ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఐటీ గ్రిడ్స్ గుట్టును బట్టబయలు చేయడంతో ఏపీ సర్కార్ వాస్తవాలు కప్పిపుచ్చేందుకు పోలీసులను ఉపయోగిస్తోంది. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద ఏపీ పోలీసులు ఆదివారం భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ...లోకేశ్వర్ రెడ్డిని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు.