సాక్షి, గోకవరం, (జగ్గంపేట): రాష్ట్ర ప్రభుత్వమే ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని, 1100 కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి సమస్య చెప్పిన ప్రతి ఒక్కరి డేటా సంగ్రహించి సేవామిత్రకు ఇచ్చారని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరానికి చెందిన నేషనల్, ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎం.శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరిస్తే 72 గంటల్లో దీనిని నిరూపిస్తానని శుక్రవారం జగ్గంపేటలో ఆయన ‘సాక్షి’కి చెప్పారు. తమ ఇండస్ట్రీకి చెందిన ఒక సమస్యపై తాను 1100కు ఫోన్‌చేస్తే ఆధార్ నంబర్ అడిగారని.. నంబర్ చెప్పిన వెంటనే ఆధార్‌లో ఉన్న చిరునామా వారు చెప్పి, ప్రస్తుతం ఉన్న అడ్రస్‌లు అడిగి తెలుసుకున్నారని, అప్పుడే తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ విధంగా 1100కు ఫోన్ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును వారు గుర్తించి డేటాను సేవామిత్రకు అప్పగించారన్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?)
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగినట్లు భావిస్తున్నానన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ద్వారా ఇది జరిగిందని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. సేవామిత్రకు డేటా వెళ్లిందన్న విషయాన్ని రుజువు చెయ్యొచ్చని, ఈ విధంగా చాలా ఓట్లు తీసేశారని నిరూపించవచ్చన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు బయటపెడతానని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడైన ఓ వ్యక్తి సవాల్ విసరడంతో తాను ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేశానని శ్రీధర్ చెప్పారు.
ఇవి చదవండి :
Comments
Please login to add a commentAdd a comment