సాక్షి, న్యూఢిల్లీ : తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ నేతలు ప్లాన్ ప్రకారం రెండేళ్ల నుంచి తొలగిస్తున్నారని వైఎఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సేవామిత్ర యాప్ ద్వారా బూత్‌ల వారిగా ఓట్లను తొలగించారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకంగా సేవామిత్ర యాప్‌కు ప్రభుత్వ సమాచారాన్ని ఇచ్చి నాలుగేళ్లలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఆర్‌టీజీఎస్ ద్వారా సర్వే చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారని చెప్పారు. ఫారం 7 పై టీడీపీ ఇష్టారీతిగా మాట్లాడుతుందని మండిపడ్డారు. డబుల్ ఓట్లపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బాధ్యత కలిగినవారెవరైనా డూప్లికేట్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చెయ్యొచ్చునన్నారు. డూప్టికేట్ ఓట్లు కావాలని టీడీపీ ఎందుకు కోరుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు విచ్చల విడిగా జీవోలు జారీ చేశారని ఆరోపించారు. రహస్యం పేరుతో జీవోల సమాచారాన్ని దాచిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక పద్దతిలో ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment