
సాక్షి, హైదరాబాద్ : డాటా చోరీకి పాల్పడలేదని చెబుతున్న టీడీపీ.. తమ వెబ్‌సైట్ సేవామిత్ర యాప్‌ను ఎందుకు క్లోజ్ చేసిందో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో తాము అడిగిన ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. బుకాయింపు ధోరణిని టీడీపీ అవలంబించడం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధి బయటపడ్డ తాజా వీడియోని ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయడం లేదని నిలదీశారు.