తెలుగుదేశం పార్టీ ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమాచార సేకరణలో ఐటీ చట్టాలను తుంగలో తొక్కింది. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన యాప్ కావడంతో ప్రభుత్వ వెబ్‌సైట్లలోని డేటాను యథేచ్ఛగా దోచేసింది. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ డాకవరం కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను పణంగా పెట్టి టీడీపీ ఈ యాప్ తయారీని ప్రోత్సహించిన తీరు బయట పడుతోంది.