
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రంగారెడ్డి కోరక్టు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో అశోక్, అతని భార్య శ్రీ లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కేసుల రద్దు కోసం ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం , ముంబై , బెంగళూరులో అతని కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment