
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ తమ దగ్గరే ఉన్నట్లు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇంఛార్జ్ మల్యాద్రి పేర్కొన్నారు. ఇప్పటికే అశోక్‌కు సైబరాబాద్ పోలీసులు 161 సీఆర్పీసీ కింద నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అయితే అశోక్ తమ దగ్గరే ఉన్నారని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మల్యాద్రి వెల్లడించారు. అశోక్‌తో తాము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నామన్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులకు అశోక్‌ను అప్పగించబోమని అన్నారు.
కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేయడంతో ఐటీ గ్రిడ్ స్కామ్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్.. తమ ఉద్యోగులు కనిపించడంలేదంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment