఇదేం అరాచకమని ప్రశ్నించిన ప్రతిపక్షంపై టీడీపీ–ఎల్లో మీడియా ఒకే శ్రుతిలో ఎదురుదాడి ప్రారంభిం చాయి. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) రాష్ట్రంలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు ఐటీ నిపుణుల పరిశోధనలో ఇప్పటికే తేటతెల్ల మైంది. వాటిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గతంలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాము గుర్తించిన బోగస్ ఓట్లను తొలగించాలని కోరుతూ కొన్నిచోట్ల ఫారం–7 దరఖాస్తులను కూడా తాము ఇచ్చినట్టు వైఎస్ జగన్ నిండు బహిరంగ సభలోనే చెప్పారు. అయితే, తాను చేసిన ఘోరమైన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పంతా ప్రతిపక్షానిదే అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్లో మీడియా తంటాలు పడుతున్నారు. నలుగురూ నవ్విపోతారని తెలిసి కూడా డేటా చౌర్యంపై తప్పుడు ప్రచారానికి తెరతీయడం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. (ఇదీ జరుగుతోంది!) గుట్టు రట్టు కావడంతో బాబు బెంబేలు బోగస్ ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తప్పుడు మార్గాల్లో నమోదు చేయించడమే కాకుండా, తమకు ఓటు వేయరని భావించే వారి ఓట్లను తొలగించే పనిని తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఇందుకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పథకం రచించారు. ప్రజా సాధికార సర్వే, ఆర్టీజీఎస్ సర్వే ఇలా పలు మార్గాల్లో రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వం సేకరించిన ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ అనే అస్మదీయ కంపెనీకి చేరవేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అందజేయడం చట్ట ప్రకారం తీవ్రమైన నేరమని సాక్షాత్తూ సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించింది ఐటీ గ్రిడ్స్ కంపెనీయే కావడం గమనార్హం. ప్రజల వ్యక్తిగత డేటాను పార్టీ యాప్‌లో చేర్చారు. దాని ఆధారంగా ఓట్ల తొలగింపునకు కుట్ర సాగించారు. తాను ఇన్నాళ్లూ చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. డేటా చౌర్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతిపక్షంపై అభాండాలు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతలే తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ చంద్రబాబు, ఆయన అనకూల మీడియా దుష్ప్రచారం ప్రారంభించారు. అసలు ప్రజల వ్యక్తిగత సమాచారం, ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా వంటివి ఐటీ గ్రిడ్స్‌కు, సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చాయో సమాధానం మాత్రం చెప్పడం లేదు. పైగా తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన డేటాను చోరీ చేశారంటూ గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం గమనార్హం. తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా దబాయింపులో భాగంగానే వారు పోలీసులను ఆశ్రయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకం ప్రకారమే టీడీపీ కుట్ర 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సాధించిన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 5 లక్షలే. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గేందుకు కుట్రలకు తెరలేపారు. దొంగ ఓట్లను చేర్చించడం, ప్రతిపక్షానికి పడే పడే ఓట్లను తొలగించడం అనే పన్నాగాన్ని అమల్లోకి తెచ్చారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం ఒక వ్యూహం ప్రకారమే ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ వంటి కంపెనీలను తెరపైకి తెచ్చి, ప్రభుత్వంలో కాంట్రాక్టులను అప్పగించడంతో పాటు ఆ కంపెనీల ద్వారానే ఈ అక్రమ వ్యవహారాలను కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. ఐటీ గ్రిడ్స్ ఎండీకి టీడీపీ పెద్దల రక్షణ డేటా చౌర్యం బయటపడడంతో ఐటీ గ్రిడ్స్ ఎండీ, మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు డాకవరపు అశోక్ పరారయ్యాడు. అతడు ఏపీలోని టీడీపీ ముఖ్యనేతల వద్దే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అశోక్ సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కితే తమ బండారం బట్టబయలవుతుందన్న భయంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై నిస్సిగ్గుగా ఎదురుదాడి మొదలుపెట్టారు. అందుకే దీన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత డేటా చోరీ, ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదుపై ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేస్తోందని సీఎం చంద్రబాబు చెబుతుండగా, మంత్రి లోకేశ్ తమ డేటా పోలేదని ఒకసారి, తమ డేటాను తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్లారని మరోసారి ప్రకటన చేయడం గమనార్హం. ప్రభుత్వ డేటా చోరీకి గురైందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అంగీకరించగా, ప్రభుత్వ డేటా చోరీకి గురికాలేదని, భద్రంగా ఉందని ఐటీ కార్యదర్శి, ఆర్టీజీఎస్ సీఈఓలు పేర్కొన్నారు. ప్రతిపక్ష మద్దతుదార్ల ఓట్లపైనే గురి డేటా చౌర్యంపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల విచారణలో విస్మయం కలిగించే అంశాలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, మద్దతుదార్ల ఓట్లను తొలగించడంతోపాటు ఒకే వ్యక్తి పేరిట రెండు ఓట్లు, అసలు లేని వ్యక్తుల పేరిట సైతం ఓట్లు చేర్పిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ సేవామిత్ర యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా సైబరాబాద్ పోలీసుల విచారణలో బయట పడుతుండడం గమనార్హం. మొత్తం ఓట్లలో 15 శాతం నకిలీ ఓట్లే రాష్ట్రంలో లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు నమోదు అవుతున్నాయని గత ఏడాది ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్(వాస్ట్) సంస్థ ప్రతినిధులు లోకేశ్వరరెడ్డి, తదితరులు తమ అధ్యయనంలో గుర్తించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తే దాదాపు 52.67 లక్షల మేర నకిలీ, బోగస్ ఉన్నట్లు బయటపడింది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 15 శాతం ఓట్లు నకిలీవేనని తెలుస్తోంది. ఈ ఓట్లలో నకిలీ, రిపీట్, అక్రమ, చెల్లని, ఒకే విధమైన సమాచారం ఉన్నవి 34.17 లక్షలు ఉన్నాయి. ఇవికాకుండా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటర్లుగా కొనసాగుతున్న వారి సంఖ్య 18.50 లక్షలు. ఓటరుగా నమోదు కావాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలన్నది ఎన్నికల సంఘం నిబంధన. కానీ, ఏపీలో ఏడాది వయసున్న పసిబిడ్డలు కూడా ఓటర్లుగా నమోదైన ఉదంతాలు చాలా ఉన్నాయి. 350 ఏళ్ల వ్యక్తుల పేరిట కూడా ఓట్లు ఉండడం విశేషం. ఇంటి నెంబరు, చిరునామా లేకుండానే లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. పది కేటగిరీలుగా నకిలీ, బోగస్ ఓట్లు ఎన్నెన్ని చేర్చారో కూడా తేలింది. - ఓకే ఓటర్ ఐడీతో ఒక వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండడం: 36,404 - ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటినెంబర్, వయసు, జెండర్ ఒకేలా ఉన్న నకిలీ ఓట్లు: 82,788 - ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నెంబర్ జెండర్ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 24,928 - ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నెంబర్, వయసు ఒకేలా ఉండి జెండర్ మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 1,006 - ఓటరు పేరు, ఇంటి నెంబరు, వయసు, జెండర్ ఒకేలా ఉండి తండ్రి/భర్త పేరు మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 92,198 - ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్చి నమోదు చేయించిన నకిలీ ఓట్లు: 2,60,634 - ఓటరు పేరు తండ్రి/భర్త పేరు ఒకేవిధంగా ఉండి ఇతర వివరాలు వేరేగా మార్పులు చేసి నమోదైన నకిలీ ఓట్లు: 25,17,164 - వయసు తప్పుగా ఉన్న ఓట్లు (18 ఏళ్లకంటే తక్కువ, 100 ఏళ్లకన్నా ఎక్కువ–గరిష్టంగా 350 ఏళ్ల వయసుతో ఉన్న నకిలీ ఓటర్లు): 6,126 - ఇంటి నెంబరు తప్పుగా ఉన్న ఓట్లు (ఇంటి నెంబర్ స్థానంలో నన్, సేమ్, ఓల్డ్, న్యూ, 000 తదితరాలతో ఉన్న నకిలీ ఓట్లు): 3,95,877 - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదైన ఓటర్లు: 18,50,511 - వీటితోపాటు చనిపోయిన వ్యక్తుల పేరిట కూడా లక్షల సంఖ్యలో ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు తేలింది. మరో 6 లక్షల బోగస్ ఓట్లు నకిలీ, బోగస్ ఓట్లకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఆయా ఓటర్ల పేర్లతో కూడిన సాక్ష్యాధారాలను కూడా వాస్ట్ సంస్థ సేకరించింది. ఈ బోగస్, నకిలీ ఓట్లను తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వాస్ట్ సంస్థ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి వీటిపై విన్నవించాయి. 25,47,019 ఓట్లు నకిలీవి అన్న అనుమానాలు ఉన్నాయని, వీటన్నిటిపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, జనవరిలో విడుదల చేసిన ఓటరు జాబితాను పరిశీలించిన వారికి నిరాశే ఎదురైంది. నకిలీ ఓట్లు తగ్గడానికి బదులు మరిన్ని పెరిగాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే క్షేత్రస్తాయిలో నకిలీ ఓట్లు తగ్గకపోగా మరిన్ని చేరాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓట్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా గతంలో టీచర్లు లేదా రెగ్యులర్ ఉద్యోగులు ఆ బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ, ఈసారి ఈ పనిని క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారు. వీరంతా ప్రభుత్వం నియమించినవారే. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మరో 6 లక్షల బోగస్ ఓట్లను చేర్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు 3.52 కోట్లుండగా, ఈ ఏడాది జనవరి 11వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఈ ఓట్ల సంఖ్య 3.69 కోట్లకు చేరినట్లు చూపించారు. అంటే సెప్టెంబర్ నుంచి జనవరి వరకు కొత్తగా 18 లక్షల ఓట్లు పెరిగాయి. కొత్త ఓటర్లు చేరినా నకిలీ ఓట్ల సంఖ్య అత్యధికంగా ఉన్నందున మొత్తం ఓట్ల సంఖ్య తగ్గాల్సి ఉన్నప్పటికీ గతంలో కంటే భారీగా పెరగడం గమనార్హం. కొత్త జాబితాలో కూడా నకిలీ, బోగస్ ఓట్లు 6 లక్షల వరకు ఉన్నాయని వాస్ట్ సంస్థ గుర్తించింది. జనవరి నాటికి నకిలీ ఓట్ల సంఖ్య 59,18,631కు చేరినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీ పెద్దలు దగ్గరుండి మరీ నకిలీ, బోగస్ ఓట్లను చేర్పించడం వల్లే మొత్తం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా... నకిలీ, బోగస్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఇంతకు ముందు దీనిపై ఫిర్యాదులు ఇచ్చారు. అయినా నకిలీ, బోగస్ ఓట్లు తగ్గడానికి బదులు మరిన్ని పెరగడం విస్మయానికి గురిచేస్తోంది. జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాను పరిశీలించిన వాస్ట్ సంస్థ నకిలీ, బోగస్ ఓట్లు ఏ మేరకు ఉన్నాయో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన జాబితాలోని వారి పేర్లు కొత్త ఓటర్ల జాబితాలో వేరే నియోజకవర్గాల్లో ఓటర్లుగా దర్శనమిస్తున్నాయి. అంటే ఒకరి పేరునే మరో నియోజకవర్గంలో మళ్లీ ఓటర్లుగా నమోదు చేయించినట్లు స్పష్టమవుతోంది. ఇదేకాకుండా ఒకే బూత్‌లో ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్నవారు కూడా ఈ కొత్త జాబితాలో దర్శనవిస్తుండడం విశేషం. చిన్నపిల్లల పేర్లతో ఓట్లు, మరణించిన వారి ఓట్లు లక్షకు పైగానే ఉన్నాయని గత సెప్టెంబర్ తేలింది. అవే ఓట్లు ఈసారీ కొనసాగుతున్నాయి. అవి ఇలా ఉన్నాయి. - ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్నవారు: 9,552 (సెప్టెంబర్ జాబితాలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఏబీ10419705 ఐడీ నెంబర్‌తో శివశంకర నల్లపాటి అనే ఓటరు పేరు నమోదై ఉంది. అదే వ్యక్తికి మళ్లీ తాజా జాబితాలో అదే ఐడీ నెంబర్‌తో అదే జిల్లాలోని తాడికొండలో మరో ఓటు నమోదు కావడం విశేషం) - ఒకే రకమైన సమాచారంతో వేర్వేరు ఐడీ నెంబర్లతో ఓట్లు కలిగిన వారు: 78,156 (ఉదాహరణకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏజీజెడ్3079639 ఐడీ నెంబర్‌తో అభినయ్ మన్నెం అనే ఓటరు పేరు ఉండగా, అదే ఓటరు పేరుతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీఎంఓ02312932 నెంబర్‌తో మరో ఓటు నమోదైంది. ఇలాంటివే మరెన్నో ఉన్నాయి) - వయసులో మార్పుచేసి రెండేసి ఓట్లు కలిగిన వారు: 52,180 (పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని 233 బూత్‌లో అఖిల గెడ్డం (24 ఏళ్లు) పేరు, ఇతర వివరాలతో ఓటు ఉంది. అవే వివరాలతో వయసును 23 ఏళ్లుగా పేర్కొంటూ అదే నియోజకవర్గం పోలింగ్‌బూత్ 242లో కూడా మరో ఓటు నమోదైంది) - వ్యక్తి జెండర్‌ను మార్పు చేయడం ద్వారా నకిలీ ఓట్లుగా నమోదైనవి: 1,224 (తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం 27వ నెంబర్ పోలింగ్ బూత్‌లో అన్నమ్మ కొమ్మరి (మహిళ) అనే ఆమెకు ఓటు ఉంది. అదే పేరు, ఇతర వివరాలను యథాతథంగా ఉంచి మహిళకు బదులు పురుష అని జెండర్‌ను మార్పు చేసి మరో ఓటు అక్కడే నమోదైంది) - తండ్రి/భర్త పేరులో చిన్నమార్పుతో నమోదైన నకిలీ ఓట్లు: 1,78,868 (విశాఖ జిల్లా భీమిలిలోని 305 బూత్‌లో ఆదిలక్ష్మి కొల్లి, భర్త అప్పలరాజు పేరుతో ఓటు ఉంది. భర్త పేరును అప్పల రాజు అని వేర్వేరు పదాలుగా చూపించి ఈ ఓటు నమోదు చేశారు. ఇదే పేరుతో భర్త పేరును అప్పలరాజుగా రెండు పదాలను ఒకటిగా కలిపి మరో ఓటు అదే పోలింగ్ బూత్‌లో నమోదు చేశారు.) - ఓటరు పేరును ముందు వెనుకలు మార్పు చేసిన నకిలీ ఓట్లు: 1,69,448 (శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని 315 బూత్‌లో కొర్రాయి ధనుంజయ్ (తండ్రి తులసయ్య) అనే పేరుతో ఓటు ఉండగా, ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్పుచేసి అదే చోట ధనుంజయ్ కొర్రాయి (తండ్రి తులసయ్య)అని మరో ఓటును నమోదు చేశారు. - ఒకే వ్యక్తి పేరుతో ఇంటినెంబర్ల మార్పుతో ఒకే పోలింగ్‌బూత్‌లో రెండుసార్లు నమోదు చేసిన నకిలీ ఓట్లు: 25,17,630 (కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం 22వ పోలింగ్‌బూత్‌లో అశ్వనికుమార్ సమ్మెట, తండ్రి వెంకటేశ్వరరావు సమ్మెట, ఇంటి నెంబర్ 1.13 అనే పేరుతో ఒక ఓటు ఉండగా, అదే పేరుతో ఇంటి నెంబర్‌ను 1.19గా మార్చి అక్కడే మరో ఓటు కూడా తాజా జాబితాలో నమోదు చేశారు) - ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు ఇంటినెంబర్లతో వేర్వేరు బూత్‌లలో నమోదైన రెండేసి ఓట్లు: 4,49,126 (విజయవాడ సెంట్రల్లో 67వ పోలింగ్‌బూత్‌లో 13–2824 ఇంటి నెంబర్‌తో రెడ్డయ్య అర్ల పేరుతో ఒక ఓటు ఉండగా, అదే నియోజకవర్గంలోని మరో పోలింగ్‌బూత్‌లోనూ ఇంటి నెంబర్‌ను 24–1328గా మార్పు చేసి మరో ఓటు తాజా జాబితాలో నమోదు చేశారు) - పేరులో చిన్న అక్షరం మార్పుతో ఒకరికే రెండుకు మించి నమోదై ఉన్న నకిలీ ఓట్లు: 2,36,626 (తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 140వ బూత్‌లో సుష్మ అనే పేరుతో ఒక ఓటు నమోదు చేశారు. తండ్రి పేరు, ఇంటి నెంబర్ ఇతర వివరాలు యథాతథంగా ఉంచి పేరులోని మొదటి అక్షరం ‘సు’కు బదులు ‘షు’ అని మార్చి షుష్మగా అదే పోలింగ్‌బూత్‌లో మరో ఓటు తాజా జాబితాలో చేర్చారు) - ఓటు హక్కు పొందేందుకు 18 ఏళ్లు ఉండాలి. కానీ, అంతకంటే తక్కువ వయసున్న వారి పేరిట కూడా ఓట్లు కొనసాగుతున్నాయి. వాటితోపాటు 100 ఏళ్ల నుంచి 351 ఏళ్లకు పైగా వయసున్న వారిపేరుతో ఉన్న ఓట్లు: 3,307 (తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని 391బూత్‌లో నారాయణమ్మ వనం వయసు 351 పేరిట ఓటు ఉంది. కానీ, అదే ఐడీనెంబర్‌తో పేరును నారాయణమ్మకు బదులు వెంకటేశ్వర్లు వనం అని మార్పుచేసి వయసును 351 ఏళ్లుగా చూపించి ఓటును కొనసాగిస్తున్నారు) - ఇంటినెంబర్లు లేకుండానే నమోదైన ఓట్లు: 2,15,119 - గత ఏడాది సెప్టెంబర్ నాటి జాబితా ప్రకారం ఏపీ, తెలంగాణల్లో రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు 18,50,511 మంది ఉండగా, ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఆ సంఖ్య 20,07,395కు చేరింది. చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఈ నకిలీ ఓట్లపై సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, వచ్చే ఎన్నికలపై ఈ నకిలీ ఓట్లు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏకంగా అరకోటికి పైగానే నకిలీ ఓట్లు ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) -
సీఎంది సైబర్ నేరం
సాక్షి, హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావితం చేసే దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ నేరానికి పాల్పడ్డారని, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ప్రైవేటు కంపెనీలకు బదలాయించారని పేర్కొంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ పార్టీ ప్రతినిధి వర్గంతో కలసి వెళ్లి బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన సైబర్ నేరం రాష్ట్ర, దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు. దీనిపై ఈ రోజు గవర్నర్‌ను కలిశామని, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కూడా కలుస్తామని తెలిపారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘ఏపీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ నేరానికి పాల్పడితే దొంగతనం కాదా? అని గవర్నర్‌ను కలసి చెప్పాం. చంద్రబాబు చేసిన తప్పు పనిని మేమిచ్చిన వినతిపత్రం ద్వారా చాలా వివరంగా తెలియజేశాం. ఒక పథకం ప్రకారం రెండేళ్ల కిందటి నుంచే చంద్రబాబు ఎన్నికలను మేనేజ్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దుర్బుద్ధితో ఈ సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబును నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మీడియా కూడా ఆయన్ను ఈ ప్రశ్నలు అడగాలి. జరగకూడనిది ఎలా జరిగిందన్నది మీరు కూడా ప్రశ్నించాలి. ఐటీ గ్రిడ్స్ అనే ఒక కంపెనీ మీద రెయిడ్స్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. టీడీపీకి చెందిన సేవామిత్ర అనే యాప్‌ను తయారు చేసింది ఈ ఐటీ గ్రిడ్స్ వారే. ఈ సేవామిత్ర యాప్‌లో ఉండకూడని డేటా, ఎవరి వద్దా ఏ విధంగానూ ఉండకూడని ఆధార్ వివరాలు ఎలా కనిపిస్తున్నాయి? ఏ రకంగా ఐటీ గ్రిడ్ కార్యాలయం కంప్యూటర్లలో దొరుకుతున్నాయి? ఆధార్ వివరాలు ఒక ప్రైవేటు కంపెనీ వద్ద దొరకడం, టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లో దొరకడం సబబేనా? ఇది న్యాయమేనా? ఇది నేరం కాదా? ఇది ప్రజల వ్యక్తిగత వివరాల్లోకి చొరబడటం కాదా? (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) సర్వేల సమాచారం సేవామిత్రతో అనుసంధానం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల ఐడీ డేటా ఉన్న మాస్టర్ కాపీ ఎవరికీ అందుబాటులో ఉండదు. ఈ మాస్టర్ కాపీ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ కంప్యూటర్లలో కనబడుతోంది? ఏ విధంగా టీడీపీ అధికార యాప్ అయిన సేవామిత్రలో ఇది ఉంది? ఇది కేంద్ర ఎన్నికల సంఘం డేటా. ఇక ఆధార్ అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డేటా. ఇక మూడోది... రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు.. ఒక వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ చంద్రబాబు దగ్గర ఉన్న సేవామిత్ర యాప్‌లో కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏరకంగా ఐటీగ్రిడ్స్ ఆఫీసులోని వారి కంప్యూటర్లలో ప్రత్యక్షమవుతున్నాయి? టీడీపీ యాప్ సేవామిత్రలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? ఒక మనిషికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు, అతనికి సంబంధించిన కలర్ ఫోటోతో కూడిన ఓటరు జాబితా వివరాలు మీ వద్ద ఉన్నాయంటే అర్ధం ఏమిటి? ఇవన్నీ మీ వద్ద ఉన్నప్పుడు, రేపు పొద్దున మీరేం చేసినా ప్రజలు మోసపోరా? నాశనం అయిపోరా? ఇలాంటి వివరాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద గానీ, సంస్థల వద్ద గానీ అస్సలు ఉండకూడదు. (ఇదీ జరుగుతోంది!) అలాంటిది ఇలాంటి వివరాలే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ప్రజల వద్దకు వెళ్లి పల్స్ సర్వే అని, ఆర్టీజీఎస్ అని రకరకాల సర్వేల పేరిట వారి సమాచారం సేకరించింది. అలా సేకరించిన డేటాను కూడా చంద్రబాబు గారి సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేశారు. ఇలా అనుసంధానించిన డేటాను, సేవామిత్ర యాప్‌లో రిజిస్టర్ అయిన టీడీపీ నేతల ట్యాబ్‌లకు పంపించారు. టీడీపీ నేతలు వారి వారి గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ ఓటరు ఎవరు? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడు? వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తాడా? లేక టీడీపీకి ఓటేస్తాడా? అంటూ సర్వేలు చేశారు. ఆ తర్వాత ఎవరైతే టీడీపీకి ఓట్లేయరో వారి ఓట్లన్నీ ఒక పద్ధతి, ఒక పథకం ప్రకారం తీసేయడం మొదలు పెట్టారు. మరోవైపు రెండేసి ఓట్లను చేర్చడం మొదలు పెట్టారు. టీడీపీకి అనుకూలమైన ఓటరు పేరు ఒకటి కాదు, రెండేసి కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు డూప్లికేట్ ఓటర్లను చేర్చి తమకు అనుకూలురైన ఓటర్ల సంఖ్యను పెంచడం, మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ఒక పథకం ప్రకారం చేస్తూ వచ్చిన పని ఇదే. ఇదంతా గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. డేటా చోరీ ఉదంతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్. చిత్రంలో రాజన్నదొర, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి, ఆదిమూలపు సురేష్, పార్థసారథి, కొడాలి నాని ఫామ్–6, ఫామ్–7 సమర్పించడం మా హక్కు అసలు ఫామ్–7 అంటే ఏమిటి? ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి.. దర్యాప్తు చేయండి, వచ్చి చూసి ఎంక్వయిరీ చేసిన తర్వాత దొంగ ఓటు అని తేలితే ఆ ఓటును తీసేయండి? అని అర్థం. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనికి మేం సహకరించాం. దర్యాప్తు చేసి నిజం తెలుసుకోండి. చంద్రబాబు ఎంత దారుణంగా చేశారో చూడండి అని చెప్పాం. కానీ చంద్రబాబు పోలీసులను పంపి ఫామ్–7 దరఖాస్తు నింపి ఫిర్యాదు చేయడమే తప్పన్నట్లుగా వేధింపుల పర్వం ప్రారంభించారు. అసలు ఏపీ ప్రభుత్వానికి, దీనికి సంబంధం ఏమిటి? ఎన్నికల కమిషన్ అనేది ఒక ఖ్వాజీ జుడిషియల్ అథారిటీ (న్యాయపరమైన అధికారాలు కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ). దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ సంబంధమే లేదు. అలాంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థకు.. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఫామ్–7 సమర్పించడం, ఇక్కడ మా ఓటరు నమోదు కాలేదు, నమోదు చేయండి అని ఫామ్–6ను సమర్పించడం అనేది మా హక్కు. మేం అప్లికేషన్ పెట్టగానే వాళ్లేమీ ఆ ఓట్లను తీసేయరు. అలాగే ఓట్లను చేర్చరు. మేం సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా తొలుత సంబంధిత ఊరికి వచ్చి దర్యాప్తు చేయాలి. దర్యాప్తులో మేం చెప్పింది సరైనదిగా తేలితే ఆ ఓటర్లకు టిక్ పెడతారు. డూప్లికేట్ అని తేలితే తీసేస్తారు. ఓటరును నమోదు చేయాల్సిన అవసరం ఉంటే చేస్తారు. ఇదొక ప్రక్రియ. ఇది ఎన్నికల కమిషన్‌కు సహకరించే ఒక బాధ్యత. ఇది మేమే కాదు విజ్ఞత గల ప్రతి ఒక్కరూ చేయాలి. విజ్ఞత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ చానెల్ చేయాలి. ‘ఓటర్ల జాబితాలో మీరు పేరు ఉందో లేదో కనుక్కోవాలి. 1950 అనే నంబరుకు మీ ఓటరు కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్‌ను ఎస్సెమ్మెస్ చేయాలి. చేసిన వెంటనే ఓటరు అవునా ... కాదా! అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఓటరు కాకుంటే ఈ రకంగా ఫామ్ –6 సమర్పించాలి. డూప్లికేట్ ఓటరు ఎక్కడైనా కనిపిస్తే ఫామ్–7 సమర్పించాలి..’ అంటూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. దేశంలోని ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడు ఈ పని చేయాలి. ఓటు హక్కును ప్రజల దగ్గరకు తీసుకువెళ్లే కార్యక్రమం ఇది. అయితే దీనిపై ఎంక్వయిరీ జరక్కూడదని, ఒకవేళ ఎంక్వయిరీ జరిగితే దొంగ ఓట్లను తీసేస్తారని అడ్డుకుంటున్నారు. చంద్రబాబునాయుడుకు భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇతర ఎల్లో మీడియా... వీళ్లంతా కలసి అదేదో తప్పన్నట్లు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు చేసిందే అసలు తప్పు దొంగ ఓట్లున్నాయని చెప్పి దర్యాప్తు కోరడం తప్పు కాదు. రెండేళ్లుగా చంద్రబాబు చేసిందే అసలు తప్పు. ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు చంద్రబాబు తీసుకోవడం తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను సేకరించడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడీ, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ కాపీని తీసుకోవడం అసలు తప్పు. ఇది సైబర్ నేరం. ప్రైవేటు వ్యక్తుల వద్దగానీ, ప్రైవేటు సంస్థల వద్దగానీ ప్రజలకు సంబంధించిన డేటా, ఆధార్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కలర్ ఫోటోల సహితంగా ఓటర్ల జాబితా ఉంటే...అది పూర్తిగా నేరం, చట్ట విరుద్ధం అవుతుంది. ఇవి శిక్షార్హమైన నేరాలు. వీటిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అలాంటిది.. ప్రజల వివరాలన్నీ ప్రైవేటు కంపెనీలకు చోరీ చేసి ఇవ్వడం, టీడీపీ యాప్ అయిన సేవామిత్రలో వాడుకోవడం, ఇష్టమొచ్చినట్లుగా ఓటర్లను తీసేయడం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న ఈ వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఉండటానికి అర్హుడేనా?. ఇవే విషయాలను గవర్నర్‌కు నివేదించాం. ఎన్నికల కమిషన్‌కు కూడా మరోసారి చెబుతాం. వీటిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయమని అడుగుతాం. ఒక ముఖ్యమంత్రి ప్రజల బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం, ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం, సేవామిత్ర యాప్‌లో పొందు పర్చడం శిక్షార్హమైన నేరాలే. ఇవన్నీ చంద్రబాబు, ఐటీ మంత్రిగా ఆయన కుమారుడు జైలుకు పోవాల్సిన నేరాలే. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు తన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫామ్–7 సమర్పించడం ఒక తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. రెండేళ్లుగా ఆయన చేర్పించిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు తొలగించండి అని అడగడం తప్పంట. ఆయన అలా చెప్పడం.. ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా అంతా.. డ... డ... డ... అంటూ డప్పు కొట్టడం జరుగుతోంది..’ 56 లక్షల డూప్లికేట్, డబుల్ ఓట్లు గుర్తించాం ఎన్నికల కమిషన్ 2018 సెప్టెంబర్‌లో ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాను మేం పూర్తిగా అధ్యయనం చేశాం. చంద్రబాబు అన్యాయమైన పనులు చేస్తున్నాడనే ఆందోళనతో ఇలా అధ్యయనం చేశాం. గత ఎన్నికల్లో చంద్రబాబుకు, మాకూ వచ్చిన ఓట్ల తేడా కేవలం ఒక్క శాతం మాత్రమే. 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా. అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూడాలనే ఉద్దేశంతో ఆ ఓటర్ల జాబితాను పూర్తిగా అధ్యయనం చేశాం. అందులో రకరకాల పారామీటర్లతో 56 లక్షల డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉన్నాయని లెక్కలు తేల్చాం. ఒకే ఓటరు ఐడీ కార్డు మీద ఒక వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండటాన్ని గుర్తించాం. వయస్సు సంబంధిత అర్హత లేకున్నా ఓట్లు కలిగి ఉండటం (ఓటర్స్ ఆఫ్ ఇన్వ్యాలిడ్ ఏజ్), ఓటరు పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఇంటి నంబరు, వయçస్సు, లింగం ఒకే విధంగా ఉన్న డూప్లికేటు ఓట్లు గుర్తించాం. అలాగే ఒక వ్యక్తి ఏపీ , తెలంగాణలో ఓట్లు కలిగి ఉండటం.. ఇలా రకరకాలుగా 56 లక్షల డూప్లికేట్, డబుల్ ఓటర్లు ఉన్నారని గుర్తించి కోర్టులో కేసు వేశాం. 24 పెన్డ్రైవ్ల్లో సమాచారం సమర్పించాం. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. వీటిపై చర్యలు తీసుకుంటారు, దర్యాప్తు చేసి వెరిఫై చేసి సవరిస్తారనుకుంటే అలా జరగలేదు. ఎలాంటి చర్య తీసుకోలేదు. జనవరి 2019 వచ్చే నాటికి ఆశ్చర్యకరమైన రీతిలో ఇలాంటివి మరో 3 లక్షల ఓట్లు పెరిగాయి. ఇలాంటి ఓట్ల సంఖ్య మొత్తం 59 లక్షల 16 వేలకు చేరింది. దీంతో మళ్లీ జనవరిలో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి నేను స్వయంగా వినతిపత్రం సమర్పించా. మళ్లీ వారికి 24 పెన్‌డ్రైవ్‌లలో వివరాలన్నీ ఇచ్చాం. ఈ మేరకు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని వారికి అర్థం అయ్యేలా చెప్పాం. టీడీపీ రెండేళ్లుగా ఒక పద్థతి ప్రకారం ఇలా చేస్తున్న విషయం వివరించి వచ్చాం. తర్వాత దానిపై తదుపరి చర్యల్లో భాగంగా ఫామ్–7లు కూడా నింపి ఎన్నికల కమిషన్‌కు నివేదించాం. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారు డేటా దొంగతనానికి సంబంధించి ఏపీ పోలీసులకు కాకుండా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడాన్ని టీడీపీ వాళ్లు విమర్శించడాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఆంధ్రాకు సంబంధించిన వారెవరైనా వచ్చి హైదరాబాద్‌లోని మీ (మీడియా ప్రతినిధి) ఇంట్లో దొంగతనం చేస్తే ఆంధ్రాలో కేసు పెడతావా? లేకుంటే మీ ఇల్లు ఉండే ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు పెడతావా? అమెరికాలో ఏదైనా నేరం జరిగితే భారత్‌లో ఎవరైనా కేసు పెడతారా? వారి ఆఫీసు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది కనుక ఎవరైనా ఇక్కడే కేసు పెడతారు..’ అని చెప్పారు. ఆంధ్రా– తెలంగాణ గొడవ అన్నట్లు చెప్పడం సరికాదు ఇదేదో ఆంధ్రా– తెలంగాణ గొడవ అన్నట్లు చెప్పడం సరికాదని జగన్ అన్నారు. చంద్రబాబు తెలంగాణ–ఆంధ్రా మధ్య యుద్ధం అన్నట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించే, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజల ఆధార్ వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు తీసుకోవడం తప్పని, ఓటర్ల జాబితా మాస్టర్ కాపీ తీసుకుని సేవామిత్ర యాప్‌లో పెట్టుకోవడం నేరమని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రే ఇలా చేస్తే రేపు ఎవరికీ భద్రత ఉండదని అన్నారు. ‘ఆధార్ వివరాలు ఎవరి వద్దా ఉండకూడదు. ఆ వివరాలు ముఖ్యమంత్రి ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకూడదు. మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరి వద్దా ఉండకూడదు. మీ అకౌంట్లో నుంచి మీ జీతం చంద్రబాబు అకౌంట్లోకి వెళితే కూడా ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు..’ అని విపక్ష నేత వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించిన వారిలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పీడిక రాజన్నదొర, ఆదిమూలపు సురేష్, పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఉన్నారు. -
డేటా చోరీ ప్రకంపనలు.. అదే గనుక జరిగితే!
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒకటే చర్చ. డేటా చౌర్యం వార్తలతో తమ వ్యక్తిగత సమాచారం ఎంతవరకు భద్రం అనే అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ చేతుల్లోకి సున్నిత సమాచారం చేరడం ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి ఐటీ నిపుణులు విస్తుగొలిపే విషయాలు చెబుతున్నారు. ఫేస్బుక్ డేటా చౌర్యం మాదిరి మన డేటా కూడా లీక్ అయినట్లైతే గోప్యతా హక్కు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ స్కాం వెలుగులోకి వచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత ప్రమాదంలో పడింది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి దరఖాస్తు చేసుకున్న వాళ్లమే. చంద్రన్న భీమా పథకం కోసమో, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కట్టుకోవాలనో లేదా ఆరోగ్య రక్ష ద్వారా లబ్ది పొందాలనో ఆశించిన వాళ్లమే. ఇందులో భాగంగా మన పేరు, చిరునామా, ఫొటో, ఆధార్ నంబర్, సామాజిక వర్గం తదితర విషయాలను ప్రభుత్వ అధికారులకు ఇచ్చి ఉంటాం. అయితే ఈ వివరాలన్నీ ప్రభుత్వం వద్దే కాదు.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ రకంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత, రహస్య సమాచారం ఒక ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి వెళ్లడం వల్ల పౌరులకే కాకుండా దేశ భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అసలేం జరుగుతోంది... వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరచడంలో భాగంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) కోసం ఇటీవల స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్ నంబర్ సహా ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లో నిల్వ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లోని డేటాను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఈ డేటాను ఐటీగ్రిడ్స్ అనే సంస్థ తన ‘సేవామిత్ర’యాప్ రూపకల్పనలో ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదకర ఫీచర్లు ఉన్న ఈ యాప్ ద్వారా పౌరుల ప్రైవేటు డేటాను వివిధ వర్గాలకు విక్రయించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మనం బలై పోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరికైనా వివరాలు చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. అయితే ప్రభుత్వాన్ని నమ్మి వివరాలు చెప్పినందుకు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం నిజంగా విచారకరం. ప్రమాదకర ఫీచర్లు.. సేవామిత్ర యాప్‌లో అనేక ప్రమాదకర ఫీచర్లు ఉన్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు వినియోగదారులు ఎక్కడ ఉన్నదీ (యూజర్ లొకేషన్) తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. మన ఫోన్ స్టేటస్‌తో పాటు అందులోని వ్యక్తిగత ఫొటోలు, ఫైల్స్, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ యాప్ ద్వారా యూఎస్బీ స్టోరేజీ ఫైల్ సిస్టమ్‌లోని సమాచారాన్నితెలుసుకోవడంతో పాటు... అందులోని సమాచారాన్ని మార్పిడి చేయడం లేదా తొలగించే సామర్ధ్యం కూడా ఉందని చెబుతున్నారు. పౌరుల ఆడియో రికార్డుతో పాటు వైఫై కనెక్షన్ల వివరాలు, నెట్వర్క్ కనెక్షన్లు, బ్లూటూత్‌తో అనుసంధానం, ఆడియో సెట్టింగ్‌లను కూడా మార్చడం వంటివి చేయడం ద్వారా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హ్యాకింగ్‌కు గురైతే మన బ్యాంకు ఖాతాల వివరాలు, పర్సనల్ ఫొటోలు, వివిధ వ్యక్తులతో మనం జరిపిన సంభాషణలు వీటితో పాటు పూర్తి గోప్యంగా ఉంచుకునే కొన్ని విషయాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ‘అభిమన్యుడు’ సినిమాలో మాదిరి మనల్ని మనం పూర్తిగా కోల్పోయే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం సేవామిత్ర యాప్ వల్ల ఒక వ్యక్తి ఫోన్లో ఉన్న డేటా మొత్తం చౌర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. - అప్రాక్సిమేట్, ప్రిసైజ్ లోకేషన్ : ఒక వ్యక్తి ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే లోకేషన్ సర్వీస్ ఆన్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. - ఫోన్ కాల్స్ : ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్ ఫోన్ నంబర్‌తో పాటు డివైస్ ఐడీని తెలుసుకోచ్చు. - స్టోరేజ్ సిస్టమ్ : యూఎస్బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్ వచ్చి చేరిపోవచ్చు. - మైక్రోఫోన్ : మైక్రోఫోన్ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది. - ఆడియో సెట్టింగ్స్ : స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ మారిపోతుంటాయి. కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం చేస్తుంటారు. -
డేటా చోరీ కేసు: కోడ్ లాంగ్వేజ్ వాడిన కీలక వ్యక్తి!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను చోరీ చేసిన ఐటీ గ్రిడ్స్, టీడీపీ సర్కార్ మహా పన్నాగం బట్టబయలు అయింది. తెలుగుదేశం పార్టీ సైబర్ కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపుకు సంబంధించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు వివరించారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్ కంపెనీ సర్వర్‌లో నిక్షిప్తమై ఉందని ఆయన తెలిపారు. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ ’సేవామిత్ర’ వాడుకుంటోందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారని, అతడు కోడ్ భాషలో మాట్లాడుతున్నాడని, ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆ కీలక వ్యక్తి ఎవరనేది త్వరలోనే తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ...‘ఆంధ్రప్రదేశ్‌లో సేవామిత్ర యాప్ ద్వారా సర్వే చేపడుతున్నారు. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ చాలామంది సర్వేయర్లను నియమించుకున్నారు. సర్వేలో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అన్నది తెలుసుకున్నారు. సర్వేయర్ల ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారం టీడీపీ బూత్ లెవల్ అధికారులకు వెళుతుంది. సేవామిత్ర వెబ్సైట్లో బూత్ కన్వీనర్లు, డ్యాష్ బోర్డు వివరాలున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారో సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలైన ఆధార్, ఓటర్ ఐడీ వివరాలు సేకరించారు. ఆ క్వశ్చనీర్లోనే ఎన్నికల సరళిపై సర్వే చేయడంతో పాటు, ఏ పార్టీకి ఓటేస్తారని ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. డేటా చోరీ, ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అందుకే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈ ఫిర్యాదుపై ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద ఐపీసీ 420,467,468,471,120బీ కింద కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుదారు వాంగ్మూలం తీసుకున్నాం. విజయవాడకు చెందిన కందుల రమేశ్, కందుల నాగమణికి ఓటర్ ఐడీ ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో వీరి పేర్లు గల్లంతయ్యాయి. వారి వివరాలు ఆన్లైన్ వెరిఫికేషన్‌లో రావడం లేదు. దశరథ రామిరెడ్డి ఫిర్యాదులో 2018 ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో 3వేల మంది మైనార్టి ఓటర్లను తీసేశారాని పేర్కొన్నారు. సైబారాబాద్ పోలీసులు ఇప్పటికే ఐటి గ్రిడ్స్ సంస్థపై విచారణ జరుపుతున్నారు. సైబారాబాద్ పోలీసులతో కలిపి విచారణ జరుపుతాం. ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తాం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అన్నది కనుక్కోవాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. ఇక సర్వర్ నుంచి డేటా ఇవ్వాల్సిన బాధ్యత గూగుల్, అమెజాన్ సంస్థలపై ఉంది. ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు ఇచ్చాం, త్వరలో సమాధానం వస్తుంది.’ అని సీపీ తెలిపారు. -
ఐటీగ్రిడ్స్ కేస్ : లుక్అవుట్ నోటీసు జారీ
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి వ్యవహారంలో ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఛైర్మన్ అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు బుధవారం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలను అలెర్ట్ చేశారు. ఈ కేసువ్యవహారంలో పోలీసులు మొదటిసారి ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు. ప్రధానంగా లాక్ చేసిన అత్యాధునిక కంప్యూటర్లలో ఉన్న డేటాను స్వాధీనం చేసుకోవడానికి ఎథికల్ హ్యాకర్లతో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పాస్వర్డ్ ప్రొటెక్టివ్‌గా ఉన్న ఆ కంప్యూటర్లను ఓపెన్ చేసిన ఎథికల్ హ్యాకర్లు వాటి నుంచి 40 జీబీ ప్రాసెస్డ్ డేటా ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏపీలో జరిగిన గత ఉప ఎన్నికల్లో సేవామిత్ర యాప్‌ను ట్రయల్ రన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ... టీడీపీకి చెందిన అధికారక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రజల ఓటర్ల ఆధార్ డాటాతో పాటు వ్యక్తిగత వివరాలును ఐటీ గ్రిడ్స్ యధేచ్ఛగా వాడుకుంది. దీంతో ఐటీ గ్రిడ్ కంపెనీ డాటా కుంభకోణంపై వైఎస్సార్ సీపీ నేత లోకేశ్వర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరపగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. చదవండి : అశోక్ ఐఫోనే అత్యంత కీలకం -
పచ్చ పన్నాగం
-
అడ్డంగా దొరికిపోయిన డేటా దొంగలు..
-
‘సేవామిత్ర’లో ప్రమాదకర ఫీచర్లు...
-
‘రియల్ టైమ్’తో కాజేశారు
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తానని, వారికి సంబంధించిన రహస్యాలను ఎవ్వరికీ తెలియనివ్వనని, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎవ్వరికీ వెల్లడించనని’’.. దైవసాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రమాణం అపహాస్యం పాలవుతోంది. అలాగే, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా మంత్రిగా చేసిన ప్రమాణాన్ని అటకెక్కించేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తలుగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఈ ఇద్దరు ఇప్పుడు దొంగలుగా మారిపోయారు. తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను వారే ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ఏర్పాటుచేయించిన ఐటి గ్రిడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఇప్పించేశారు. తమ ఐదేళ్ల పాలనపై తమకే నమ్మకం సడలడంతో రెండేళ్ల క్రితం నుంచే పెదబాబు, చినబాబులు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు స్కెచ్ వేశారు. (బ్లూ ఫ్రాగ్ దాగుడు‘మూత’లు) అందులో భాగంగానే ప్రజలకు సత్వరమే సేవలు అందించే ముసుగులో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పేరుతో సంస్థను ఏర్పాటుచేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజలందరి వ్యక్తిగత వివరాలను సేకరించారు. ప్రతీ పౌరుని పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆ కుటుంబానికి చెందిన వివరాలు, రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, పాన్/జీఎస్టీఎన్, స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ, కులం, ఆదాయం, విద్యార్థుల మార్కులు, వాహనాల వివరాలను సేకరించారు. ఆ వివరాలన్నింటితో పాటు వివిధ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని ఆర్టీజీఎస్ ద్వారా పీపుల్స్ హబ్ రూపొందించారు. వివిధ శాఖలకు చెందిన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సంబంధిత శాఖలు రాష్ట్రంలోని కుటుంబాల హబ్‌కు/పీపుల్స్ హబ్‌కు ఇవ్వాల్సిందిగా 2017 ఆగస్టు 31న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ జీవో–1 జారీ చేశారు. (అశోక్ ఐఫోనే అత్యంత కీలకం) సీఎస్ ఉత్తర్వులు బేఖాతరు.. ప్రభుత్వ సేవలు అందించడానికి, లబ్ధిదారుల ఎంపికకు పీపుల్స్ హబ్ డేటాను వినియోగించుకోవాలని ఆ జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఏ కుటుంబాల వివరాలైనా పీపుల్స్ హబ్‌లో లేకపోతే వెంటనే వారి వివరాలను సేకరించి హబ్‌లో నిక్షిప్తం చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. అయితే, రాష్ట్రంలోని లబ్ధిదారుల వ్యక్తిగత సమాచారాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దని స్పష్టంచేస్తూ.. ఆధార్, ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాల వివరాలు, సామాజిక డేటాను ఏ శాఖ కూడా వెబ్ పోర్టల్స్‌లో ఉంచరాదని, ఎవ్వరికీ ఆ వివరాలు ఇవ్వడంగానీ పంచుకోవడంగానీ చేయరాదన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే 2016 ఆధార్ చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారని సీఎస్ ఆ జీవోలో స్పష్టంచేశారు. (సర్వం దోచేశారు) డేటా చోర్.. పెదబాబు, చినబాబు ఇదిలా ఉంటే.. ఆర్టీజీఎస్కు రాష్ట్రంలోని కుటుంబాల వివరాలను ఇప్పించిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు అదే ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రానికి చెందిన కుటుంబాల సమస్త సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ కోసం సేవామిత్ర యాప్ రూపకల్పనకు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చేశారు. ఈ డేటా ఆధారంగానే ఇప్పుడు సర్వేలు చేస్తూ తన పార్టీకి ఓట్లు వేయని వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఆన్లైన్లో లక్షల్లో ఫాం–7లను సమర్పిస్తున్నారు. (చంద్రబాబు, లోకేశ్ డైరెక్షన్లో క్యాష్ ఫర్ ట్వీట్!) ఆదిలోనే ప్రత్యేక సైన్యం ఏర్పాటు.. కాగా, ఎంతో ముందు చూపుతో ఏర్పాటైన ఆర్టీజీఎస్లో చినబాబు తన సైన్యాన్ని నింపేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం కింద అందులో పెద్దఎత్తున నియామకాలను చేపట్టేశారు. ఈ నియామకాల్లో ఎక్కడా రిజర్వేషన్లు పాటించలేదు. సోషల్ మీడియాతో పాటు వివిధ రంగాల నిపుణులను నియమించారు. వారికి భారీఎత్తున వేతనాలను ఇస్తున్నారు. ఆర్టీజీఎస్లో డేటా మైనింగ్, డేటా ఎనలైటిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్, క్రౌడ్ సోర్సింగ్ కో–ఆర్డినేషన్, సోషల్ మీడియా, కాల్ సెంటర్, ఈవెంట్ అండ్ ఇన్సిడెంట్ మానిటరింగ్, సోషల్ మీడియా బృందం, కమాండ్ అండ్ కంట్రోల్ వంటి విభాగాలను ఏర్పాటుచేశారు. ఏటా బడ్జెట్లో దీని నిర్వహణకు రూ.165 కోట్లు కేటాయిస్తున్నారు. ఇంత పెద్ద యంత్రాంగంతో నడుస్తున్న ఈ ఆర్టీజీఎస్‌లోని సమాచారాన్ని ఇప్పుడు పెదబాబు, చినబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి పార్టీ సేవామిత్ర యాప్‌కు బదిలీ చేయించేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఆయన కుమారుడే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ యాప్‌కు బదిలీచేస్తే ఇక ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికా రి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఈ డేటా స్కామ్‌కు ఎవరు బాధ్యత వహిస్తారనే విషయం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీచేసిన జీవోను ఉల్లంఘించినందున ఆర్టీజీఎస్, ఇ–ప్రగతి బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారులు బాధ్యత వహిస్తారా లేదా సీఎస్ బాధ్యత వహిస్తారా లేదా సీఎం, ఐటీ శాఖ మంత్రి బాధ్యత వహిస్తారనే దానిపై చర్చ సాగుతోంది. -
సర్వం దోచేశారు
మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే చంద్రన్న బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారా? ‘ఆరోగ్య రక్ష’ కింద ఆసుపత్రిలో చేరారా? అయితే మీ వివరాలన్నీ ప్రభుత్వం వద్దే కాదు.. టీడీపీ ‘సేవా మిత్ర’ యాప్‌లోనూ ఉన్నాయి. మీ పేరు, చిరునామా, ఫొటో, ఆధార్ నంబర్, సామాజికవర్గం, ఏ పార్టీ మద్దతుదారులో సేవామిత్ర చెప్పేస్తుంది. ఇవే కాదు... మీ వ్యక్తిగత సమాచారం కూడా దేశ సరిహద్దులు దాటేసింది. ప్రభుత్వ అధీనంలో ఉండాల్సిన పౌరుల సమాచారం టీడీపీ తన రాజకీయ క్రీడకు ఉపయోగించుకుంటోంది. ఇవన్నీ ఎవరో ఆకాశరామన్న చెబుతున్న అంశాలు కావు. సాక్షాత్తూ తెలంగాణ సైబర్ పోలీసులతోపాటు, ఐటీ నిపుణులు వెల్లడిస్తున్న పచ్చి నిజాలు. చంద్రబాబు, లోకేశ్ అండ్ కో కనుసన్నల్లో ‘ఐటీ గ్రిడ్స్’ రూపొందించిన సేవామిత్ర యాప్ ముసుగులో జరిగిన కుతంత్రాలివి. ఒపీనియన్ సర్వే వివరాలతో ‘సేవామిత్ర’లో టీడీపీ మద్దతుదారులు, ఇతరులను వర్గీకరిస్తూ ‘పచ్చ’నేతలు సాగించిన కుట్రలివి. సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమాచార సేకరణలో ఐటీ చట్టాలను తుంగలో తొక్కింది. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన యాప్ కావడంతో ప్రభుత్వ వెబ్సైట్లలోని డేటాను యథేచ్ఛగా దోచేసింది. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ డాకవరం కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను పణంగా పెట్టి టీడీపీ ఈ యాప్ తయారీని ప్రోత్సహించిన తీరు బయట పడుతోంది. ‘సేవామిత్ర’ యాప్‌లో పౌరుల ఆధార్ వివరాలతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వివిధ కేటగిరీలకు చెందిన ఓటర్ల వివరాలు, పార్టీలతో వారికున్న అనుబంధం మొదలైన వాటిని పొందుపరిచారు. (‘రియల్ టైమ్’తో కాజేశారు) నియోజకవర్గాలవారీగా ఓటర్ల వివరాలతోపాటు ప్రతి ఓటరు ఏ పార్టీతో అను బంధం కలిగి ఉన్నాడో తెలిపే వివరాలు యాప్‌లో ఉన్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన లేదా తటస్తులా అనే విషయంతోపాటు ఓటరు ఐడీలు, కులం, చిరునామా.. ఇలా ఓటరుకు సంబంధించిన పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరిచినట్లు సమాచారం. ఏపీ పౌరులకు సంబంధించిన గరిష్ట సమాచారాన్ని సేకరించడం లక్ష్యంగా తయారు చేసిన ఈ యాప్‌పై ఐటీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పదేళ్లకోసారి జరిగే జనాభా గణన సందర్భంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో సమాచారం సేకరించడం సా«ధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ సమాచారం బయటకు పొక్కితే ఇతర అక్రమాలకు ఉపయోగించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. థర్డ్ పార్టీ వద్ద డేటాను నిలువ చేయడం ద్వారా డేటా తస్కరణతోపాటు హ్యాకింగ్‌కు కూడా దారి తీసే అవకాశం ఉంది. (అశోక్ ఐఫోనే అత్యంత కీలకం) ‘సేవామిత్ర’కు ఎస్ఆర్డీహెచ్ డేటా... వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరచడంలో భాగంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) కోసం స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్ నంబర్ సహా ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లో నిల్వ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లోని డేటాను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఈ డేటాను ‘సేవామిత్ర’యాప్ రూపకల్పనలో ఉపయోగించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు రూలింగ్‌ను ఉల్లంఘించిన ‘ఐటీ గ్రిడ్స్’ ఆధార్‌తో అనుసంధానించిన పౌరుల వ్యక్తిగత సమాచారంతోపాటు ఓటర్ల జాబితా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వంటి వివరాలను సేకరించిన ఐటీ గ్రిడ్స్.. ‘ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్’కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఉల్లంఘించింది. వివిధ పద్ధతుల్లో సేకరించిన డేటాను దేశం బయట ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)లో నిల్వ చేసి యాప్ నిర్వహణకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమెజాన్ అనుబంధ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ కంప్యూటింగ్ వేదికగా వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలకు డేటా సేవలు అందిస్తున్న నేపథ్యంలో సేవామిత్ర యాప్ వివరాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ పోలీసులు ఏడబ్ల్యూఎస్‌కు లేఖ రాశారు. అలాగే ఆధార్ నంబర్ల దుర్వినియోగానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా యూఐడీఏఐతోపాటు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘సేవామిత్ర’లో ప్రమాదకర ఫీచర్లు... ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన సేవామిత్ర యాప్‌లో అనేక ప్రమాదకర ఫీచర్లు ఉన్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు వినియోగదారులు ఎక్కడ ఉన్నదీ (యూజర్ లొకేషన్) తెలుసుకోవచ్చు. ఫోన్ స్టేటస్‌తోపాటు అందులోని ఫొటోలు, ఫైల్స్, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. యూఎస్బీ స్టోరేజీ ఫైల్ సిస్టమ్‌లోని సమాచారాన్ని కూడా తెలుసుకోవడంతోపాటు అందులోని సమాచారాన్ని మార్పిడి చేయడం లేదా తొలగించే సామర్ధ్యం కూడా ఈ యాప్‌కు ఉంది. ఆడియో రికార్డుతోపాటు వైఫై కనెక్షన్ల వివరాలు, ఇంటర్నెట్ ద్వారా డేటా తస్కరణ, నెట్వర్క్ కనెక్షన్లు, బ్లూటూత్ ద్వారా అనుసంధానం, ఆడియో సెట్టింగ్‌లను కూడా మార్చడం వంటివి ఈ యాప్ ద్వారా చేయొచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు. చోరీ బయట పడకుండా యాప్ డేటా సవరణ.... ఏపీ ప్రభుత్వ డేటా తస్కరణకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు గత నెల 21న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ అశోక్ డాకవరంను ప్రాథమికంగా విచారించారు. దీంతో అప్రమత్తమైన ఐటీ గ్రిడ్స్ ‘సేవామిత్ర’యాప్‌లోని సమాచారాన్ని గత నెల 27న కొంత మేర తొలగించడమో లేదా సవరించడమో చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ చట్టం నిబంధనలకు అనుగుణంగానే యాప్ డేటా ఉందనే అభిప్రాయం కలిగేలా ఓటర్ల కలర్ ఫొటోలు, లబ్ధిదారుల సమాచారం, ఓటరు డేటాను సవరించినట్లు గుర్తించారు. ఆ తర్వాత సంస్థ డైరక్టర్ అశోక్ పోలీసులకు అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు పౌరుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన సమాచారాన్ని యాప్‌లో ఉపయోగించడంపై మాదాపూర్ పోలీసులు ఈ నెల 2న ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల నేరపూరిత కుట్ర, చోరీ వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. మార్చి 2, 3 తేదీల్లో సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేసి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, హార్డ్ డిస్క్‌లతోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించారు. తొలగించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ విధానం ద్వారా ప్రయత్నిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు కొంత పురోగతి సాధించారు. అదే సమయంలో వివిధ ప్రభుత్వ వెబ్సైట్లకు ఐటీ సేవలు అందిస్తున్న విశాఖకు చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎస్ఆర్డీహెచ్ సమాచారాన్ని బ్లూఫ్రాగ్ టెక్నాలజీస్ సమాచారాన్ని బదిలీ చేసిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ‘ఒపీనియన్ సర్వే’తో ఓట్లకు ఎసరు... ఒపీనియన్ సర్వే, గ్రూప్ సర్వే పేరిట అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సుమారు 500 మంది బృందంతో ట్యాబ్‌ల ద్వారా ఓటర్ల వివరాలు సేకరించారు. సుమారు 80 అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించి ఓటర్ల వ్యక్తిగత వివరాలతోపాటు వారి రాజకీయ ప్రాధాన్యతలు, స్థానిక సమస్యలు, రాజకీయంగా ప్రభావితం చేసే వర్గాలు, గత ఎన్నికల్లో వివిధ పార్టీల గెలుపోటములకు గల కారణాలు తదితరాలపై సమాచారం తీసుకున్నారు. ఈ సమాచారాన్ని హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ సంస్థ క్రోడీకరించింది. ఈ డేటా విశ్లేషణ ఆధారంగా టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన తదితర పార్టీల మద్దతుదారులు, తటస్థులపై అంచనాకు వచ్చారు. డేటాను క్షేత్రస్థాయి టీడీపీ నాయకులకు అప్పగించి తటస్థులు, టీడీపీ పాలనపై వ్యతిరేకతతో ఉన్న వారిని తమ వైపు మరల్చడం లేదా ఓటరు జాబితాలో వారి పేర్లను తొలగించేలా కుట్ర పన్నారు. లక్షలాది ఓట్లు తొలగించేలా కుట్ర... ఏపీలో సుమారు 3.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఓటరు జాబితా సవరణలో భాగంగా కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఓట్ల తొలగింపు కోరుతూ 13.16 లక్షల దరఖాస్తులు అందాయి. అంటే మొత్తం ఓటర్లలో సుమారు 3.7 శాతం మంది ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీగా ఓట్ల తొలగింపు కోరుతూ దరఖాస్తులు అందడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్ ఆధారంగా ఓట్ల తొలగింపు కోరుతూ అందిన దరఖాస్తులపై విచారణ జరపాలని జిల్లా ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఫిర్యాదులు చేయగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఏపీవ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఓట్ల తొలగింపు కోసం ఉపయోగించే ఫారం–7 ద్వారా ఆన్లైన్ విధానంలో ఒక్కో మండలంలో సుమారు 1,000 నుంచి 1500 ఓట్ల తొలగింపు దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఐటీ గ్రిడ్స్ క్రోడీకరించిన సమాచారం ఆ«ధారంగానే ఓట్ల తొలగింపునకు తెరలేచినట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాష్ ఫర్ ట్వీట్‌తో తంటాలు... ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ ఊపందుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ కొత్త పల్లవి అందుకున్నారు. ‘తెలుగుదేశం పార్టీ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసి వైఎస్సార్సీపీకి అందజేసింది’అంటూ ఉల్టా ప్రచారం ప్రారంభించారు. పోలీసు విచారణకు హాజరై కడిగిన ముత్యంలా బయటకు రావాలని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. చంద్రబాబు, లోకేశ్‌కు హితవు పలికినా గోబెల్స్ ప్రచారంలో సిద్ధహస్తులైన చంద్రబాబు, లోకేశ్ మాత్రం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైఎస్ జగన్‌పై ‘క్యాష్ ఫర్ ట్వీట్’కు తెరలేపారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంతో సంబంధంలేని రాష్ట్రేతర వ్యక్తులతో ట్వీట్లు చేయిస్తూ ఇతరులపై బురద చల్లడంలో నిమగ్నమయ్యారు. -
‘ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ మా దగ్గరే ఉన్నాడు’
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ తమ దగ్గరే ఉన్నట్లు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇంఛార్జ్ మల్యాద్రి పేర్కొన్నారు. ఇప్పటికే అశోక్‌కు సైబరాబాద్ పోలీసులు 161 సీఆర్పీసీ కింద నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అయితే అశోక్ తమ దగ్గరే ఉన్నారని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మల్యాద్రి వెల్లడించారు. అశోక్‌తో తాము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నామన్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులకు అశోక్‌ను అప్పగించబోమని అన్నారు. కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేయడంతో ఐటీ గ్రిడ్ స్కామ్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్.. తమ ఉద్యోగులు కనిపించడంలేదంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. చదవండి : ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్‌కు నోటీసులు -
అదో ‘బ్లాక్మెయిల్’ యాప్
సాక్షి, అమరావతి: ‘సేవా మిత్ర’ టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌ను ఒక్కసారి మొబైల్ ఫోన్ లేదా డెస్క్టాప్పై డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని సాఫ్ట్వేర్ నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న మరుక్షణం నుంచి ఫోన్ కంట్రోల్ యాప్ అభివృద్ధి చేసిన ఐటి గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్ ఎక్కడ ఉందన్న విషయంతో పాటు ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డు చేస్తారు. చివరకు ఫోన్లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంకు ఖాతాల వివరాలను అన్నీ వారు యధేచ్ఛగా చూడటమే కాకుండా, అవసరమైతే మీకు తెలియకుండానే వారు డిలీట్ చేస్తారు. ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి, ఎస్డీ కార్డులో ఉన్న డేటాను వినియోగించి యజమానుల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చని నిపుణులతో పాటు పోలీసులుకూడా హెచ్చరిస్తున్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) సేవామిత్ర యాప్ తీసుకునే అనుమతులు, వాటి పర్యవసానాలు.. అప్రాక్సిమేట్, ప్రిసైజ్ లోకేషన్: ఈ అనుమతి ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే లోకేషన్ సర్వీస్ ఆన్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఫోన్ కాల్స్: ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్ ఫోన్ నంబర్‌తో పాటు డివైస్ ఐడీని తెలుసుకోచ్చు. స్టోరేజ్ సిస్టమ్: యూఎస్బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్ వచ్చి చేరిపోవచ్చు. మైక్రోఫోన్: మైక్రోఫోన్ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది. ఆడియో సెట్టింగ్స్: స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ మారిపోతుంటాయి. కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం చేస్తుంటారు. -
అంతా పథకం ప్రకారమే!
సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకుల్ని రక్షించేందుకు యత్నిస్తున్నారా? కేసు నమోదుకు 4 రోజులు ముందే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, గుంటూరు నుంచి ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు కేవలం 3 గంటల్లో చేరుకోవడం, అశోక్ ఏపీకి పారిపోయాడంటూ ప్రచారం జరగడం చూస్తుంటే.. ఈ కేసుకు ఓటుకు కోట్లు కేసుతో చాలా సారూప్యతలు కనిపిస్తున్నాయి. ముందే పసిగట్టారా? కొంతకాలంగా సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్రిడ్స్ నిర్వాహకులు ముందు జాగ్రత్తపడ్డారు. కేసు నమోదు కావ డానికి సరిగ్గా 4 రోజుల ముందు అంటే.. ఫిబ్రవరి 27న సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా అప్డేట్ చేశారు. వ్యక్తిగత సమాచారం సేకరణకు సంబంధించిన అంశాలను తొలగించిందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి దండిగా సహాయ సహకారాలు అందుతున్నాయని బాహాటంగానే అర్థమవుతోంది. భాస్కర్ కనిపించడం లేదం టూ గుంటూరు జిల్లా పెదకాకానిలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు కేసు నమోదైంది. కానీ, మాదాపూర్‌లో ఏపీ పోలీసులు రాత్రి 8.30గంటలకు ప్రత్యక్షమయ్యారు. పెదకాకాని నుంచి హైదరాబాద్‌కు దాదాపు 300 కి.మీ. దూరం. గంటకు 100 కి.మీ. స్పీడుతో ప్రయాణించినా కేవలం 3 గంటల్లో చేరుకోవడం అసాధ్యం. విమానం ద్వారా వచ్చారనుకున్నా.. హైదరాబాద్ ట్రాఫిక్‌లో అంత తక్కువసమయంలో చేరుకోవడం సాధ్యంకాదు. అంటే.. కేసు నమోదుకు ముందే ఓ బృందం హైదరాబాద్‌కు బయల్దేరి ఉంటుందని సైబరాబాద్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగులను పోలీసులమని చెప్పుకుంటున్న వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారంటూ సంస్థ డైరెక్టర్ అశోక్ హైకోర్టును ఆశ్రయించడం కూడా ప«థకంలో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పడంతో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ పాచిక పారనట్లయింది. ఎవరా అధికారి? తెలంగాణలో సైబర్ క్రైమ్‌లో ఉన్నత స్థానంలో పనిచేసి ప్రస్తుతం ఏపీలో ఉన్న అధికారి ఒకరికి ఈ కేసులో సంబంధం ఉందన్న విషయం కూడా కలకలం రేపుతోంది. ఈ లెక్కన ఈ కేసు వెనుక కేవలం రాజకీయ నాయకులే కాదు, అధికారుల అండదండలు కూడా ఉన్నాయన్న అనుమానంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హార్డ్ డిస్కులను డీకోడ్ చేయడం ప్రారంభించిన అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. మత్తయ్య దారిలోనే అశోక్... గతంలో ఓటుకు కోట్లు కేసు తరహాలోనే ఈ కేసు కూడా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ కేసులో నిందితుడు మత్తయ్య విజయవాడకు పరారవడం, తరువాత ఆయన ఫిర్యాదు మేరకు తెలంగాణ సీఎంపై కేసు నమోదు చేయడం ఆగమేఘాల మీద జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అశోక్ తెలంగాణ పోలీసుల నోటీసులకు ఇంతవరకూ స్పందించలేదు. అంతేకాదు అశోక్ ఏపీలోనే ఉన్నాడంటూ మీడియాలో ప్రచారం జరగడం కూడా కలకలం రేపుతోంది. పైగా కేసును తెలంగాణ పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తతంగమంతా చూస్తుంటే.. ఈ కేసులో నిందితులకు ఏపీలో అధికార టీడీపీ నుంచి అండదండలు దండిగా ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు
ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తు కోసం కేవలం మూడున్నర గంటల్లో డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇంత దూరం రావడం ఇదే తొలిసారి. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి, నైతికంగా దెబ్బతీయడానికి ఏపీ టీడీపీ నాయకులు, మంత్రులు, పోలీసులు సోషల్ మీడియా వేదికగా, మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించిన ఏపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు, నేతలు, నాయకులు చేస్తున్న ట్వీట్లు, ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. – సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల డేటా కుంభకోణం విషయలో.. ఏపీ ప్రభుత్వం పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ కేంద్రంగా జరిగిన ఈ భారీ డాటా కుంభకోణం వెనక ఎవరున్నా ఉపేక్షించేది లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైతే అక్కడి మంత్రులు, అధికారులకూ నోటీసులు జారీచేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని, ఫిర్యాదుదారుడు లోకేశ్వర రెడ్డిపై వారి ప్రవర్తనకు సంబంధించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమికంగా డేటా చోరీ అయినట్లు కేసు నమోదు చేసినా.. ప్రభుత్వంతో ఉన్న అవగాహన ఒప్పందం నేపథ్యంలోనే ఈ సమాచారమంతా ఐటీ గ్రిడ్స్‌కు చేరిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు ఆయన పలు అంశాలు వెల్లడించారు. డేటా ఎనలిస్ట్ లోకేశ్వరరెడ్డి.. ‘సేవా మిత్ర’ అనే యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ తీరుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆఫీసులో ఉన్న ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ సమక్షంలో.. వారికి అవసరమైన నోటీసులు జారీ చేసే అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐబాల్, డెల్ సీపీయూ, జెబ్రానిక్స్ సీపీయూలు రెండు, ఎం–క్యాబ్ సర్వీసెస్‌లను సీజ్ చేశారు. ‘సేవా మిత్ర’ పేరుతో.. ప్రాథమికంగా విశ్లేషించిన అంశాల ప్రకారం ఏపీ ఓటర్లకు చెందిన డాటా కలర్ ఫొటోలతో ఐటీ గ్రిడ్ వద్ద అందుబాటులో ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం నిర్వహిస్తున్న ‘సేవా మిత్ర’యాప్ కోసం ఈ డాటా వినియోగించారు. దీంతో పాటు ఆధార్, ప్రభుత్వ లబ్ధిదారులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల వివరాలు అందులో పొందుపరిచారు. ఈ యాప్‌ను వినియోగిస్తున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్, స్థానికులు ఏ పార్టీ సానుభూతిపరుల అనేది గుర్తిస్తున్నారు. ఆయా వ్యక్తులు ఏ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనే అంశాన్నీ తెలుసుకుంటున్నారు. ఏపీలో ఓటర్ల తొలగింపు అక్రమాలపై అక్కడ 40–50 కేసులు నమోదయ్యాయి. వీటి వెనక ఈ సేవామిత్ర యాప్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. అసలు రహస్య, వ్యక్తిగత డాటాలు ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా చేరాయి? వీరెందుకు ఆ వివరాలను తమ వద్ద ఉంచుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా అవసరమైన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం, ఆధార్ వివరాలు నిర్వహించే యూఐడీఏఐ సంస్థలకూ లేఖలు రాయనున్నారు. ఐటీ గ్రిడ్‌కు సాంకేతిక సేవలు అందిస్తున్న అమేజాన్ వెబ్ సంస్థకూ నోటీసులు జారీ అయ్యాయి. అజ్ఞాతంలో అశోక్ ఐటీ గ్రిడ్ కేసులో పోలీసులు విచారణకు రావాలని కోరితో నిరాకరించిన ఆ సంస్థ డైరెక్టర్ అశోక్.. సైబరాబాద్ పోలీసులపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో అనేక అవాస్తవాలు, నిరాధార ఆరోపణలు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అవసరమైతే అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్రపై అనుమానాలు వచ్చినా విచారణకు పిలిపించాలని భావిస్తున్నారు. అవసరమైతే ఏపీ ప్రభుత్వానికి అక్కడి అధికారులకు కూడా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఐటీ గ్రిడ్ సంస్థ తమ కంప్యూటర్లు, సర్వర్ నుంచి కొంత డాటా తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏదైనా జరిగినా పూర్తి డాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ రిట్రీవ్ చేస్తామని సైబరాబాద్ అధికారులు చెప్తున్నారు. ఏపీ పోలీసుల అత్యుత్సాహం ఐటీ గ్రిడ్ ఉద్యోగి భాస్కర్‌కు సైబరాబాద్ పోలీసులు నిబంధనల ప్రకారం అవసరమైన నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆయన సమక్షంలో సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తును అడ్డుకోవడానికి, అడ్డంకులు సృష్టించడానికి ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. భాస్కర్ అదృశ్యమయ్యారంటూ శనివారం సాయంత్రం 5.30 గంటలకు పెదకాకాని పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తు కోసం ఏకంగా ఓ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లతో కూడిన బృందం రాత్రి 9 గంటలకల్లా హైదరాబాద్ చేరుకుంది. మాదాపూర్ పోలీసుస్టేషన్‌కు వచ్చి భాస్కర్ అప్పగించాలని ఒత్తిడి చేసింది. దీనికి సైబరాబాద్ పోలీసులు ససేమిరా అనడంతో వెనుతిరిగింది. భాస్కర్ ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయన కుటుంబీకులపై ఒత్తిడి తెస్తూ వాంగ్మూలాలను నమోదు చేసుకోవాలని చూశారు. ఆదివారం ఉదయం ఏపీ పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటిపై దాడి చేశారు. అక్రమంగా ఆయన ఇంట్లో జోరపడటంతో పాటు ఫిర్యాదు చేయడంపై తీవ్రంగా బెదిరించారు. దీనిపై లోకేశ్వర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్వరరెడ్డి ఫిర్యాదుతో సోమవారం కేపీహెచ్‌బీ పోలీసులు.. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, బెదిరించడం ఆరోపణలపై ‘గుర్తుతెలియని నిందితులపై’కేసు నమోదు చేశారు. ‘ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తు కోసం కేవలం మూడున్నర గంటల్లో డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇంత దూరం రావడం ఇదే తొలిసారి’అని సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి, నైతికంగా దెబ్బతీయడానికి ఏపీ టీడీపీ నాయకులు, మంత్రులు, పోలీసులు సోషల్‌మీడియా వేదికగా, మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించిన ఏపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు, నేతలు, నాయకులు చేస్తున్న ట్వీట్స్, ఆరోపణల్నీ పరిగణలోకి తీసుకుంటున్నామని, అవసమైతే వీటి పైనా చర్యలు ఉంటాయని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపులోనూ ఐటీ గ్రిడ్ పాత్ర ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా తొలగింపు వెనుక ఐటీ గ్రిడ్ పాత్ర ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో అశోక్ వాంగ్మూలం కీలకం. ఆయన వచ్చి లొంగిపోయి, సమాచారం ఇవ్వకుంటే అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ డాటాను ఐటీ గ్రిడ్ చోరీ చేసిందా? లేక ఏపీ ప్రభుత్వం, అధికారులు ఇచ్చారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ డాటా మొత్తం ఆంధ్రా వాళ్లది అయినప్పటికీ దుర్వినియోగం జరిగింది సైబరాబాద్‌లో. ఈ నేపథ్యంలోనే ఈ కేసును తామే దర్యాప్తు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును రెండు రోజులుగా అశోక్ అడ్డుకుంటున్నారు. కేసు దర్యాప్తు కోసం సైబరాబాద్ పోలీసులు నాలుగు టీమ్స్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఏసీపీ నేతృత్వంలో స్థానిక, సైబర్‌క్రైమ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ నుంచి వివరాల సేకరణకు యత్నం ఐటీ గ్రిడ్‌లో సోదాల కోసం సైబరాబాద్ పోలీసులకు సహకరించిన ఆ సంస్థ ఉద్యోగి భాస్కర్‌ను ఏపీ పోలీసులు సోమవారం ప్రశ్నించారు. ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడకు చేరుకున్న ఏపీ పోలీసులు.. సైబరాబాద్ అధికారుల దర్యాప్తు విధానం, అడిగిన ప్రశ్నలు, తెలుసుకున్న వివరాలు ఏంటని ఆరా తీశారు. భాస్కర్‌ను అడిగి కొన్ని ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మా దర్యాప్తులో వేలు పెట్టొద్దం’టూ సజ్జనార్ ఏపీ పోలీసులకు స్పష్టం చేశారు. ఈ విషయంపై అక్కడి డీజీపీకి లేఖ రాస్తామన్నారు. ఏపీ ప్రజలు, ఓటర్లకు చెందిన వ్యక్తిగత, సున్నిత డాటా ఐటీ గ్రిడ్‌కు చేరడంపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ గ్రిడ్‌కు వైజాగ్‌కు చెందిన బ్లూఫ్రాగ్ సంస్థకు ఉన్న సంబంధాలను సైతం ఆరా తీయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. అసలు ఐటీ గ్రిడ్ సంస్థ ఎలా ఏర్పాటైంది? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఎప్పటి నుంచి పని చేస్తోందనే తదితర వివరాలు కోరుతూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సైబరాబాద్ పోలీసులు లేఖ రాయనున్నారు. చదవండి: తెలుగు ‘జోకర్‌బర్గ్’ డేటా చౌర్యం! డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్! -
ఏపీలో ‘దొంగల రాజ్యం’!
ప్రాచీన చైనా యుద్ధ నిపుణుడు సన్ జూ శత్రువును గెలవడం ఎలాగో ‘యుద్ధ కళ’ అనే గ్రంథంలో వివరించాడు. శత్రువును గందరగోళ పరచడంలోనే విజయ రహస్యమంతా ఇమిడి ఉన్నదని, అలా గందరగోళపరిస్తే మన అసలు ఉద్దేశం గ్రహించలేని దుస్థితిలో శత్రువు పడతాడని అంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తన జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారం దక్కే అవకాశం లేదని చాన్నాళ్లక్రితమే స్పష్టంగా అర్ధమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్ జూ చెప్పిన ఈ సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకు న్నారు. దాన్నే నమ్ముకుని రకరకాల టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తున్నారు. బీజేపీపై ‘నకిలీ యుద్ధ భేరి’ మోగించి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ధర్మపోరాట దీక్షలు సాగిస్తు న్నారు. తనను ఓడించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిలు ఒక్కటయ్యారంటూ ఎక్కడలేని హడావుడీ చేస్తున్నారు. ఇవన్నీ జనం దృష్టి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఇదే సమయంలో ఆయన ‘సందట్లో సడేమియా’గా ఆంధ్రప్రదేశ్‌లోని మూడున్నర కోట్లమంది ఓటర్ల వ్యక్తిగత సమా చారం మొత్తాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టారు. ఈ డేటాను కులాలవారీగా, మతాలవారీగా వర్గీకరించి... పోలింగ్ కేంద్రాలవారీగా విభజించి... వారిలో లబ్ధిదారులెవరో, కానివారెవరో తేల్చి.. వారు ఎవరికి ఓటేసే అవకాశమున్నదో అంచనా వేయడం ఆ సంస్థల పని. దాని సాయంతో వ్యతిరేకులని భావించినవారిని బెదిరించి దారికి తెచ్చుకోవడం లేదా వారి ఓట్లను తొలగించడం తెలుగుదేశం ఆంతర్యం. ఈ డేటా తెలుగుదేశం కార్యకర్తల ఫోన్లలో ‘సేవామిత్ర’ యాప్ కింద లభ్య మయ్యే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వ్యక్తిగత సమాచారం సమస్తం తెలుగుదేశం గుప్పెట్లోకి పోయింది. కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితా అన్యుల చేతుల్లోకి పోవడమే కాక, ఆ జాబితాను ఆధార్ డేటాతో అనుసంధానించడంతో ఓటర్ల బ్యాంకు ఖాతాల లావాదేవీలు, వారి ఆస్తులు, అప్పుల వివరాలు సైతం ఇప్పుడు బజార్నపడ్డాయి. ఇటీవల నైజీరియా తదితర దేశాల ముఠాలు మన పౌరుల వ్యక్తి గత డేటా చౌర్యం చేసి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును సునాయాసంగా ఖాళీ చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఈ డేటా చౌర్యం పర్యవసానంగా ఇదంతా ‘జాతీయం’ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎన్టీ రామారావు నుంచి అధికారం గుంజుకున్న నాటినుంచీ బాబు ఇలాంటి పోకడలకే పోతు న్నారు. తన అధికారానికి అడ్డొస్తారని లేదా ముప్పు తెస్తారని భావించినవారిని ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా చూడరు. శత్రువులుగా పరిగణిస్తారు. అది మొదలుకొని వారిని అణగదొక్కడానికి ఏం చేయాలో వ్యూహం రచిస్తారు. ఏడేళ్లక్రితం జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కయి సీబీఐతో తప్పుడు కేసులు బనాయించడమైనా... గత అక్టోబర్‌లో విశాఖ విమా నాశ్రయంలో జగన్ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడమైనా గమనిస్తే ఇదంతా అర్ధమ వుతుంది. దొంగే ‘దొంగ.. దొంగ’ అని అరిచినప్పుడు అసలు దొంగ ఎవరో అందరూ తెలుసుకోవడానికి కాస్త సమయం పడు తుంది. కన్నంలో దొంగ కన్నంలోనే పట్టుబడినప్పుడు అలాంటి గందరగోళానికి ఆస్కారం ఉండదు. కానీ అలా పట్టుబడినా బాబు ప్రజానీకాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. తన అనుకూల మీడియా సాయంతో ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు కుమ్మరించి ప్రజల్ని పక్కదోవ పట్టించేం దుకు చూస్తారు. గతంలో ‘ఓటుకు కోట్లు’ కేసు సందర్భంగా ఈ పనే చేశారు. ఇప్పుడు టీడీపీ ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర జరుగుతోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి టీడీపీ అక్రమాల నిడివెంతో, లోతెంతో మొదట్లో చాలా మందికి అవగాహన కాలేదు. తమ వ్యతిరేకుల ఓట్లు తొల గించడానికే చంద్రబాబు అండ్ కో ఇదంతా చేస్తున్నారని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ పలు మార్గాల్లో లక్షల సంఖ్యలో దొంగ ఓటర్లను కూడా సృష్టిస్తున్నారని తెలిసి ఆశ్చర్య పోయారు. ఈ అక్రమాలపై గత నెల 5న జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి సవివరమైన వినతిపత్రం సమర్పించింది. కానీ తాజాగా బద్దలైన స్కాం గమనిస్తే ఎలాంటివారైనా గుండెలు బాదుకోవాల్సిందే. తెలుగుదేశం చేసిన ఘనకార్యంతో మూడున్నర కోట్లమంది బ్యాంకు ఖాతాలు ప్రమాదంలో పడ్డాయి. వారు పాస్వర్డ్లు మార్చుకుంటే తప్ప వారి సొమ్ముకు గ్యారెంటీ లేని దుస్థితి ఏర్పడింది. మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్లు... హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్ కంపెనీ చేసిన డేటా చౌర్యం గురించి ఆరా తీస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో సోమవారం జరిగిన సభలో చంద్ర బాబు తలా తోకా లేకుండా మాట్లాడిన తీరు చూస్తే ఆయనా, ఆయన పుత్రరత్నం లోకేష్ ఈ వ్యవహారంలో ఎంతగా కూరుకుపోయారో అర్ధమవుతుంది. చేసిన పనికి సరైన సంజాయిషీ ఇవ్వ కుండా ‘మూలాలు పెకిలిస్తా’, ‘తోకలు కత్తిరిస్తా’, ‘ఎక్కడా తిరగనివ్వను’, ‘ఖబడ్దార్ జాగ్రత్త’ వంటి బెదిరింపులతో దీన్నుంచి బయటపడదామని బాబు వృధా ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌కు ఏపీ పోలీసులను పంపి హడలెత్తించాలని చూస్తున్నారు. సామాజిక కార్యకర్త లోకేశ్వరరెడ్డి ఇంతటి భారీ స్కాంను బయటపెట్టి ప్రజానీకానికి ఎంతో మేలు చేశారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి కారకులెంతటివారైనా పకడ్బందీ కేసులు పెట్టి తగిన శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులపై ఉంది. అలాగే ఇంతవరకూ ఈ వ్యవహారంపై మౌనంగా ఉండిపోయిన ఎన్నికల సంఘం, ఆధార్ ప్రాధికార సంస్థలు సైతం నోరు విప్పి తమ వంతు చర్యలేమిటో చెప్పాలి. దేశంలో ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థలపైనా ఉంది. -
తెలుగు ‘జోకర్‌బర్గ్’ డేటా చౌర్యం!
‘తెలుగుదేశం’ ప్రభుత్వం సోషల్ మీడియాను మాధ్యమం చేసుకుని ప్రత్యర్థులకు చెందిన ఓటర్లకు టోపీ పెట్టడానికి సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా దేశం పార్టీ నాయకత్వం, ఆశీర్వాదాలతో నెలకొన్న ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థకు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్’ ద్వారా ఓటర్ల డేటాను అందజేసే ఏర్పాట్లు టీడీపీ నాయకత్వం చేసుకుందన్నది బట్టబయలైంది. 2014లో మోదీ ప్రధాని అయిన సమయానికే డేటా చోరీకి జుకర్‌బర్గ్ అంకురార్పణ చేశాడు. ప్రస్తుతం ఓట్ల వేటలో అన్ని నియమాలను తుంగలో తొక్కి ‘గెలుపు గుర్రం’గా తాను ముద్ర వేయించుకోవాలన్న తాపత్రయంలో చంద్రబాబు చేస్తున్న పని కూడా అదే. ‘‘ప్రపంచవ్యాప్తంగా (భారతదేశం సహా) ఫేస్బుక్ ఉపయోగించే రెండు బిలియన్ల వాడకందార్ల వ్యక్తిగత సమాచారాన్ని (డేటా) తస్కరించడం జరిగిన మాట వాస్తవం. 2013 నుంచి 2015 వరకు సాగుతూ వచ్చిన ఈ సంగతి మా ఫేస్బుక్ కంపెనీకి తెలుసు.’’ – ‘‘ఫేస్బుక్’’ సృష్టికర్త మార్క్ జుకర్‌బర్గ్ అమెరికన్ పార్లమెంట్లో ప్రశ్నల పరంపర సందర్భంగా ఒప్పుకోలు( కేంబ్రిడ్జ్ అనలిటికా) ‘‘జుకర్‌బర్గ్ పద్దతులే అనుసరించి 2019ల ఎన్నికల్లో లబ్ధి పొందేం దుకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నెగ్గడం కోసం 3 కోట్ల 50 లక్షల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా వాడుకుంటోంది. ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తున్న వారి లేదా విమర్శిస్తున్న ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రతిపక్షాల ఓట్లను తొలగించడానికి ప్రభుత్వం కుట్ర బట్టబయలవుతోంది. రెండు తెలుగు ప్రాంతాలకు చెందిన డేటా కుంభ కోణం టీడీపీ యాప్ ‘సేవామిత్ర’నే రూపొందించిన ‘ఐటీ గ్రిడ్స్ ఇండియా’ (ప్రయివేట్ లిమిటెడ్) సంస్థ ఈ డేటా చోరీ కుంభకోణానికి పాల్పడినట్లు గుట్టు రట్టవడంతో టీడీపీ నేతల్లో కలవరానికి దారితీసింది. ఈ కుంభ కోణం గురించి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉన్నత శ్రేణి ఐటీ నిపుణుడు తుమ్మల లోకేశ్వరరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ఏపీ పోలీ సులు (03–03–2019) ప్రయత్నించారు. – పత్రికా వార్తలు: 04–03–2019 ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పాలన అవసానదశలో ఉన్న ‘‘తెలుగుదేశం పార్టీ’’ అధినేత చంద్రబాబు చేష్టలు, నిర్ణయాలు ‘మతితప్పి’ గతితప్పీ సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎందుకో 12వ శతాబ్ది నాటి కల్హణ మహాకవి ‘రాజతరంగిణి’ రచన గుర్తుకొస్తోంది. ఈ సుందరకావ్య పరి శీలనలో ఎందరో రాజులూ, రాజ్యాలు ప్రస్తావనకు వచ్చాయి. నాటి రాజ్యపాలకుల్లో అన్ని రకాల వారు ప్రస్తావనకు వచ్చారు. ప్రజోపయో గకరమైన మంచి పనులు చేసిన రాజులతోపాటు, నీచులు, పిరికి పందలు, స్వార్ధపరులు, పరమ కిరాతకులు, లుబ్ధులైన పాలకులూ ఉన్నారు. బహుశా కల్హణ మహాకవి ఆ రోజుల్లోనే.. ప్రజాస్వామ్యం గురించి పైకి స్తోత్ర పాఠాలు వల్లిస్తూనే వాక్ సభా స్వాతంత్య్రాల పైన బాహాటం గానూ, నర్మగర్భంగానూ సన్నాయి నొక్కులు నొక్కుతూ పాలన సాగించే మోదీలను, చంద్రబాబుల్ని కూడా చూసి ఉంటారు. అందుకే ఆమాంబాపతు పాలకుల్ని గురించి కల్హణ నిశితంగా ప్రస్తా వించి, ఎండగట్టి ఉంటాడు. చరిత్రకారులు నమోదు చేసిన ప్రపంచ చరిత్ర రచనల్లో ఒక మాట హెచ్చరికగా స్పష్టం చేశారు. ‘దేశంలో పాలకుల వల్ల సామాజిక కల్లోలం, సంక్షోభం తలెత్తినప్పుడల్లా చివరికి దురాత్ములు (విలన్లు) కూడా ఖ్యాతిలోకి వస్తుంటార’ని. పట్టుబడితే దొంగ లేకపోతే దొర. ఇలాంటివాళ్ల మనస్సులు ఎంత కల్లోలానికి గురై తడబడుతూ ఉంటాయో మార్క్ జుకర్‌బర్గ్ ఉదంతం తెలుపుతుంది. అమెరికన్ పార్లమెంటులో డెమోక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు రెండు రోజులపాటు 10 గంటలకు పైగా ’ఫేస్బుక్’ కుంభకోణాల గురించి ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు జుకర్‌బర్గ్ ఒళ్లు చల్లబడి వణికిపోతూ అదేపనిగా నీళ్లు తాగుతూ విపరీతంగా తడబడిపోయాడట. అయినా పార్లమెంటు సభ్యులు చివరికి జుకర్‌బర్గ్ నుంచి కోట్లాదిమంది ఫేస్బుక్ వినియోగదార్లకు జరిగిన ఘోరమైన అన్యాయానికి సంబంధించి వివ రాలను రాబట్టగలిగారు. అలా ప్రశ్నించి కొరత వేయగల సత్తా ఉన్న వ్యవస్థలు మనకు లేవు. ఉంటే నిద్రపోతున్నాయి. ఆ సంప్రదాయంతోనే ‘తెలుగుదేశం’ ప్రభుత్వం సోషల్ మీడి యాను మాధ్యమం చేసుకుని తెలుగు ఓటర్లకు ముఖ్యంగా ప్రత్యర్థులకు చెందిన ఓటర్లకు టోపీ పెట్టడానికి సిద్ధమైన సందర్భంగానే రాష్ట్ర వ్యాపితంగా ‘గత్తర’ లేచింది. హైదరాబాద్ కేంద్రంగా దేశం పార్టీ నాయ కత్వం, ఆశీర్వాదాలతో నెలకొన్న ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థకు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్’ ద్వారా ఓటర్ల డేటాను అందజేసే ఏర్పాట్లు టీడీపీ నాయకత్వం చేసుకుందన్నది ప్రచారంలో నలుగుతున్న వార్తలు. ఈ ‘బ్లూ ఫ్రాగ్ మొబైల్’ సంస్థకు అన్ని శాఖల సమాచారాన్ని రాబట్టే పనిని చంద్రబాబు ప్రభుత్వం అప్పచెప్పింది. ఈ బాగోతమంతా సామాజిక కార్యకర్త, ఐటీ రంగ నిపుణుడైన లోకేశ్వర్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు వెల్లడయ్యేంత వరకూ పాలకులు రాష్ట్ర ప్రజల కళ్లు కప్పుతూ వచ్చారు. ఐటీ నిపుణుని ఫిర్యాదు పర్యవసానంగానే ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు అనం తర ‘కర్మకాండ’కు పోలీసులు దిగవలసి వచ్చింది. నిజానికి ఈ భారీ ‘డేటా’ స్కామ్ బహిర్గతం కావడానికి ముందే కొలది మాసాలుగా వివిధ జిల్లాల్లో బెంగళూరు, చెన్నై కేంద్రంగా ఉనికిలో ఉన్న కొన్ని కూపీ సంస్థల వలంటీర్లు ఆధారంగా టీడీపీ నేతలు ఓటర్ల జాబితాల నుంచి తమ ఓటర్లు కాని ప్రత్యర్థి పార్టీల, ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఓటర్ల పేర్లను గుర్తించి, తొలగించే ప్రయత్నం సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు జరిగాయి. ఆ తర్వాత సాధికారికంగా వెల్లడైన ‘దేశం పార్టీ’ నేతల ‘డేటా’ చోరీ! హైదరాబాద్ కేంద్రంగానే ఈ కుంభకోణం జరగడమంటే– తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీ స్థాయిలో గంద రగోళానికి దారితీసిన లక్షలాది ఓటర్ల ఓట్లు గల్లంతైనట్టు వచ్చిన గగ్గో లుకు, ఫిర్యాదులకు కూడా చంద్రబాబు ఆశీస్సులున్న ఈ ‘ఐటీ గ్రిడ్’ సంస్థే కారణమై ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కొత్త పొత్తుకు గజ్జెకట్టి, ఆంధ్రప్రదేశ్ విభజన సూత్రధారిగా చంద్రబాబు తిరిగి స్థానం పొందడానికి ‘పరిగె’లు ఏరుకున్నట్లు నాలుగు సీట్లు సంపాదించడానికి ప్రయత్నించిన సందర్భంగా తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను ‘టాంపర్’ చేసి ఉండరని నమ్మకంగా చెప్పలేం. అందుకు కూడా అప్పట్లో ‘ఐటీ గ్రిడ్’ను వాడుకొని ఉన్నా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన గోపాలకృష్ణ ద్వివేది ‘కారుచీకటిలో కాంతిరేఖ’లా ఓట్లు తొలగించడానికి భారీగా ఏపీలో అక్రమ దరఖాస్తులు వచ్చినమాట వాస్తవమేనని, ఈ విషయాన్ని తాము గుర్తించామనీ, ఆన్లైన్ ద్వారా ఓటర్లకు తెలియకుండా వారి పేర్లతోనే ఇతరుల ‘ఫాం–7’ దరఖాస్తు సమర్పించారని స్వయంగా తెలిపారు. ఇలాంటి అక్రమ చర్యల్ని క్రిమినల్ చర్యలుగా ప్రకటించాలని, నమోదు చేయాలనీ ద్వివేది చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ వాస్తవ ఫిర్యాదులకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం, దాని సంరక్షణ అనేది ప్రజలకు బహు ఖరీదైన విన్యాసంగా మారిందనీ న్యాయవ్యవస్థ గుర్తించాలి. అందుకనే ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్’ అనే గ్రంథాన్ని సమీక్షిస్తూ ఉమామహదేవన్, దాస్ గుప్తాలు ఇలా వ్యాఖ్యానించక తప్పలేదు: ‘‘స్వేచ్ఛగా ఎన్నికలు జరగకుండా ప్రజలకు ప్రజాస్వా మ్యం అనుభవంలోకి రాదు. డబ్బు సర్వాంతర్యామి, అది లేకుండానూ ఎన్నికల నిర్వహణ సాధ్యపడదు. ఆ డబ్బు ఎక్కడనుంచి వస్తుంది, దాన్ని ఎలా వినియోగిస్తున్నారు, దానితో జరిగే లావాదేవీలు ఎలాంటి ప్రభావం కల్గిస్తున్నాయి, ఎన్నికల్లో ఆ ధనం వినియోగం జరుగుతున్న తీరును పరిశీలించేదెవరు? నియంత్రించేదెవరు?’’ 2004 నుంచి 2014 వరకు జాతీయ స్థాయిలో జరిగిన మూడు ఎన్నికలలోనూ పాల్గొన్న 20 వేల మంది అభ్యర్థుల వ్యక్తిగత సంపద పాత్రను అంచనా వేసిన ప్రసిద్ధ విశ్లేషకుడు ‘నీలంజన్ సర్కార్’ ప్రకారం, అభ్యర్థి వ్యక్తిగత సంపదకు, ఎన్నికలో అతడి విజయావకాశానికి మధ్య ఉన్న అనుబంధం రుజువయింది. ఈ పోటా పోటీ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థులు ఇతరులకన్నా 20 రెట్లు ఎక్కువ సంపన్నులున్నారని నీలం జన్ అంచనా. చివరికి వివిధ పార్టీల నుంచి పోటీ చేసే సంపన్న అభ్యర్థులలో కూడా అత్యంత సంపన్నుడుగా ఉన్నవాడికే గెలుపు అవకాశం ఎక్కువగా ఉందని రుజువైంది. ఇప్పుడు ఇలా ఓట్ల వేటలో అన్ని నియ మాలను తుంగలో తొక్కి ‘గెలుపు గుర్రం’గా తాను ముద్ర వేయించు కోవాలన్న తాపత్రయంలో బాబు చేస్తున్న పని కూడా అదే. రోమన్ రిపబ్లిక్ పతనానికి దారితీసింది కూడా ఈ ఓట్ల క్రయ విక్రయాలే (కొనడాలు, అమ్మడాలు)నని రోమన్ మహా చరిత్రకారుడు ప్లూటార్క్ రెండు వేల ఏళ్లనాడే లిఖితం చేశాడు. 2014లో మోదీ ప్రధాన మంత్రి అయిన సమయానికే డేటా చోరీకి జుకర్‌బర్గ్ అంకురార్పణ చేశాడు. ఏపీలో నేటికీ అధికార స్థాయిలో మరొక ‘జుకర్‌బర్గ్’ తయారయ్యాడు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ధన సంచులతో అవినీతికి పాల్పడ టానికి విరుగుడుగా కొన్నాళ్లు ప్రభుత్వమే ‘ఇంత శాతం’ చొప్పున ‘ఫండింగ్’ ఇచ్చే ప్రతిపాదన తెచ్చింది. అది పోయి ‘ఎలక్టోరల్ బాండ్’ విధానం ద్వారా అవినీతి ఎన్నికల వ్యవస్థను ‘నీతిమంతం’ చేసే తలంపుతో బయల్దేరింది. ఇదీ చివరికి ‘కట్టుబానిస’ పద్ధతిలోనే తయారయింది. రాజకీయ పార్టీ ఖర్చు చేసే డబ్బుకి పరిమితులు విధించగల శక్తి ఈ ఎలక్టోరల్ బాండ్లకు లేదనీ, ఈ బాండ్ల పేరిట విదేశీ ధనరాశులు కూడా ఈ రీతిగానే రావొచ్చనీ, చివరికి పతనమవుతున్న కంపెనీ కూడా ఈ బాండ్ల పేరిట రాజకీయ పార్టీలకి డబ్బు ధారాదత్తం చేయవచ్చనీ మాజీ ఎన్నికల కమిషనర్ డీపీ రావత్ పదవీ విరమణ చేస్తూ చేస్తూ ఒక టుమ్రీ విసిరిపోయాడు. ఇదీ మన ప్రజాస్వామ్యం! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏపీ పోలీసులు ఎందుకు ఇలా చేశారో ...
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో ఎంతటి వాళ్లనైనా వదిలేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కేసును ఏపీ పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసుల పనితీరును సీపీ సజ్జనార్ తప్పుబట్టారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...’ మా పరిధిలో కేసు జరుగుతుంటే ఏపీ పోలీసులు ఇష్టారీతిలో కల్పించుకుంటున్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులను రక్షించేందుకు యత్నిస్తున్నారు. డేటా చోరీకి పాల్పడ్డ ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు తమవద్దే ఉన్నారని చెప్పినా, వారి కుటుంబసభ్యులను బెదిరించి స్టేట్మెంట్ తీసుకోవడమే కాకుండా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మేం విచారించిన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ పోలీసులు ఏం అడిగారని తెలుసుకున్నారు. ఒక మిస్సింగ్ కేసు కోసం ఏసీపీ స్థాయి అధికారి వస్తారా?. ఏపీ పోలీసులు ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు. అంతేకాకుండా డేటా చోరీపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని బెదిరించిన కేసులో ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశాం. అత్యంత సున్నితమైన డేటాను ప్రయివేట్ సంస్థలకు ఎలా ఇస్తారు. ఆ అధికారం ఎవరిచ్చారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించాం. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో అశోక్ దాకవరపు తనకు తానుగా లొంగిపోవాలి. చట్టపరంగా దోషులను శిక్షిస్తాం. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా కులాలపరంగా, పథకాల లబ్ధిదారుల పరంగా, ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అనే పూర్తి వివరాల డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. విదేశాల్లో ఉండే నిందితులనే పట్టుకుని స్వదేశానికి తీసుకొస్తున్నాం. అలాంటిది పక్క రాష్ట్రమైన ఏపీలో ఉన్న నిందితులను తెలంగాణకు తీసుకురాలేమా? ఇందుకు బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డ ఏపీ పోలీసులపై కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఏపీ పోలీసులు నన్ను వేధిస్తున్నారు: లోకేశ్వరరెడ్డి
-
‘చంద్రబాబు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు’
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత ఇక్బాల్ విమర్శించారు. అనైతిక, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేందుకు ఆయన కుమారుడు లోకేశ్‌ను ఐటీ శాఖలో చంద్రబాబు ఉంచారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బాబు యత్నిస్తున్నారన్నారు. కావాలనే వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను ఏపీ ప్రభుత్వం తొలగిస్తుందని మండిపడ్డారు. టీడీపీ అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోందన్నారు. అసలు ఏపీ లబ్ధిదారుల డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీకి ఎలా ఇస్తారని ఇక్బాల్ ప్రశ్నించారు. -
డేటా లీక్ వెనక ‘బ్లూ ఫ్రాగ్’ హస్తం?
-
‘పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు’
హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఏపీ ఓటర్ల సమాచారం లీక్ అయ్యిందని ఫిర్యాదు చేస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని కూకట్పల్లి చెందిన లోకేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్ల డేటా ప్రైవేటు సంస్థలు చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తే ఏపీ పోలీసులు తనను వేధిస్తున్నారన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని సీపీ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడిన లోకేశ్వర్‌రెడ్డి.. ‘ఏపీలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. అసలు ఏపీ ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా చేరింది. ఓటర్లను భయభ్రాంతలను గురి చేస్తున్నారు. తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే నాపైనే వేధింపులకు దిగుతున్నారు. దొంగ ఓట్లపై ఒకటిన్నర సంవత్సరంగా పోరాటం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారు. (ఇక్కడ చదవండి: ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణంలో మరో మలుపు) ఒక సామాజిక కార్యకర్తగా, టెక్నికల్ అంశాలు తెలిసిన వ్యక్తిగా నేను ఈ కేసు వేశాను. ఏపీలో దొంగ ఓట్లపై ప్రశ్నించా. నేను కేసు నమోదు చేసినప్పటి నుండి నాపైనే బెదిరింపులకు దిగుతున్నారు. ఏపీ పోలీసులు మా ఇంటిపై దాడి చేశారు. అరగంట పాటు మా ఇంట్లో పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు. ఒక ప్రైవేటు సంస్థకి ఏపీ ప్రజల వివరాలు ఎలా వచ్చాయి. ఏపీ ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తుంది. విచారణ చేయాల్సిన ఏపీ అధికారులు నన్ను వేధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. లక్షల ఓట్లను ఏపీ ప్రభుత్వం తొలగిస్తుంది. నాకు ప్రాణ హానీ ఉంది. నాకు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసుల్ని ఆశ్రయించా. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశా’ అని లోకేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. (ఇక్కడ చదవండి: ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు) -
‘పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు’
-
డేటా లీక్ వెనక ‘బ్లూ ఫ్రాగ్’ హస్తం?
సాక్షి, హైదరాబాద్ : అధికారమే పరమావధిగా, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడు అండ్ కో పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 2016 నుంచే డేటా అక్రమ వినియోగం కోసం ప్రణాళికలు కొన సాగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను తీసుకునేందుకు టీడీపీ తన అధికారిక యాప్ ‘సేవా మిత్ర’ ఉపయోగించుకుంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంబ్రిడ్జ్ అనలిటికాను తలపిస్తున్న టీడీపీ సేవా మిత్రా యాప్ వ్యవహారం వెనుక ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు విశాఖకు చెందిన ‘బ్లూ ఫ్రాగ్’ మొబైల్ టెక్నాలజీ సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్‌కు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన డేటా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఇచ్చినట్లు సమాచారం. ఈ సంస్థ రైతు సహకార సమితి, ఎన్ఆర్ఈజీఎస్, ఏపీ ఇరిగేషన్‌కు సంబంధించి సాంకేతిక సహాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డేటా మొత్తం లీక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా హ్యాకర్స్ చేతికి చిక్కితే... భయంకరమైన పరిణామాలుంటాయని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు డేటాతో బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినందున బ్యాంక్ అకౌంట్ల భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి... ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణంలో మరో మలుపు ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు -
లోకేశ్వర్ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ పోలీసుల యత్నం!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఐటీ గ్రిడ్స్ గుట్టును బట్టబయలు చేయడంతో ఏపీ సర్కార్ వాస్తవాలు కప్పిపుచ్చేందుకు పోలీసులను ఉపయోగిస్తోంది. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద ఏపీ పోలీసులు ఆదివారం భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ...లోకేశ్వర్ రెడ్డిని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. చదవండి...(ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు) మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థలో పని చేస్తున్న తమ నలుగురు సహచరులు కనిపించడం లేదంటూ సహ ఉద్యోగి అశోక్ ...హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ సంస్థకు చెందిన ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సంస్థ ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్ కనిపించడం లేదంటూ... తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, సైబర్‌క్రైం వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ను ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీకి సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో వివాదం రాజుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేవరకు వెళ్లింది. కాగా ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాహకులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక డేటాను సేకరించినట్టు తెలుస్తోంది. డేటా చోరీ వెనుక టీడీపీకి చెందిన పలువురి హస్తం ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాల దగ్గర అత్యంత భద్రంగా ఉండాల్సిన డేటా... బయటికి ఎలా లీక్ అయ్యిందనే అంశంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్‌కు ఈ డేటా ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే డేటా చోరీ వ్యవహారంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి హస్తం ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధార్‌తో సంబంధం ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారానే డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించినట్లు సమాచారం. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ద్వారా ఈ డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థకు అందజేసినట్లు తెలుస్తోంది. -
ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణంలో మరో మలుపు
-
టీడీపీ సర్కార్ బాగోతం మరోసారి బట్టబయలు
సాక్షి, హైదరాబాద్ : 2019లో గెలుపే లక్ష్యంగా యధేచ్చగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ సర్కార్ భాగోతం మరోసారి బట్టబయలు అయింది. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ పేరుతో చేస్తున్న ‘పచ్చ’ కుట్రలను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు అయింది. ప్రజల వ్యక్తిగత డాటాను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను కొట్టేసిన ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ చెందిన పలువురుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడు అశోక్ దాకవరపు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ... టీడీపీకి చెందిన అధికారక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రజల ఓటర్ల ఆధార్ డాటాతో పాటు వ్యక్తిగత వివరాలును ఐటీ గ్రిడ్స్ యధేచ్ఛగా వాడుకుంది. దీంతో ఐటీ గ్రిడ్ కంపెనీ డాటా కుంభకోణంపై వైఎస్సార్ సీపీ నేత లోకేశ్వర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత మూడు రోజుల నుంచి మాదాపూర్‌లోని ఆ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఐటీ గ్రిడ్‌లో పని చేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదంటూ ఆ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భాస్కర్ కోసం ఏపీ పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వచ్చారు. అయితే డాటా చోరీ కేసులో భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని తెలంగాణ పోలీసులు వారికి తెలిపారు. భాస్కర్‌ను తమకు అప్పజెప్పాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరుగుతున్నారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది. సేవా మిత్ర యాప్‌లో... కాగా సేవా మిత్ర యాప్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు ఆధార్ వివరాలు, ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారి వివరాలతోపాటు కలర్ ఫోటో కూడా ఉంది. ఇది ఎన్నికల సంఘం, ఆధార్ నిబంధనలకు విరుద్ధం. అయితే ఆ కంపెనీకి డాటా ఎలా వచ్చిందనే దానికి ఇప్పటికీ ఆధారాల్లేవు. పైగా ఆ కంపెనీకి ప్రమోటర్స్ టీడీపీకి చాలా దగ్గర వ్యక్తులు కావడంతో గోప్యంగా ఉంచాల్సిన డాటాను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి అప్పచెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిప్పులు చెరిగిన చంద్రబాబు... మరోవైపు ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ వ్యవహారం బట్టబయలు కావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో నుంచి బయటపడేందుకు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారు. సాక్షాత్తూ ఏపీ ఐటీ మంత్రి లోకేష్... ముఖ్యమంత్రి కూడా తమ కంపెనీలపై తెలంగాణ ప్రభుత్వం దాడులు చేస్తోందని గగ్గోలు పెట్టడం చూస్తుంటే.. ఏపీలో ఓటర్ల జాబితా నుండి వైఎస్సార్ సీపీ అభిమానుల పేర్లను తొలగించడంలో ఈ కంపెనీయే కీలక పాత్ర పోషిస్తోందన్న విమర్శలున్నాయి.