![Telangana High Court Grants Bail To IT Grids CEO Ashok - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/10/ashok.jpg.webp?itok=GTL08Qal)
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్‌ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment