అధికారమే పరమావధిగా, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడు అండ్ కో పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 2016 నుంచే డేటా అక్రమ వినియోగం కోసం ప్రణాళికలు కొన సాగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను తీసుకునేందుకు టీడీపీ తన అధికారిక యాప్ ‘సేవా మిత్ర’ ఉపయోగించుకుంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంబ్రిడ్జ్ అనలిటికాను తలపిస్తున్న టీడీపీ సేవా మిత్రా యాప్ వ్యవహారం వెనుక ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు విశాఖకు చెందిన ‘బ్లూ ఫ్రాగ్’ మొబైల్ టెక్నాలజీ సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.