
సాక్షి, హైదరాబాద్ : అధికారమే పరమావధిగా, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడు అండ్ కో పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 2016 నుంచే డేటా అక్రమ వినియోగం కోసం ప్రణాళికలు కొన సాగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను తీసుకునేందుకు టీడీపీ తన అధికారిక యాప్ ‘సేవా మిత్ర’ ఉపయోగించుకుంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంబ్రిడ్జ్ అనలిటికాను తలపిస్తున్న టీడీపీ సేవా మిత్రా యాప్ వ్యవహారం వెనుక ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు విశాఖకు చెందిన ‘బ్లూ ఫ్రాగ్’ మొబైల్ టెక్నాలజీ సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్‌కు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన డేటా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఇచ్చినట్లు సమాచారం. ఈ సంస్థ రైతు సహకార సమితి, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఏపీ ఇరిగేషన్‌కు సంబంధించి సాంకేతిక సహాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డేటా మొత్తం లీక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా హ్యాకర్స్ చేతికి చిక్కితే... భయంకరమైన పరిణామాలుంటాయని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు డేటాతో బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినందున బ్యాంక్ అకౌంట్ల భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి...
ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణంలో మరో మలుపు
Comments
Please login to add a commentAdd a comment